ISRO gaganyan-1: మరో మూడు నెలల్లో గగన్ యాన్ -1.. ఇందులో ప్రయాణించే వ్యోమగాములకు ఇస్రో ఎలాంటి శిక్షణ ఇస్తోందంటే..

ఇస్రో గగన్ యాన్ -1 ప్రయోగంపై యావత్ ప్రపంచం మొత్తం ఆసక్తిగా చూస్తోంది. ఈ మిషన్ ద్వారా నలుగురు వ్యామగామలు అంతరిక్షంలోకి అడుగు పెడతారు. ఇప్పటికే వారిని ఇస్రో ఎంపిక చేసింది. ప్రపంచానికి పరిచయం చేసింది.

Written By: Anabothula Bhaskar, Updated On : August 19, 2024 6:15 pm

ISRO gaganyan-1

Follow us on

ISRO gaganyan-1: మరో మూడు నెలల్లో భారత అంతరిక్ష సంస్థ ఇస్రో గగన్ యాన్ -1 ప్రయోగాన్ని చేపట్టనుంది. గగన్ యాన్ అనేది భారతదేశపు తొలి మానవ సహిత ఉపగ్రహం. 2025 చివర్లో ఇది అంతరిక్షంలోకి అడుగుపెడుతుంది.

యావత్ ప్రపంచం మొత్తం ఆసక్తిగా చూస్తోంది..

ఇస్రో గగన్ యాన్ -1 ప్రయోగంపై యావత్ ప్రపంచం మొత్తం ఆసక్తిగా చూస్తోంది. ఈ మిషన్ ద్వారా నలుగురు వ్యామగామలు అంతరిక్షంలోకి అడుగు పెడతారు. ఇప్పటికే వారిని ఇస్రో ఎంపిక చేసింది. ప్రపంచానికి పరిచయం చేసింది. భారత వైమానిక దళానికి చెందిన గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణ నాయర్, గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణన్, గ్రూప్ కెప్టెన్ అంగద్ ప్రతాప్, రింగ్ కమాండర్ సుభాన్షు శుక్లా ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుకు ఎంపికయ్యారు.. 2020లో రష్యాలోని గగారిన్ శిక్షణ కేంద్రంలో రెండేళ్లపాటు ట్రైనింగ్ తీసుకున్నారు. ప్రస్తుతములు బెంగళూరులోని ఇస్రో నిర్వహించే మిషన్ స్పెసిఫిక్ ట్రైనింగ్ ఫెసిలిటీ సెంటర్ లో శిక్షణ తీసుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీడియోను ఇస్రో ట్విట్టర్ ఎక్స్ లో షేర్ చేసింది. శిక్షణ కేంద్రంలో భారత వ్యోమగాములు శిక్షణ పొందుతున్న తీరు ఆకట్టుకుంటున్నది.

ఎలా శిక్షణ ఇస్తున్నారంటే..

భారత అవ్యమగామి రాకేష్ శర్మ 1980లో అంతరిక్ష కేంద్రంలో అడుగుపెట్టాడు. అప్పుడు ఆయన శిక్షణ పొందిన గగారిన్ సెంటర్ లో నాలుగేళ్ల క్రితం వరకు అటువంటి శిక్షణ వ్యవస్థలు లేవు. గగన్ యాన్ ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కిన తర్వాత బెంగళూరులోని ఇస్రో కేంద్రంలో ఈ వ్యవస్థలు మొత్తం అందుబాటులోకి వచ్చాయి. అయితే అంతరిక్ష యాత్ర చేసే భారత వ్యోమగాములకు అంతరిక్ష స్థాయి శిక్షణ అవసరమని భావించి.. రష్యాలోనే ట్రైనింగ్ ఇప్పించింది. ప్రస్తుతం బెంగళూరులోని ఇస్రో కేంద్రంలో గగన్ యాన్ తరహాలో క్రూ మాడ్యూల్ సిద్ధం చేశారు. అందులో వ్యోమగాములకు శిక్షణ ఇస్తున్నారు. ఈ కేంద్రం నుంచి పర్చువల్ శిక్షణ కూడా ఇస్తున్నారు. వ్యోమగాములను తీసుకెళ్లే వాహక నౌకలో అనేక ఇంజనీరింగ్ వ్యవస్థలు ఉంటాయి. వీటితోపాటు ప్రొపల్షన్, ఏరో డైనమిక్స్, యోగ శిక్షణ, ఉపగ్రహంలో బార రహిత స్థితి లోని గురుత్వాకర్షణ, ఇతర పీడన పరిస్థితులు, మైనస్ 45 డిగ్రీల కోణంలో ఎగిరిపడే విమానాలు, రోలర్ కోస్టల్ తరహాలోని విన్యాసాల మాదిరి వ్యోమగాములకు శిక్షణ ఇస్తున్నారు.

ఇది మాత్రమే కాకుండా అత్యవసర పరిస్థితి ఏర్పడితే భూమ్మీదికి దూకడం, పర్వతాలు, దట్టమైన అడవులు, చిత్తడిగా ఉండే నేలలు, విస్తారమైన ఎడారులు, సముద్రాలలో దిగే విధంగా ప్యారాచూట్ సహాయంతో శిక్షణ తీసుకుంటున్నారు. దీనికోసం ఆర్బిటల్ మెకానిక్స్ ఆస్ట్రో నావిగేషన్ పై వర్చువల్ విధానంలో వ్యోమగాములు శిక్షణ తీసుకుంటున్నారు. ఇలా శిక్షణ పూర్తి అయిన తర్వాత..వారు అంతరిక్షంలో అడుగుపెడతారు. ఇస్రో నిర్వహించే ఈ ప్రయోగం కోసం యావత్ ప్రపంచం మొత్తం ఆసక్తిగా చూస్తోంది..ఇస్రో చేస్తున్న ప్రయోగాలను నిశితంగా పరిశీలిస్తోంది.