Phone Apps: మీ మొబైల్ డేటా.. త్వరగా అయిపోతుందా.. 2 జీబీ, 5 జీబీ అయిచా చాలాడం లేదా.. అయితే ఇలా చేయండి మీ డేటా సేవ్ అవడమే కాకుండా ఎంతవాడిన తొందరగా అయిపోదు. ఇక మీ బైల్ డేటా, మీ రహస్య సమాచారం ఇతరులకు తెలియకుండా భద్రంగా ఉంటుంది. అదేంటో తెలుసుకుందాం.
అనవసర యాప్స్‌తో ఇబ్బంది..
చాలా మంది అవసరం ఉన్నా.. లేకపోయియా యాప్స్ డౌన్‌లోడ్ చేస్తుంటారు. ఇలా డౌన్‌లోడ్ చేసిన సమయంలో పరిమిషన్ అడుగుతుంది. కానీ, చాలా మంది పరిమిషన్ అవసరమా లేదా అని ఆలోచించకుండా ఇచ్చేస్తున్నారు. దీంతో యాప్స్ మొబైల్‌లో డౌన్‌లోడ్ అయిపోతున్నాయి. ఇలా ఇన్‌స్టాల్ చేసుకున్న చాలా యాప్స్ మన గూగుల్ అకౌంట్‌తో లింక్ అయి ఉంటాయి. అయితే ఈ యాప్స్‌ను నెలకు ఒకటి రెండుసార్లు కూడా ఉపయోగించడం లేదు.
యాప్ వాడకున్నా.. డేటా వినియోగం..
అయితే ఇలా అవసరం లేకున్నా.. వినియోగించకున్నా డౌన్‌లోడ్ చేసుకున్న యాప్స్ మన మొబైల్ బ్యాక్‌గ్రౌండ్‌లో యాక్టివ్‌గా ఉంటాయి. దీంతో మనం యాప్స్ వాడకున్నా.. డేటా అయిపోతుంది. ఇక ఈ యాప్స్ గూగుల్ ఖాతాతో లిక్ అయి ఉన్నందున మన డేటా సమాచారం కూడా ఇతరులు తెలుసుకునే అవకాశం ఉంటుంది.
ఇలా చేయండి..
డేటా సేవ్ అవడంతోపాటు మన వ్యక్తిగత విషయాలు ఇతరులకు తెలియకుండా ఉండాలంటే.. ఈ పని చేయండి.
– మీ మొబైల్ ఫోన్‌లో సెట్టింగ్స్ ఓపెన్ చేయండి
– పైకి స్క్రోల్‌చేసి గూగూల్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
– తర్వాత సెట్టింగ్ ఫర్ గూగుల్ యాప్స్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.
– తర్వాత కనెక్టెడ్ యాప్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది.
– దానిపై క్లిక్ చే యగానే మీ గూగుల్ అకౌంట్‌తో లింక్ అయి ఉన్న యాప్స్ అన్నీ కనిపిస్తాయి. అందులో మీకు అవసరం లేని యాప్స్‌పై క్లిక్ చేయండి
– అక్కడ డిలీడ్ ఆప్షన్ వస్తుంది. దానిపై క్లిక్ చేయగానే డిలీట్ చేసిన యాప్.. లింక్ కూడా పూర్తిగా తొలగిపోతుంది. దీంతో డేటా సేవ్ అవుతుంది, వ్యక్తిగత సమాచారం భద్రంగా ఉంటుంది.