Acharya Chanakya Neeti: ఇప్పటికీ కూడా ఆచార్య చాణిక్యుడు నీతి శాస్త్రంలో ఉన్న నియమాలను అనేకమంది పాటించి తమ జీవితంలో విజయం కూడా సాధించారు. మనిషి కెరియర్ దగ్గర నుంచి వైవాహిక జీవితం వరకు అనేక నియమాల గురించి ఆచార్య చాణిక్యుడు తన నీతి శాస్త్రంలో సూచించారు. అలాగే మనిషికి ఉండే రెండు ప్రధాన అలవాట్ల కారణంగా ఆ మనిషి దుఃఖానికి కారణం అని కూడా ఆచార్య చాణిక్యుడు తెలిపాడు. ఒక మనిషి జీవితానికి నాశనం చేయడానికి అతనికి ఉండే ఈ రెండు ప్రధాన అలవాట్లే కారణం. మానవ జీవితానికి సంబంధించిన అనేక విషయాల గురించి నీతి శాస్త్రంలో ఆచార్య చాణిక్యుడు తెలిపాడు. నీతి శాస్త్రంలో ఆచార్య చాణిక్యుడు తెలిపిన అనేక సూత్రాలను మనిషి తన జీవితంలో పాటించడం వలన విజయం సాధించడంతోపాటు ఆనందంగా కూడా జీవించవచ్చు. ఆయన చెప్పిన దాని ప్రకారం ఈ రెండు అలవాట్లు ఆ మనిషి నాశనానికి దారితీస్తాయి. వాళ్లు ఎప్పటికీ కూడా తమ జీవితంలో విజయం సాధించలేరు. ఒక మనిషికి ఉండే కోపం మరియు అహంకారం అనే రెండు అలవాట్లు ఆ మనిషి నాశనానికి దారి తీస్తాయట. ఈ రెండు అలవాట్ల కారణంగా మనిషి తనకు తానే శత్రువుగా కూడా మారుతాడు అని చాణిక్యుడు చెప్తున్నాడు. ఒక మనిషికి ఉండే కోపం అతని ఆలోచన శక్తిని మరియు అవగాహన శక్తిని పూర్తిగా నాశనం చేస్తుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని బలహీనపరుస్తుంది. కోపంగా ఉన్న సమయంలో ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటాము.
అలా తీసుకున్న నిర్ణయాలపై ఆ తర్వాత చింతించాల్సి వస్తుంది. ఈ క్రమంలో కొన్ని నష్టాలను కూడా ఎదుర్కోవలసి వస్తుంది. కోపంలో ఉన్నప్పుడు మనిషికి మనిషికి మధ్య సంబంధాలు చెడిపోయే ప్రమాదం ఉంది. అలాగే మానసిక వత్తిడి కూడా పెరుగుతుంది. కోపంలో ఉన్న సమయంలో తీసుకున్న నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు అయ్యే అవకాశం ఉంది. వృత్తి జీవితం కూడా ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆచార్య చాణిక్యుడు నీతి శాస్త్రం ప్రకారం కోపంగా ఉన్న సమయంలో లోతైన శ్వాస తీసుకుని ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. కోపంగా ఉన్న సమయంలో మౌనం పాటించడం మంచిది.
Also Read : చాణక్యనీతి: జీవితంలో ఆనందం నిండాలంటే ఇలా చేయండి..
ధ్యానం లేదా యోగా వంటివి చేయాలి. ఒక మనిషికి ఉండే అహంకారం కూడా అతని విజయాన్ని నాశనం చేసే ప్రమాదం ఉంది. ఎవరికైనా విజయం వచ్చినప్పుడు అతను ఇతరులకును తక్కువగా చూడడం తనను తాను ఎక్కువగా గొప్పగా భావించడం వంటివి ప్రారంభిస్తాడు. ఈ క్రమంలో సంబంధాలు దూరం అయ్యే అవకాశం ఉంది. కొత్తగా నేర్చుకునే కోరికను కోల్పోతాడు. ఆ విజయం శాశ్వతం కాదు. అహంకారం విధ్వంసానికి కారణం కూడా అవుతుంది. సమాజంలో గౌరవం కూడా తగ్గిపోయే ప్రమాదం ఉంది.