Good news for farmers: దేశానికి వెన్నెముక రైతు అంటారు. రైతు బాగుంటేనే ఆహారం ఉత్పత్తి అవుతుంది. రైతు బాగుంటేనే దేశం బాగుపడుతుంది. రైతు బాగుంటేనే అందరికీ సరైన విధంగా ఆహారం లభ్యమవుతుంది. అలాంటి రైతులను ఎప్పటికీ కాపాడుకోవాల్సిన అవసరం పై ఉంది. అయితే రైతులకు ప్రత్యేకంగా పథకాలను ప్రకటిస్తూ.. వారి అభివృద్ధికి అనేక రకాలుగా ఇతరులు సైతం సహాయం చేస్తున్నారు. ప్రస్తుతం అన్ని రంగాల్లో టెక్నాలజీ అందుబాటులోకి వస్తుంది. అలాగే వ్యవసాయంలోకి కూడా ఇప్పుడిప్పుడే సాంకేతికం ఎంట్రీ ఇస్తోంది. అయితే ప్రస్తుతం రైతుల మధ్య కమ్యూనికేషన్ ఉండేందుకు.. రైతుల అవసరాలు తీరేందుకు కొన్ని రకాల యాప్ లు అందుబాటులోకి వచ్చా. వాటిలో ఈ యాప్ వల్ల ఎంతో ఉపయోగపడే అవకాశం ఉంది. మరి ఆ యాప్ ఏదో ఇప్పుడు చూద్దాం..
కొందరు రైతులు తమ పంటను విక్రయించాలని అనుకుంటారు.. కానీ సరైన కొనుగోలుదారుడు లభించడు. ఇలాంటి అప్పుడు ఆ రైతు తన పంట కొనే వారి గురించి తెలుసుకునేందుకు మొబైల్లో ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకొని వారి వివరాలు తెలుసుకోవచ్చు. ఆ యాప్ పేరు Rythuvaaradhi. ఈ యాప్ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఉదాహరణకు ఒక రైతు తన పంటపై రుణం తీసుకోవాలని అనుకుంటాడు. అయితే అందుకు సంబంధించిన వివరాలు అందిస్తే రుణం తీసుకునేందుకు అర్హుడేనా? లేదా? అనేది తెలుస్తుంది. అంతేకాకుండా ఇప్పటికే రుణం తీసుకున్న వారు ఆ మొత్తానికి ఎంత వడ్డీ జమ అయ్యింది? ఎంత కట్టాల్సి ఉంటుంది? అనే వివరాలు కూడా తెలుసుకోవచ్చు. అలాగే సమీపంలో ఎలాంటి బ్యాంకు రుణం ఇవ్వడానికి ఆస్కారం ఉంది అనే విషయాలను కూడా తెలుసుకోవచ్చు.
రైతులు ప్రస్తుతం వ్యవసాయం మాత్రమే కాకుండా పాడి పరిశ్రమను కూడా అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో భాగంగా పశువుల అమ్మకం, కొనుగోలు చేస్తుంటారు. అయితే తమ వద్ద ఉన్న పశువుల వివరాలు ఇతరులకు తెలియడానికి ఈ యాప్ ఎంతో ఉపయోగపడుతుంది. తమ వద్ద ఏదైనా పశువు విక్రయించాలని అనుకుంటే అందుకు సంబంధించిన ఫోటో తీసి ఇమేజ్ అప్లోడ్ చేయాలి. అలాగే ఎవరైనా పశువులు కొనుగోలు చేయాలని చూస్తే ఇందులో వాటి వివరాలు ఉంటాయి. వాటిపై క్లిక్ చేసి నెంబర్ డిస్ప్లే అయితే కాంటాక్ట్ కావచ్చు.
ఇక రైతులు తమ పంటకు భూమి అనుకూలమైనదా? కాదా? అన్న విషయాన్ని కూడా తెలుసుకోవచ్చు. ఎటువంటి భూమిలో ఏ రకమైన పంట వేయాలి? ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనే విషయాలను కూడా ఈ యాప్ అందిస్తుంది. రైతులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ యాప్ అందిస్తుంది.