India iPhone factory: మనం అనేక సందర్భాల్లో చెప్పుకున్నాం కదా. చైనా అంటేనే ఒక దుష్ట దేశమని. తన ప్రయోజనాల కోసం మాత్రమే ఆ దేశం పనిచేస్తుందని.. తనకు లాభం జరిగే విషయాలలో ఏమాత్రం చైనా రాజీ పడదని.. పైగా కుళ్ళు కుతంత్రాలకు పాల్పడుతుందని.. ఇప్పుడు భారత్ విషయంలో కూడా చైనా అదే విధంగా చేస్తోంది. పరోక్షంగా భారతదేశ వృద్ధికి అడ్డు తగులుతోంది. దీంతో మనదేశంలో ఐఫోన్ తయారీ నిలిచిపోయే ప్రమాదంలో పడింది..
భారత్ లో తయారీ అనే నినాదంతో కేంద్ర ప్రభుత్వం కొంతకాలంగా విదేశీ సంస్థలను కూడా మనదేశంలోకి ఆహ్వానిస్తోంది. మనదేశంలో ఉత్పత్తులు తయారు చేస్తే రాయితీ కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఆ హామీ ప్రకారం వివిధ కంపెనీలు మన దేశానికి వచ్చాయి. అందులో ప్రఖ్యాత ఆపిల్ కూడా ఒకటి. ఆ సంస్థ మనదేశంలో ఐఫోన్లు తయారు చేస్తోంది.. ఇందులో భాగంగా ఆపిల్ ఫోన్లను తయారు చేసే విధానానికి సంబంధించి మన దేశ కార్మికులకు శిక్షణ ఇచ్చే బాధ్యతను ఫాక్స్ కాన్ సంస్థకు ఆపిల్ అప్పగించింది. ఫాక్స్ కాన్ చైనా దేశానికి చెందిన సంస్థ. ఈ సంస్థకు చెందిన 300 మంది కార్మికులు మన దేశానికి వచ్చారు. ఆపిల్ ప్లాంట్ లో కార్మికులకు ఫోన్ ల తయారీలో శిక్షణ ఇస్తున్నారు. అయితే ఇటీవల ఆ కార్మికులు కారణం చెప్పకుండానే వెళ్లిపోయారు. దీంతో మన దేశ కార్మికులకు శిక్షణ ఇచ్చే అవకాశాలు లేకుండా పోయింది. అయితే చైనా తీసుకొన నిర్ణయం వల్లే ఆ కార్మికులు స్వదేశానికి వెళ్ళిపోయారని తెలుస్తోంది. గతంలో ఆపిల్ ఫోన్లను చైనాలో తయారు చేసేవారు. అసెంబ్లింగ్ ప్రక్రియ మొత్తం అక్కడే చేపట్టేవారు. అయితే ఇటీవల కాలంలో డ్రాగన్ దేశం నుంచి ఆ సంస్థ బయటకు వచ్చింది. అమెరికా తర్వాత మన దేశంలోనే తయారీ కార్యకలాపాలను వేగవంతం చేసింది.. దీనిని సహించలేక చైనా ఆ దుస్సాహాసానికి ఒడిగట్టింది.
Also Read: ఏఐ డిమాండ్.. ఓపెన్ ఏఐ టు మెటా.. భారత టెకీ కి కనక వర్షం..₹85 కోట్ల ప్యాకేజీ , బోనస్ ₹415 కోట్లు
తన కార్మిక శక్తిని ఇతర దేశాలలో పరిమితం చేయడానికి చైనా ఈ నిర్ణయం తీసుకుంది. . భారత్లో స్థాపించిన యూనిట్ లో ఎక్కువ హ్యాండ్ సెట్స్ తయారు చేయాలని ఆపిల్ భావిస్తోంది. ఇందుకు తగ్గట్టుగానే అనేక రకాల ఏర్పాట్లు చేసింది. కానీ చైనా ఆపిల్ సంస్థ ఆశలపై నీళ్లు చెల్లింది. దశలవారీగా కార్మికులు చైనా వెళ్లిపోతున్న నేపథ్యంలో మన దేశంలో ఉన్న వారికి ఆపిల్ ఫోన్ల అసెంబ్లింగ్ పై శిక్షణ ఇచ్చేవారు లేకుండా పోయారు.. చైనా దురుద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది..
Also Read: వాట్సాప్ లోకి వచ్చే ఈ ఫోటోను డౌన్లోడ్ చేస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త
ఆ మధ్య ఆపిల్ సంస్థ వెళ్లిపోయినప్పుడు చైనా కీలక వ్యాఖ్యలు చేసింది. తమ దేశం నుంచి వెళ్లిపోయిన సంస్థకు ఏ విధమైన సహాయం అందించబమని చైనా స్పష్టం చేసింది. ఆ వ్యాఖ్యలకు తగ్గట్టుగానే చైనా ఇప్పుడు ఆ నిర్ణయం తీసుకుంది. అందువల్లే ఆ దేశానికి చెందిన కార్మికులు భారత దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నట్టు తెలుస్తోంది.. కార్మికులు వెళ్లిపోతున్న నేపథ్యంలో ఆపిల్ ఫోన్ల తయారీ మందగమనంలో పడుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రత్యామ్నాయాల ద్వారా భారత కార్మికులకు శిక్షణ ఇచ్చే అవకాశాన్ని ఫాక్స్ కాన్ పరిశీలిస్తోంది.