Do you know about this new feature in WhatsApp? : స్మార్ట్ ఫోన్ యుగంలో వాట్సప్ అనేది ఒక సంచలనం. ప్రపంచంలో స్మార్ట్ ఫోన్ వాడుతున్న ప్రతీ ఒక్కరు దీనిని ఉపయోగిస్తున్నారు. సందేశాలు, ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు.. వీడియో కాల్స్.. సమస్తం ఇప్పుడు దీని ఆధారంగానే సాగుతున్నాయి.. వాట్సప్ ను అధిగమించేందుకు ఎన్నో యాప్స్ మార్కెట్లోకి వచ్చినప్పటికీ పెద్దగా ఆదరణకు నోచుకోలేదు. పెరుగుతున్న వినియోగదారుల సంఖ్యకు అనుగుణంగా, వారి అవసరాలు ప్రాతిపదికన వాట్సాప్ కొత్త కొత్త ఫీచర్లతో ముందుకు వస్తోంది.

సమూల మార్పులు చేపట్టింది
ప్రపంచ జనాభా 800 కోట్లు ఉంటే.. అందులో సుమారు 40 శాతం మంది వాట్సప్ వినియోగిస్తున్నారని ఒక అంచనా. అయితే తన కస్టమర్ల కోసం విధించిన నిబంధనలు వాట్సప్ సరళికృతం చేస్తోంది. మొన్న ఒక్కరోజు ఒక అర్ధగంట వాట్సప్ పనిచేయకపోతే ప్రపంచం మొత్తం స్తంభించిపోయింది. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ అప్లికేషన్ కు ఉన్న విలువ.. అయితే కాలానుగుణంగా వాట్సాప్ మార్పులు చేసుకుంటూ వస్తోంది..
పోల్ ఫీచర్ తెరపైకి తెచ్చింది
వినియోదారుల అవసరాలకు అనుగుణంగా వాట్సప్ ఫోల్ ఫీచర్ ను తెరపైకి తీసుకొచ్చింది.. ఒక ప్రశ్నకు 12 వరకు ఆప్షన్లు ఇచ్చే సాలభ్యాన్ని కూడా కల్పిస్తోంది. ట్విట్టర్ మాదిరిగా పోల్స్ క్రియేట్ చేసే ఆప్షన్ ను తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారులకు ఇది అందుబాటులో ఉంటుంది. వాట్సాప్ పోల్ లో ఒక ప్రశ్నకు 12 వరకు ఆప్షన్లు ఇవ్వచ్చు. ఒక ఆప్షన్ రెండుసార్లు ఇస్తే మాత్రం తీసుకోదు.
ఇలా క్రియేట్ చేయాలి
ఫోన్ లో లేటెస్ట్ వాట్సప్ అప్లికేషన్ ఉండేలా చూసుకోవాలి. యాప్ ఓపెన్ చేసి వ్యక్తిగత లేదా గ్రూప్ చాట్ ఓపెన్ చేయాలి. ఐఓఎస్ యూజర్లు అయితే మెసేజ్ బాక్స్ పక్కన ఉన్న ప్లస్ సింబల్ ని నొక్కాలి. ఆండ్రాయిడ్ యూజర్లు పేపర్ క్లిప్ సింబల్ క్లిక్ చేయాలి.. వెంటనే ఒక మెనూ ఓపెన్ అవుతుంది.. ఇందులో చివర్లో పోల్స్ ఆప్షన్ కనిపిస్తుంది.. పోల్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే కొత్త మెనూ ఓపెన్ అవుతుంది. అనంతరం పోల్ ప్రశ్నను అడుగుతుంది.. దీనికి సమాధానాలు యాడ్ చేయాల్సి ఉంటుంది. సమాధానాల కోసం మొత్తం 12 ఆప్షన్లు ఇవ్వచ్చు. ఆప్షన్లు ఎంటర్ చేసిన తర్వాత సెండ్ చేస్తే సరిపోతుంది. పోల్ రిసీవ్ చేసుకున్నవారు ఆన్సర్ పై క్లిక్ చేస్తే ఓటు నమోదు అవుతుంది. ఏ ఆప్షన్ కు ఎక్కువ ఓట్లు వచ్చాయి, ఏ ఆప్షన్ ను ఎవరు ఎంచుకున్నారు, ఎంతమంది ఓటు వేశారు అనే విషయాలు కనిపిస్తాయి. వాట్సాప్ లో గ్రూపులు, అందులోని సభ్యుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఫోల్ ఫీచర్ యూజర్లను ఆకట్టుకుంటుందని వాట్సప్ భావిస్తోంది.