Google AI CEO sensational comments: ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్.. ప్రస్తుతం అది ఇది అనే తేడా లేకుండా అన్నిరంగాల్లోకి ఏఐ దూసుకొస్తోంది. ఇప్పటికే చాలా రంగాలకు విస్తరించింది. ఇక ఏఐ చేస్తున్న మాయ అంతా ఇంతా కాదు. సమస్య ఏదైనా పరిష్కారం చూపుతోంది. ఐటీ ఇంజినీర్స్, డాక్టర్స్ కూడా చేయలేని పనులు చేస్తూ ఆశ్చర్యపరుస్తోంది. దీంతో ఇప్పటికే ఐటీ సంస్థలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. అయితే ఏఐ రాక కొన్ని రంగాలకు మేలు జరగుతున్నా.. మానవ మేధా శక్తిని అధిగమించలేవని నిపుణులు అంటున్నారు. మనం తయారు చేసిన ఏఐపై మన కంట్రోల్ లేకుండా పోవడంపై కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో గూగుల్ ఏఐ సీఈవో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో గూగుల్ డీప్‌మైండ్ సీఈవో డెమిస్ హస్సాబిస్, జెమిని, చాట్‌జీపీటీ వంటి ఏఐలు అంతర్జాతీయ మ్యాథ్స్ ఒలింపియాడ్‌లో గోల్డ్ మెడల్స్ సాధించినా, సాధారణ మ్యాథ్స్‌లో కూడా తప్పులు చేస్తాయని హెచ్చరించారు.
ప్రస్తుత ఏఐ లోపాలు
ఒలింపియాడ్ స్థాయి క్లిష్ట సమస్యలు పరిష్కరించగలిగినా, సరళ లెక్కల్లో కూడా విఫలం అవుతాయి. కంటిన్యూయల్ లెర్నింగ్ లేకపోవడం, లాంగ్–టర్మ్ ప్లానింగ్ సామర్థ్యం లేకపోవడం, ఒకే రంగంలో కూడా అస్థిరత (’జాగ్డ్ ఇంటెలిజెన్స్’) ప్రధాన లోపాలు అని డెమిస్ తెలిపారు. ట్రైనింగ్ తర్వాత మోడల్స్ ’ఫ్రోజన్’ అవుతాయి, కొత్త అనుభవాల నుంచి నేర్చుకోలేవు అని వెల్లడించారు.
ఏజీఐకి మార్గం..
సంక్షిప్త కార్యాల్లో రాణిస్తున్న ఏఐ, స్థిరమైన వ్యూహాత్మక ఆలోచనలు, స్థిరత్వం లేకుండా ఏజీఐ సాధ్యం కాదు. హస్సాబిస్ ప్రకారం, మానవుల్లాగా అనుభవాల నుంచి నిరంతరం నేర్చుకునే సిస్టమ్స్ అవసరం.
ఏఐ ప్రధాన ఉపయోగం మానవ ఆరోగ్య మెరుగుదల అని హస్సాబిస్. ఇసోమార్ఫిక్ ల్యాబ్స్‌లో డ్రగ్ డిస్కవరీ వేగవంతం చేస్తూ, 10–20 సంవత్సరాల్లో అన్ని వ్యాధులకు పరిష్కారాలు కనుగొనే అవకాశం ఉందని అంచనా.