యూట్యూబ్ షార్ట్స్ వీడియోల ద్వారా లక్షల్లో ఆదాయం.. ఏం చేయాలంటే..?

దేశంలో ఈ మధ్య కాలంలో మోజ్, రొపోసో వంటి యాప్స్ ను వినియోగించే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. స్మార్ట్ ఫోన్ యూజర్ల నుంచి ఈ యాప్ లకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో అవే ఫీచర్లతో ఉన్న కొత్తకొత్త యాప్స్ సైతం పుట్టుకొస్తున్నాయి. దేశంలో టిక్ టాక్ యాప్ అత్యంత పాపులారిటీ తెచ్చుకోగా కొన్ని కారణాల వల్ల ఈ యాప్ నిషేధానికి గురైన సంగతి తెలిసిందే. టిక్ టాక్ లా ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ రీల్స్ […]

Written By: Kusuma Aggunna, Updated On : August 12, 2021 11:07 am
Follow us on


దేశంలో ఈ మధ్య కాలంలో మోజ్, రొపోసో వంటి యాప్స్ ను వినియోగించే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. స్మార్ట్ ఫోన్ యూజర్ల నుంచి ఈ యాప్ లకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో అవే ఫీచర్లతో ఉన్న కొత్తకొత్త యాప్స్ సైతం పుట్టుకొస్తున్నాయి. దేశంలో టిక్ టాక్ యాప్ అత్యంత పాపులారిటీ తెచ్చుకోగా కొన్ని కారణాల వల్ల ఈ యాప్ నిషేధానికి గురైన సంగతి తెలిసిందే.

టిక్ టాక్ లా ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ రీల్స్ ను తీసుకురావడంతో వీటికి విపరీతమైన క్రేజ్ రాగా యూట్యూబ్ సైతం షార్ట్స్ వీడియోను అందుబాటులోకి తెచ్చింది. యూట్యూబ్ షార్ట్స్ వీడియోల ద్వారా ఎక్కువ మొత్తంలో డబ్బును సంపాదించే అవకాశాన్ని కల్పిస్తుండటం గమనార్హం. యూట్యూబ్ 2021 – 2022 సంవత్సరానికి షార్ట్స్ వీడియోల కోసం ఏకంగా 100 మిలియన్ల ఫండ్ ను రిలీజ్ చేసింది.

నిమిషం కంటే తక్కువ వ్యవధి ఉన్న వీడియోలను షార్ట్ వీడియోలని అంటారు. 9/16 ఫార్మాట్‌లో ఉండే వీడియోలను యూట్యూబ్ షార్ట్స్ లో అప్ లోడ్ చేయవచ్చు. వీడియో యొక్క నిడివి 60 సెకన్ల వరకు మాత్రమే ఉండాలి. యూట్యూబ్ యాప్ లో ఉండే ప్లస్ సింబల్ పై క్లిక్ చేసి టైటిల్, ఇతర సమాచారంతో వీడియోను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. యూట్యూబ్ ఈ వీడియోలకు మ్యూజిక్, ఇతర ఎఫెక్ట్స్ ను యాడ్ చేసే అవకాశాన్ని కూడా కల్పిస్తుండటం గమనార్హం.

యూట్యూబ్ షార్ట్ వీడియోస్ ద్వారా డబ్బు సంపాదించాలంటే కొంత ప్రాసెస్ ను పూర్తి చేయాల్సి ఉంటుంది. మోనటైజేషన్ ప్రక్రియ పూర్తైన తర్వాత పబ్లిష్ చేసిన వీడియోకు ఎక్కువ సంఖ్యలో వ్యూస్ వస్తే సులభంగా డబ్బులు సంపాదించే అవకాశం ఉంటుంది.