Earth-Mars Communication: ఒకప్పుడు భూమి పైనుంచి చందమామ వరకు వెళ్లాలంటే ఎంతో కష్టంగా ఉండేది. ముందుగా రోవర్లను పంపించి.. ఆ తర్వాత మనుషులు కూడా దిగారు. కానీ ఇప్పుడు పక్క దేశానికి వెళ్ళినంత ఈజీగా మూన్ పైకి వెళ్తున్నారు. అయితే ఇప్పుడు Mars పైకి వెళ్లేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే అమెరికాకు చెందిన చాలా రోవర్లు మార్స్ పై దిగాయి. అనేక పరిశోధనలు చేస్తున్నాయి. తాజాగా ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మార్స్ పైకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే ఇప్పటికే అమెరికా దింపిన రోవర్ల ప్రకారం ఒకవేళ మార్చి పైకి ఏదైనా మెసేజ్ పంపాలంటే భూమి నుంచి ఎంత సమయం పడుతుంది?
Mars ను అంగారక గ్రహం అని అందరికీ తెలిసిన విషయమే. ఈ గ్రహానికి సంబంధించిన ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయితే అంగారక గ్రహం పైకి వెళ్లడానికి ఎలాన్ మాస్క్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ ఇప్పటికే అమెరికా ఎన్నో రోవర్లను ఇక్కడ దించింది. వీటి నిర్వహణలో కష్టాలను ఎదుర్కొంటుంది. ఎందుకంటే మార్స్ పై ఉన్న వాతావరణం ప్రకారం ఇక్కడ మనుషులు దిగడం అంతా సులవు కాదని ఒక శాస్త్రవేత్త పేర్కొంటున్నాడు. ఇక్కడికి మనసులో వెళ్ళగానే గుర్తుపట్టలేని విధంగా మారిపోతారని హెచ్చరిస్తున్నాడు.
డా స్కాట్ సలామన్ అనే శాస్త్రవేత్త తన పుస్తకంలో కొన్ని విషయాలను పొందుపరిచారు. మార్స్ లో మానవులు జీవిస్తే అక్కడ పుట్టే పిల్లల్లో జన్యు మార్పులు ఉంటాయని పేర్కొన్నాడు. ఇక్కడ జీవించే వారి ఎముకలు బలహీనంగా మారిపోతాయని తెలిపాడు. కండరాల శక్తి కూడా తక్కువగా ఉంటుందని చెప్పాడు. భూమి చుట్టూ ఓజోన్ పొర ఉంటుందని.. దీనివల్ల భూమిపై ఉండే మనుషులు సూర్యకిరణాల నుంచి తట్టుకునే శక్తి ఉంటుందని అన్నారు. కానీ మార్స్ గ్రహంపై ఆ పరిస్థితి ఉండదని పేర్కొన్నాడు. ఇక్కడ జీవించేవారి పై సూర్యకిరణాలు నేరుగా పడే అవకాశం ఉందని చెబుతున్నాడు.
భూమికి, మార్స్ గ్రహానికి మధ్య 55 మిలియన్ల కిలోమీటర్లు ఉన్నట్లు కొన్ని నివేదికల ద్వారా తెలుస్తుంది. ఈ దూరం కారణంగా భూమి నుంచి మార్స్ కు ఏదైనా సందేశం పంపితే చాలా ఆలస్యం అవుతుందని తెలుస్తోంది. అంటే భూమిపై నుంచి ఒక మెసేజ్ మార్స్ పై ఉన్న వ్యక్తికి చేరాలంటే 20 నిమిషాల సమయం పడుతుంది. అక్కడి వ్యక్తి వెంటనే స్పందించి రిప్లై ఇస్తే.. ఇక్కడికి రావడానికి మరో 20 నిమిషాలు పడుతుంది. అంటే మార్స్, భూమికి మధ్య మెసేజ్ కమ్యూనికేషన్ 40 నిమిషాలు ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే అమెరికా కు చెందిన ఓవర్లకు మెసేజ్ పంపాలంటే 20 నిమిషాల ముందు చేస్తారు. మార్స్ పై ఉన్న శాటిలైట్స్ లోని లైట్స్ కారణంగా ఈ మెసేజ్ రోమర్లకు చేరుతుంది. మెసేజ్ పంపడానికి ఈ లైట్స్ ఎక్కువగా పనిచేస్తాయి.