New Labor Code: కేంద్ర ప్రభుత్వం ఇటీవల నాలుగు కొత్త లేబర్ కోడ్ లను అమలులోకి తీసుకువచ్చింది. ఈ లేబర్ కోడ్ లు కార్మికులు, ఉద్యోగులకు ఎన్నో రకాలుగా ప్రయోజనాలు ఉన్నాయని కొందరు చెబుతున్నారు. అయితే ఉద్యోగ సంఘాల నాయకులు మాత్రం ఇవి కంపెనీలు, సంస్థల యాజమాన్యాలు ఏర్పాటు చేసుకున్న కోడ్ లు అని ఆరోపిస్తున్నాయి. అయితే కొత్తగా వచ్చిన లేబర్ కోడ్ లో ఉద్యోగ కార్మికులు అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. చాలామంది వీటిపై అవగాహన లేకుండా కొన్ని పొరపాట్లు చేస్తున్నారు. ఈ పొరపాట్ల వల్ల వారి జీవితం చిన్నాభిన్నం అవుతోంది. ఇంతకీ ఆ పొరపాట్లు ఏవో ఇప్పుడు చూద్దాం..
కొత్తగా వచ్చిన లేబర్ కోడ్ ఉద్యోగులకు ప్రయోజనాలు చేకూర్చే మాట వాస్తవమే. గతంలో ఉన్న కోడ్ లను సవరించి కొత్తగా ఉద్యోగులకు ప్రయోజనాలు చేకూర్చేలా మార్చారు. అయితే వీటిలో గ్రాట్యూటీ గురించి మాట్లాడుకోవాలి. ఒకప్పుడు ఒక ఉద్యోగి ఒక సంస్థ లేదా కంపెనీలో ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంటేనే గ్రాడ్యుటి ఇచ్చేవారు. అంటే ఒక వ్యక్తి ఐదు సంవత్సరాలు పనిచేసిన తర్వాత అతనికి అదనంగా కొంత ఆదాయంతో సెటిల్మెంట్ చేసి ఇచ్చేవారు. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన లేబర్ కోడ్ ప్రకారం ఒక సంవత్సరం పని చేస్తే చాలు.. గ్రాట్యూటీ ఇవ్వాలని నిర్ణయించారు.
దీంతో చాలామంది ఈ విషయాన్ని తప్పుడుగా అర్థం చేసుకుంటున్నారు. కొత్తగా వచ్చిన ఈ నియమం పర్మినెంట్ ఉద్యోగులకు కాదు అని.. Fixed Term EmplOyeesకు మాత్రమేనని అవగాహన పెంచుకోవాలి. ఒక కంపెనీ లేదా సంస్థ కొన్ని రోజుల నిమిత్తం Fixed Term EmplOyees ను నియమించుకుంటుంది. వీరిని ఆరు నెలలు లేదా కొన్ని నెలల పాటు ఒప్పందంతో నియమించుకొని ఆ తర్వాత ఒప్పందం తీరిన తర్వాత వారిని తీసివేసే అధికారం ఉంటుంది. అయితే ఇలా నియమించుకున్న వారు ఏడాది పూర్తి చేస్తే మాత్రమే వారికి గ్రాట్యూటీ ఇవ్వాలని కొత్తగా వచ్చిన లేబర్ కోడ్ తెలుపుతోంది. అంటే సంస్థ లేదా కంపెనీ ఒకటి లేదా రెండు సంవత్సరాల పాటు ఇలాంటి ఉద్యోగులను నియమించుకుంటే వారికి మాత్రమే గ్రాట్యూటీ చెల్లిస్తుంది.
అయితే చాలామంది పర్మినెంట్ ఉద్యోగులు రెండు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాల పాటు పని చేసిన వారు తమకు డబ్బు అవసరమై ఉండి గ్రాట్యూటీ కోసం రిజైన్ చేయాలని అనుకుంటున్నారు. ఇటీవల ఒక కంపెనీలో ఎక్కువ మొత్తంలో డబ్బు వస్తుందని రిజైన్ చేయడానికి వెళ్ళగా అసలు విషయం తెలిసి ఆందోళన చెందాడు. అందువల్ల లేబర్ కోడ్ విషయాన్ని పూర్తిగా చదవాలని లేదా తెలుసుకోవాలని కొందరు ఆర్థిక నిపుణులు తెలుపుతున్నారు. అలాగే మిగతా విషయాల్లో కూడా ఉన్న నియమాలను పూర్తిగా చదివిన తర్వాతే సరైన నిర్ణయాలు తీసుకోవాలని అంటున్నారు.