WhatsApp photo scam: మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరు WhatsApp తప్పకుండా ఉపయోగిస్తారు. ఎందుకంటే చాలా అవసరాలకు ఈ యాప్ ఉపయోగకరంగా ఉంటుంది. కమ్యూనికేషన్ తో పాటు ఫోటోలు, వీడియోలు పంపించుకునేందుకు ఇది సౌకర్యంగా ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే వాట్సాప్ ద్వారా విలువైన ఫైళ్లను కూడా పంపించుకునే అవకాశం ఉంది. అయితే వాట్సాప్ ద్వారా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అంతే స్థాయిలో నష్టాలు కూడా ఉన్నాయి. దీనిని జాగ్రత్తగా వాడుకుంటేనే ఎలాంటి సమస్య ఉండదు. లేకుంటే బ్యాంకు బ్యాలెన్స్ మొత్తం ఖాళీ అయ్యే అవకాశం ఉంది. తాజాగా కొందరు సైబర్ నేరగాళ్లు వాట్సాప్ లో కొత్త రకం మోసానికి పాల్పడుతున్నారు. ఆ మోసం ఎలా ఉందంటే?
Also Read: Whats app : ఈ మూడు ఆప్షన్లు క్రేజీగా ఉంటాయి.. వెంటనే తెలుసుకోండి..
వాట్సాప్ లో ఏదైనా ఫోటో లేదా వీడియో వచ్చినప్పుడు వెంటనే దానిని డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటాం. అదేంటో తెలుసుకోవాలని చాలామందికి ఉత్సాహం ఉంటుంది. మరికొందరు అయితే వాట్సాప్ లో Auto Download అనే ఆప్షన్ను ఎంచుకుంటారు. ఇలా సెట్ చేసుకోవడం వల్ల కొన్ని ఫోటోలు, వీడియోలు ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతూ ఉంటాయి. కానీ ఇక్కడే తప్పులో కాలేసినట్లు అవుతోంది.
వాట్సాప్ ద్వారా కొందరు తెలియని వ్యక్తులు కొన్ని ఫోటోలను, వీడియోలను పంపిస్తున్నారు. అయితే కొందరు తమ కంపెనీల ప్రచారం కోసం ఇవి సెండ్ చేస్తున్నారు. వీటి గురించి తెలుసుకోవాలని చాలామందికి ఉత్సాహం ఉంటుంది. దీంతో వాటిని ఓపెన్ చేయడానికి ఆసక్తి చూపుతారు. అయితే ఇలాంటి కొత్త నెంబర్ల నుంచి ఫోటోలు ఓపెన్ చేయడం వల్ల బ్యాంకు ఖాళీ అయ్యే అవకాశం ఉంది. అదేలా? అనే సందేహం చాలామందికి ఉంటుంది. కొందరు సైబర్ నేరగాళ్లు వాట్సాప్ ద్వారా పంపించే ఫోటోలకు కొన్ని binary code అమరుస్తారు. ఈ కోడ్ వల్ల ఎవరైతే ఫోటోను డౌన్లోడ్ చేస్తారో.. వారికి సంబంధించిన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా స్కామర్ కు వెళ్ళిపోతుంది. అప్పటినుంచి వినియోగదారుడు ఎలాంటి ఆర్థిక వ్యవహారాలు జరిపినా సైబర్ నేరగాళ్లకు తెలిసిపోతుంది.
Also Read: Whats App: వాట్సాప్ లో కొత్త ఫీచర్.. ఇక ఆ ఇబ్బంది తొలగినట్లే..
అందువల్ల వాట్సాప్ లో తెలియని కొత్త నెంబర్ నుంచి ఎలాంటి ఫోటోలు వచ్చినా వెంటనే డౌన్లోడ్ చేయకుండా ఉండాలి. ఇప్పటివరకు దాదాపు వేలమంది ఇలా ఫోటోలు డౌన్లోడ్ చేసుకొని డబ్బులు పోగొట్టుకున్నట్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేశారు. అయితే కొందరు మొబైల్లో ఆటో డౌన్లోడ్ అనే ఆప్షన్ను ఎనేబుల్ చేసుకోవడం ద్వారా కూడా ఇలాంటి సమస్యలు ఎదురయ్యాయి. దీంతో మొబైల్ లోని వాట్సాప్ లో ఆటో డౌన్లోడ్ అనే ఆప్షన్ను డిసేబుల్ చేసుకొని ఉండాలి. ఇందుకోసం వాట్సాప్ పైన కనిపించే మూడు చుక్కల పై క్లిక్ చేయడం ద్వారా సెట్టింగ్స్ అని ఆప్షన్ వస్తుంది. దీనిపై క్లిక్ చేసిన తర్వాత auto download అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీనిని ఆఫ్ చేసుకోవడం చాలా మంచిది. ఇలా చేయడం ద్వారా ఆటోమేటిక్గా ఫోటోలు డౌన్లోడ్ కావు. అప్పుడు ఎలాంటి సమస్య ఉండదు. అంతేకాకుండా తెలియని నెంబర్లకు సంబంధించిన ఫోటోలను డౌన్లోడ్ చేయకుండా ఉండడమే మంచిది.