Age is just a number : కొందరైతే 8 పదుల వయసు వచ్చినా ఉత్సాహంగా ఉంటారు. ఆనందంగా గడుపుతుంటారు. తమ పని తాము చేసుకుంటారు. ఇతరుల మీద ఆధారపడకుండా ఆరోగ్యంగా ఉంటారు. కనీసం జ్వరం కూడా వారికి రాదు. మందు బిళ్ల, సూది మందు వేసుకునే అవకాశం కూడా వారికి ఉండదు. పైగా ఎంతో ఉత్సాహంతో ఉంటారు. తమ పని తాము చేసుకోవడమే కాదు.. ఇతర పనులు కూడా చేస్తూ ఆదర్శంగా నిలుస్తుంటారు. ఈ కథనంలో మీరు చదవబోయే ఈ వృద్ధురాలి వృత్తాంతం కూడా అలాంటిదే.. ఆమెకు 77 సంవత్సరాలు. సాధారణంగా ఈ వయసులో ఉన్న మహిళలు అనారోగ్యాల బారిన పడుతుంటారు. మంచానికి పరిమితమై తీవ్రంగా ఇబ్బంది పడుతుంటారు. కానీ ఈ 77 సంవత్సరాల మహిళకు మాత్రం అలాంటి అవసరం లేదు. పైగా ఆమె ఈ వయసులో కూడా ట్రాక్టర్ నడుపుతోంది. ఎటువంటి అనారోగ్యానికి గురికాకుండానే.. ఎంత ఉత్సాహంగా పనులు చేస్తోంది.
పంజాబ్ రాష్ట్రానికి చెందిన బి బి నవ్ రూప్ కౌర్ వయసు 77 సంవత్సరాలు. ఆమెకు అప్పట్లోనే వివాహం జరిగింది. వివాహం జరిగినప్పుడు ఆమె వయసు 15 సంవత్సరాలు మాత్రమే. సహజంగా పంజాబ్ రాష్ట్రంలో మహిళలు వ్యవసాయంలో విపరీతంగా కష్టపడుతుంటారు. దీనికి నవ్ రూప్ కౌర్ మినహాయింపు కాదు. పైగా ఆమె వ్యవసాయం చేస్తూనే చదువుకుంది. ప్రభుత్వ టీచర్ ఉద్యోగం సాధించింది. అప్పట్లో వ్యవసాయం చేస్తున్నప్పుడు నవ్ రూప్ కౌర్ వ్యవసాయం పనిచేస్తూనే అప్పట్లోనే ట్రాక్టర్ నడపడం నేర్చుకుంది. ప్రభుత్వ టీచరుగా పదవి విరమణ చేసిన తర్వాత.. ఖాళీగా ఉండకుండా నవ్ రూప్ కౌర్ ట్రాక్టర్ నడుపుకుంటూ వ్యవసాయం చేస్తున్నది. తనకున్న పొలంలో పంటలు పండిస్తున్నది.
కౌర్ తాతకు పంజాబ్ లో మంచి పేరు ఉంది. ఆయన పేరు మీద ఆమె ఒక స్కూల్ గతంలోని ప్రారంభించింది. దానిని విజయవంతంగా నడిపింది. విద్యార్థులను పాఠశాలకు తీసుకురావడానికి స్కూల్ బస్సు ఏర్పాటు చేసి.. దానిని ఆమె స్వయంగా నడిపి చూపించింది. అప్పట్లో ఆమె బస్సు తోలుతుంటే చుట్టుపక్కల జనాలు ఆశ్చర్యంగా చూసేవారు. ఇక కౌర్ ప్రభుత్వ పాఠశాల టీచర్ గా పనిచేసే మంచి పేరు తెచ్చుకుంది. ఎంతోమంది విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దింది. రిటైర్ అయిన తర్వాత చుట్టుపక్కల పిల్లలకు పాఠాలు చెబుతూనే.. ఆమె వ్యవసాయం చేస్తోంది. ఆమె పండించిన పంటలను కూడా స్థానికంగా విక్రయిస్తోంది..” నాకు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. నా కుటుంబ సభ్యులు ప్రోత్సహించారు. గతంలో వ్యవసాయం చేసినప్పుడు ట్రాక్టర్ నడిపాను. ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత వ్యవసాయం చేస్తున్నాను. దీనివల్ల మానసికంగా, శారీరకంగా సంతృప్తి లభిస్తున్నది. అప్పట్లో స్కూలుకు వెళ్లాలని హడావిడి ఉండేది. ఇప్పుడు రిటైర్ అయ్యాను కాబట్టి వ్యవసాయాన్ని ఒక వ్యాపకంగా చేసుకున్నానని” కౌర్ చెబుతున్నారు.