Diamond formation process: ఈ ప్రపంచంలో అత్యంత విలువైన లోహం వజ్రం. వజ్రంతో చేసిన ఆభరణాలు ఎంతో ఆదర్శనీయంగా ఉంటాయి. అంతేకాకుండా వజ్రంతో కలిగిన వస్తువులు అందాన్ని ఇస్తాయి. అందువల్ల వీటికి ప్రపంచంలో అత్యధికంగా డిమాండ్ ఉంటుంది. అయితే బంగారం తర్వాత ఎక్కువగా డిమాండ్ ఉండే వజ్రం ఎలా తయారవుతుంది? దీనిని ఎక్కడ ఉత్పాతి చేస్తారు? అనే సందేహం చాలామందికి ఉంటుంది. ఇంతకీ వజ్రం ఎలా ఏర్పడిందో ఇప్పుడు చూద్దాం..
వజ్రం ఎలా ఏర్పడిందో తెలుసుకోవడానికి చాలామంది శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. అయితే కొన్ని సంవత్సరాల కింద వజ్రం ఏర్పడడానికి కారణం దొరికింది. భూమి లోపల ఉండే టెక్టోనిక్ అనే పదార్థం ద్వారా వజ్రం తయారవుతుందని గుర్తించారు. ఇది విరిగిపోవడం వల్ల వజ్రం అగ్నిపర్వతాల నుంచి వెలువడే లావా ద్వారా బయటకు వస్తుంది. భూమి లోపల అధికంగా ఉష్ణోగ్రతతో పాటు కార్బన్ అణువులు స్పటికరణ చెందిన తర్వాత వజ్రాలుగా మారిపోతాయి. ఆ తర్వాత ఇవి బయటకు వచ్చి వర్షం ద్వారా కొట్టుకుంటూ వెళ్లి రాళ్ల మధ్య ఉండిపోతాయి.
Also Read: Diamond : కోహినూరు వజ్రం అసలు యజమానులు ఎవరు?
వజ్రం ఏర్పడిన తర్వాత ఎలాంటి రంగును కలిగి ఉండదు. కానీ ఆ తర్వాత జరిగే రసాయన క్రియల వల్ల ఇవి ఒక్కోరంగును కలిగి ఉంటాయి. పదిలక్షల కార్బన్ అణువులు, ఒక బోరాన్ అణువు తోడైతే నీలిరంగు వజ్రంగా ఏర్పడుతుంది. నైట్రోజన్ మిక్స్ అయితే పసుపు రంగులోకి మారుతుంది. ఎలాంటి అణువులు కలవకపోతే గోధుమ రంగులోకి మారిపోతుంది. అలాగే వజ్రం రేడియేషన్కు గురైతే పచ్చ రంగులోకి మారిపోతూ ఉంటుంది. ఒక వజ్రం ఏర్పడడానికి కొన్ని మిలియన్ల సంవత్సరాలు పడుతుంది. వజ్రాలు భూమి లోపల 170 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. ఇవి అగ్నిపర్వతాల వల్ల మాత్రమే బయటకు రాగలుగుతాయి. యూనివర్సిటీ ఆఫ్ బర్నింగ్ హాల్ అధ్యయనాల ప్రకారం అగ్నిపర్వతాలు బద్దలైన తర్వాత మాత్రమే వచనాలు బయటికి వస్తాయి అని తేల్చారు.
నవరత్నాలలో ఒకటిగా ఉన్న వజ్రం అత్యంత కఠినమైన పదార్థం. దీని గట్టితనం వల్ల కాంతి పరావర్తనం చెందుతుంది. మొట్టమొదటిగా వజ్రాలు భారతదేశంలోని బోర్నియాలో లభ్యమైనట్లు చరిత్ర చెబుతోంది. ప్రపంచంలో ఉన్న విలువైన వజ్రాలు భారత్కు చెందినవే అని కొందరు చెబుతూ ఉంటారు. వీటిలో కోహినూర్ వజ్రం అత్యంత ప్రాధాన్యతను కలిగి ఉంది. 1867లో దక్షిణాఫ్రికాలో వజ్రం ను కనుగొన్నారు. ఆ తర్వాత నదుల వెంబడి వెతుకులాట ప్రారంభమైంది కాలక్రమమైన నమీబియా, కెనడా, దక్షిణాఫ్రికా దేశాలు వజ్రాలను ఉత్పత్తి చేయడం ప్రారంభించాయి.
Also Read: Gold Rate Today: బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. రెండో రోజు భారీగా పతనమైన ధర
ఒక వజ్రం సాంద్రత 3.51 గ్రామ సెంటీమీటర్ క్యూబ్ కలిగే ఉంటుంది దీని వక్రీభవన గణకం 2.41 గా ఉంది. వజ్రం ఎందులోనూ కరగదు. అంతేకాకుండా ఇది ఆమ్లానికి గాని, క్షారానికి గాని ప్రభావితం కాకుండా ఉంటుంది.