నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన నోముల భగత్ ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. అసెంబ్లీలోని శాసనసభాపతి కార్యాలయంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి భగత్ తో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు జగదీశ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు భగత్ కుటుంబసభ్యులు హాజరయ్యారు. గత శాసన సభ ఎన్నికల్లో గెలుపొందిన నోముల నర్సింహయ్య మరణంతో నాగార్జునసాగర్ లో ఉప ఎన్నిక జరిగిన విషయం తెలిసిందే.