Elon Musk impressed : బైక్ పై షికార్లు.. అమ్మాయితో ప్రేమాయణం.. స్నేహితులతో జల్సాలు.. వంటి పనులతో కొందరు యువకులు బిజీగా ఉంటే.. మరికొందరు మాత్రం స్థాయికి మంచిన టాలెంట్ తో ప్రత్యేకంగా నిలుస్తున్నారు. చిన్నప్పటి నుంచే అసాధారణ ప్రతిభతో చదువుల్లో మెళకువలు సాధిస్తూ పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు పొందుతున్నారు. ఒకప్పుడు యువకులకు మైండ్ మెచురిటీ రావాలంటే కనీసం డిగ్రీ పూర్తి అయ్యేది. కానీ ఇప్పుడు 10వ తరగతి పూర్తికాగానే విశేష ప్రతిభను పొందుతున్నారు. అమెరికాకు చెందిన ఓ కుర్రాడు ఇలాగే 14 ఏళ్లకే ఎలెస్ మస్క్ కంపెనీ అయిన స్పేస్ ఎక్స్ కంపెనీలో ఉద్యోగం సాధించాడు. అంత పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చిందంటే ఆ కుర్రాడి ప్రతిభ ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి ఆ యువకుడి గురించి తెలుసుకుందామా..
తొమ్మిదేళ్ల వయసున్న పిల్లవాడా కామ్ గా స్కూలుకెళ్లి టీచర్లు చెప్పింది చేస్తాడు. కానీ ఈ కుర్రాడు మాత్రం ఇదే వయసులో కళాశాల బుక్స్ పట్టి చదివాడు. కాలేజీ చరిత్రలోనే అతి చిన్న వయసుల్లో ఎంట్రీ ఇచ్చిన కుర్రాడిగా ఆయన పేరొందాడు. అమెరికాలోని శాన్ ప్రాన్సిస్కో కు చెందిన జులియా, ముస్తాహిద్ క్యాజీ దంపతులకు 2009 జనవరి 27న కైరాన్ అనే బాబు పుట్టాడు. ఈయన చిన్నప్పటి నుంచే చురుగ్గా ఉన్నాడు.
ఈ బాలుడు 7 సంవత్సరాల వయసులోనే కోడింగ్ అకాడమిలో చేరి పైథాన్ ప్రోగ్రామింగ్ ను నేర్చుకున్నాడు. ఆ తరువాత మెషిన్ లెర్నింగ్ కూడా పూర్తి చేశాడు. దీంతో ఈయన ప్రతిభ చూసిన కళాశాలలు ఆ కుర్రాడికి తొమ్మిదేళ్ల వయసు ఉండగానే హైయ్యర్ స్టడీస్ చేసేందుకు అవకాశం ఇచ్చాయి. అలా 9 ఏళ్ల వయసులోనే లాస్ పోసిటాస్ కళశాలలో చేరాడు. ఆ తరువాత 11 ఏళ్లలోనే మ్యాథమెటిక్స్ లో డిగ్రీ చదువుతూ శాంత క్లారా యూనివర్సిటీలో కంప్యూటర్ ఇంజనీరింగ్ పూర్తి చేవాడు.
ఇటీవల సాంకేతిక ఫన్ ఇంటర్వ్యూ ప్రాసెస్ ను అవలీలగా సొల్యూషన్ చేసిన కైరాన్ కు స్పేస్ ఎక్స్ లోని స్టార్ లింక్ విభాగంలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం వచ్చింది. దీంతో అతిన చిన్న వయసులోనే డిగ్రీ పూర్తి చేయడమే కాదు ప్రముఖ స్పేస్ ఎక్స్ లో ఉద్యోగం కొట్టిన వ్యక్తిగా నిలిచిపోయాడు. ఈ సందర్భంగా ఆ కుర్రాడికి, ఆయన తల్లిదండ్రులకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ నేపత్యంలో కైరాన్ తల్లి దండ్రులు మాట్లాడుతూ కైరాన్ చిన్నప్పటి నుంచే చురుగ్గా ఉండేవాడు. అతని ప్రతిభ చూసి మాకే ఆశ్చర్యం వేసింది. అందుకే అతడిని ప్రోత్సహించాం. చిన్న వయులోనే లాస్ పోసిటాస్ కాలేజీలో చేరయడంతో కైరాన్ అత్యున్నతస్థాయికి వెళ్తామని భావించాడు. అనుకున్నట్లే కైరాన్ ఉన్నత స్థాయికి ఎదిగాడు. కైరాన్ ను చూస్తే మాకెంతో ఆనందం కలుగుతుంది.. అని అంటున్నారు.