https://oktelugu.com/

క్రికెట్: ఇంగ్లండ్ టూర్.. ఇండియాకు ఊరట

ఇంగ్లండ్ లో జరిగే ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ కోసం వెళ్లే టీమిండియాకు ఊరట లభించింది. దాదాపు 3 నెలల పాటు భారత జట్టు ఇంగ్లండ్ లో పర్యటించనుంది. ముందుగా న్యూజిలాండ్ తో ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ లో పాల్గొననుంది. ఆ తర్వాత ఇంగ్లండ్ తో 5 టెస్టులు, వన్డేలు, టీ20ల్లో ఆడనుంది. ఇందుకోసం ఇప్పటికే కోహ్లీ సేన కుటుంబాలతో సహా ముంబైలోనే క్వారంటైన్ లో ఉంటున్నారు. సుధీర్ఘ పర్యటన కావడం.. కరోనా బయో బబుల్ […]

Written By: NARESH, Updated On : May 22, 2021 11:44 am
Follow us on

kohli

ఇంగ్లండ్ లో జరిగే ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ కోసం వెళ్లే టీమిండియాకు ఊరట లభించింది. దాదాపు 3 నెలల పాటు భారత జట్టు ఇంగ్లండ్ లో పర్యటించనుంది. ముందుగా న్యూజిలాండ్ తో ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ లో పాల్గొననుంది. ఆ తర్వాత ఇంగ్లండ్ తో 5 టెస్టులు, వన్డేలు, టీ20ల్లో ఆడనుంది. ఇందుకోసం ఇప్పటికే కోహ్లీ సేన కుటుంబాలతో సహా ముంబైలోనే క్వారంటైన్ లో ఉంటున్నారు.

సుధీర్ఘ పర్యటన కావడం.. కరోనా బయో బబుల్ ఆంక్షల నేపథ్యంలో క్రికెటర్లు ఒత్తిడికి గురికాకుండా కుటుంబ సభ్యూలూ క్రికెటర్లతోపాటు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్తున్నారు. దీంతో వారికి ఉపశమనం లభించనుంది.

అయితే ఇండియాలో క్వారంటైన్ లో ఉంటున్న కోహ్లీ సేనకు ఇంగ్లండ్ లో కేవలం 3 రోజులు మాత్రమే కఠిన క్వారంటైన్ ను ఇంగ్లండ్ బోర్డు పెట్టింది. ఇదివరకు 10రోజులు అనడంతో బీసీసీఐ చర్చలు జరిపింది. దీంతో క్వారంటైన్ ఆంక్షలను ఇంగ్లండ్ బోర్డు సడలించింది. జూన్ 2న కోహ్లీ సేనతోపాటు టీమిండియా మహిళా క్రికెటర్లు కూడా ఇంగ్లండ్ పర్యటనకు ఒకే చార్టెడ్ విమానంలో బయలు దేరుతారు.

జూన్ 18-22 వరకు టీమిండియా, న్యూజిలాండ్ మధ్య ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ సౌంతాంప్టన్ లో జరుగనుంది. ఆ తర్వాత ఆగస్టు 4 నుంచి సెప్టెంబర్ 14 వరకు ఇంగ్లండ్ తో ఐదు టెస్టుల సిరీస్ సాగనుంది. తర్వాత వన్డేలు, టీ20లు ఉండనున్నాయి.