30 feet dark bronze statue.. Mahesh’s sensational decision : సూపర్ స్టార్ కృష్ణ మరణ వార్త విని యావత్తు సినీ లోకం మరియు లక్షలాది మంది అభిమానులు శోకసంద్రం లో మునిగిపోయి ఉన్న సంగతి మన అందరికి తెలిసిందే..ఇక ఒకే ఏడాది లో కుటుంబం లో ముగ్గురుని కోల్పోయిన ఘట్టమేని కుటుంబం మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవడం కూడా కష్టమే..ఇక మహేష్ బాబు పరిస్థితి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..కృష్ణ గారు ఆయనకీ ఆరాధ్య దైవం లాంటి వాడని ఎన్నో సందర్భాలలో తెలిపాడు..కృష్ణ గారే ఆయన ప్రధాన బలం మరియు బలహీనత..అలాంటి వ్యక్తి దూరమైతే కోలుకోవడం చాలా కష్టం.

రెండు నెలల క్రితమే త్రివిక్రమ్ తో చేస్తున్న సినిమా రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించాడు..కానీ తల్లి ఇందిరా దేవి గారు చనిపోవడం తో షూటింగ్ ని మధ్యలోనే ఆపేసాడు..రెండు నెలల విరామం తర్వాత చిన్నగా కోలుకొని ఇప్పుడు తాజా షెడ్యూల్ ప్రారంభిద్దాం అని అనుకుంటే కృష్ణ గారు అకస్మాత్తుగా మరణించడం ఆయనని మానసికంగా చాలా కృంగదీసింది..మహేష్ మళ్ళీ మాములు మనిషిలా మారి తన పనులు తానూ చేసుకోవడానికి ఈసారి చాలా సమయమే పట్టేటట్టు ఉంది.
ఇది ఇలా ఉండగా తానూ ఎంతగానో ఆరాధించే కృష్ణ కోసం మహేష్ బాబు ఇది వరుకు ఎవ్వరు చెయ్యని గొప్ప పని ని తండ్రి జ్ఞాపకార్థం గా చెయ్యబోతున్నాడు..హైదరాబాద్ నగరం లో సూపర్ స్టార్ కృష్ణ మెమోరియల్ పేరిట ఒక మ్యూజియం ని ఏర్పాటు చెయ్యబోతున్నాడు మహేష్ బాబు ..హైదరాబాద్ లోని ఏ ప్రాంతం లో ఈ మ్యూజియం ఏర్పాటు చెయ్యాలి అనేది త్వరలో నిర్ణయించనున్నాడు.
ఈ మ్యూజియం ఆవరణలో 30 అడుగుల కృష్ణ కాంస్య విగ్రహం తో పాటు ఆయన నటించిన 350 సినిమాలకు సంబంధించిన ఫోటోలు, షీల్డులు మరియు ఆయన సాధించిన అనితర సాధ్యమైన రికార్డ్స్ వివరాలన్నీ ఇందులో ఉంటాయి..కనివిని ఎరుగని రీతిలో ఈ మ్యూజియం నిర్మాణం చెయ్యాలని మహేష్ బాబు నిర్ణయించుకున్నాడు..అంతే కాకుండా కృష్ణ గారికి తన కుటుంబం తో ఉన్న సానిహిత్యం కూడా ఉట్టిపడేలా ఈ మ్యూజియం ని రూపకల్పన చెయ్యబోటున్నారట..ఇండస్ట్రీ కి ఎన్నో జానర్స్ మరియు టెక్నికల్ స్టాండర్డ్స్ ని పరిచయం చేసి మరో లెవెల్ కి తీసుకెళ్లిన కృష్ణ గారు ఈ గౌరవానికి అర్హులని ఇండస్ట్రీ పెద్దలు కూడా మహేష్ ని ప్రోత్సహిస్తున్నారు.