Ghibli AI Cars
Ghibli AI Cars: సోషల్ మీడియాలో ప్రస్తుతం AI రూపొందించిన ఘిబ్లీ (Ghibli) ఇమేజ్‌లు ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఫేస్‌బుక్, X (ట్విట్టర్), వాట్సాప్ వంటి వేదికలపై ప్రజలు తమ ఘిబ్లీ ఇమేజ్‌లను షేర్ చేసుకుంటున్నారు. ఈ ట్రెండ్‌లో మారుతి వ్యాగన్ఆర్, స్విఫ్ట్, బాలెనో, ఎర్టిగా, ఫ్రాంక్స్, డిజైర్, టాటా పంచ్, నెక్సాన్, హ్యుందాయ్ క్రెటా, మహీంద్రా స్కార్పియో వంటి కార్లు కూడా చేరాయి. ఈ కార్ల ఘిబ్లీ అవతార్‌లను ఒకసారి చూద్దాం.
మారుతి వ్యాగన్ఆర్ ఘిబ్లీ అవతార్
మారుతి సుజుకి వ్యాగన్ఆర్‌లో 7-అంగుళాల స్మార్ట్‌ప్లే స్టూడియో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, క్లౌడ్ బేస్డ్ సర్వీస్, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబీడీ, రివర్స్ పార్కింగ్ సెన్సార్, హిల్-హోల్డ్ అసిస్ట్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. దీని 1.0-లీటర్ మూడు-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ లీటరుకు 25.19కి.మీ. మైలేజ్‌ను ఇస్తుంది, అయితే CNG వేరియంట్ కిలోకు 34.05కిమీ వరకు మైలేజ్‌ను అందిస్తుంది.
మారుతి ఫ్రాంక్స్ ఘిబ్లీ అవతార్
మారుతి ఫ్రాంక్స్‌లో 1.0-లీటర్ టర్బో బూస్టర్‌జెట్ ఇంజన్ ఉంది, ఇది 5.3 సెకన్లలో 0 నుండి 60కిమీ వేగాన్ని అందుకుంటుంది. ఇందులో అడ్వాన్స్‌డ్ 1.2-లీటర్ K-సిరీస్ డ్యూయల్ జెట్, డ్యూయల్ VVT ఇంజన్ కూడా అందుబాటులో ఉంది. ఈ కారులో హెడ్-అప్ డిస్‌ప్లే, క్రూయిజ్ కంట్రోల్, 16-అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, వైర్‌లెస్ ఛార్జింగ్, 6-స్పీకర్ సౌండ్ సిస్టమ్, 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
మహీంద్రా స్కార్పియో ఘిబ్లీ అవతార్
మహీంద్రా స్కార్పియో Nలో 2.0-లీటర్ mStallion పెట్రోల్, 2.2-లీటర్ mHawk డీజిల్ ఇంజన్ అందుబాటులో ఉన్నాయి. ఇది 6-స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. టాప్ వేరియంట్‌లో ఫోర్-వీల్ డ్రైవ్ (4WD) సిస్టమ్ కూడా అందించారు. ఈ SUV గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
టాటా నెక్సాన్ ఘిబ్లీ అవతార్
టాటా నెక్సాన్ స్మార్ట్ +, ప్యూర్ +, క్రియేటివ్ , ఫియర్‌లెస్ + PS ట్రిమ్‌లకు కొత్త ఫీచర్లు వస్తాయి. స్మార్ట్ + ట్రిమ్‌లో వీల్ క్యాప్‌లతో వస్తుంది. అయితే ప్యూర్ ట్రిమ్‌లో బాడీ-కలర్ అవుట్‌సైడ్ డోర్ హ్యాండిల్స్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే సపోర్ట్‌తో 10.2-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ అందుబాటులో ఉంది. ఇందులో హైట్-అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, రియర్-వ్యూ కెమెరా, ఆటో-ఫోల్డ్ ORVMలు కూడా జోడించబడ్డాయి.
హ్యుందాయ్ క్రెటా ఘిబ్లీ అవతార్
హ్యుందాయ్ క్రెటాను లెవెల్-2 ADAS, 70 కంటే ఎక్కువ అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో అందించారు. ఇది E, EX, S, S(O), SX, SX టెక్ , SX (O) వంటి 7 వేరియంట్‌లలో విడుదల చేయబడింది. ఇందులో రివర్స్ L-షేప్ LED DRLలు, హ్యుందాయ్ లోగో గ్రిల్‌పై ఇవ్వబడ్డాయి. హెడ్‌లైట్స్‌లో ప్రొజెక్టర్ యూనిట్, హై బీమ్ కోసం రిఫ్లెక్టర్ సెటప్ ఉంది.
ఈ ఘిబ్లీ ఫొటోలను Grok AI సహాయంతో రూపొందించారు. ఈ కార్ల కొత్త రూపాలు సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Ghibli ai cars featured
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com