క్రెడిట్ కార్డు బిల్లును సులభంగా చెల్లించే ఛాన్స్ .. ఎలా అంటే..?

మనలో చాలామంది క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేక చాలా సందర్భాల్లో ఇబ్బందులు పడుతుంటారు. కరోనా వల్ల, లాక్ డౌన్ నిబంధనల వల్ల ఆదాయం అంతకంతకూ తగ్గుతుంటే ఖర్చులు మాత్రం ఊహించని స్థాయిలో పెరుగుతున్నాయి. అయితే క్రెడిట్ కార్డు బిల్లును క్రెడిట్ కార్డుతోనే సులభంగా చెల్లించవచ్చు. సాధారణంగా క్రెడిట్ కార్డు బిల్లును చెల్లించే ఆప్షన్లలో క్రెడిట్ కార్డ్ కనిపించదనే సంగతి తెలిసిందే. పేటీఎం వాలెట్‌కు క్రెడిట్ కార్డు ద్వారా డబ్బులు యాడ్ చేసుకుంటే సులభంగా క్రెడిట్ కార్డు బిల్లును […]

Written By: Navya, Updated On : May 22, 2021 12:22 pm
Follow us on

మనలో చాలామంది క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేక చాలా సందర్భాల్లో ఇబ్బందులు పడుతుంటారు. కరోనా వల్ల, లాక్ డౌన్ నిబంధనల వల్ల ఆదాయం అంతకంతకూ తగ్గుతుంటే ఖర్చులు మాత్రం ఊహించని స్థాయిలో పెరుగుతున్నాయి. అయితే క్రెడిట్ కార్డు బిల్లును క్రెడిట్ కార్డుతోనే సులభంగా చెల్లించవచ్చు. సాధారణంగా క్రెడిట్ కార్డు బిల్లును చెల్లించే ఆప్షన్లలో క్రెడిట్ కార్డ్ కనిపించదనే సంగతి తెలిసిందే.

పేటీఎం వాలెట్‌కు క్రెడిట్ కార్డు ద్వారా డబ్బులు యాడ్ చేసుకుంటే సులభంగా క్రెడిట్ కార్డు బిల్లును సులభంగా కట్టవచ్చు. ఆల్‌ సర్వీసెస్ ఆప్షన్‌లోకి వెళ్లి మంత్లీ బిల్స్‌పై క్లిక్ చేసి క్రెడిట్ కార్డు బిల్లు ఆప్షన్ వాలెట్ నుంచి క్రెడిట్ కార్డు బిల్లును సులభంగా చెల్లించే అవకాశం ఉంటుంది. అయితే ఈ విధంగా క్రెడిట్ కార్డు ద్వారా డబ్బులు యాడ్ పేటీఎం వాలెట్ కు యాడ్ చేయాలంటే 2 నుంచి 3 శాతం ఛార్జీలను చెల్లించాలి.

పేటీఎం వాలెట్ నుంచి క్రెడిట్ కార్డ్ బిల్లును చెల్లిస్తే ఎటువంటి ఛార్జీలను అదనంగా చెల్లించాల్సిన అవసరం ఉండదు. మొబిక్విక్ ద్వారా కూడా సులభంగా క్రెడిట్ కార్డు బిల్లును చెల్లించవచ్చు. క్రెడిట్ కార్డు బిల్లును సరైన సమయంలో చెల్లించకపోతే భారీ ఛార్జీలు చెల్లించుకోవాల్సి ఉంటుంది. అందువల్ల ప్రతినెలా కరెక్ట్ టైమ్‌కి ఈఎంఐ చెల్లిస్తే మంచిదని చెప్పవచ్చు.

ప్రభుత్వ బ్యాంకులతో పోలిస్తే ప్రైవేట్ బ్యాంకులలో ఛార్జీలు ఎక్కువగా ఉండటం గమనార్హం. క్రెడిట్ కార్డ్ తీసుకున్నా కార్డును ఎక్కువగా వినియోగించాల్సిన అవసరం లేకపోతే కార్డును వెంటనే క్లోజ్ చేస్తే మంచిదని చెప్పవచ్చు.