Cybersecurity Expert Rakshit Tandon: సైబర్ నేరాలు రోజురోజుకు విభిన్న రీతిలో ఉంటున్నాయి. ముఖ్యంగా మొబైల్ వాడే వినియోగదారులను ఆసరాగా చేసుకుని కొందరు పర్సనల్ డేటా సేకరించి డబ్బులు కొల్లగొడుతున్నారు. ఇలాంటి సమయంలో మొబైల్ వాడే ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని సాంకేతిక నిపుణులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నారు. అయితే తాజాగా ప్రముఖ సైబర్ సెక్యూరిటీ నిపుణుడు రక్షిత్ టాండన్ సంచలన విషయాన్ని బయట పెట్టాడు. స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరు గ్యాలరీలో పర్సనల్ డేటా ఉంచుకోవద్దని తెలిపాడు. వీటి వల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తున్నాయి హెచ్చరించాడు. అసలు గ్యాలరీలో ఉన్న సమాచారం ఎలా దొంగిలించబడుతుంది?
హైదరాబాదులో ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఇటీవల హ్యాక్ ప్రూఫ్ అనే సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో పలువురు ప్రముఖులు తమ అభిప్రాయాలను చెప్పారు. ఈ సదస్సులో పాల్గొన్న ప్రముఖ సైబర్ సెక్యూరిటీ నిపుణుడు రక్షిత్ టాండన్ మాట్లాడారు మొబైల్ లోని గ్యాలరీ లో ఆధార్ కార్డు, పాన్ కార్డు వంటివి మాత్రమే కాకుండా పర్సనల్ డేటాను నిలువ చేసుకోవద్దని చెప్పాడు. వీటి ద్వారా సైబర్ నేరం జరిగే అవకాశం ఉందని అన్నారు. ఏదైనా యాప్ ఇన్స్టాల్ చేసేటప్పుడు గ్యాలరీ యాక్సెస్ కూడా అడుగుతుంది. ఇలాంటి సమయంలో కొందరు వీటి ద్వారా పర్సనల్ డాటాను సేకరించి అవకాశం ఉంది. కేవలం ఆధార్ కార్డు, పాన్ కార్డు వంటివి మాత్రమే కాకుండా కొన్ని ఫోటోలను కూడా దొంగిలించే అవకాశం ఉంది. ఈ ఫోటోల ద్వారా భయభ్రాంతులకు గురి చేయవచ్చని ఆయన అభిప్రాయపడ్డాడు.
చాలామంది ఫోటోలు గ్యాలరీలో నిలువ చేసుకుంటూ ఉంటారు. ఆధార్ కార్డు, పాన్ కార్డు సైతం గ్యాలరీలో అందుబాటులో ఉంచుకుంటారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు అనుగుణంగా రక్షిత్ టాండన్ తెలిపారు. ముఖ్యమైన డాక్యుమెంట్లు అవసరం పడే అవకాశం ఎప్పుడైనా ఉంది. ఇవి అందుబాటులో ఉండాలంటే మొబైల్లోని గ్యాలరీలో కాకుండా డిజి లాకర్లో సేవ్ చేసుకోవాలని చెప్పాడు. Digi లాకర్లో సేవ్ చేసుకోవడం వల్ల సెక్యూరిటీగా ఉంటాయని.. ఎప్పుడు అంటే అప్పుడు వాటిని తీసుకుని అవకాశం ఉంటుందని చెప్పాడు. డీజీ లాకర్ పై ఇప్పుడిప్పుడే అవగాహన కలుగుతుందని.. దీనిపై ప్రతి ఒక్కరూ పరిశీలన చేయాలని అన్నారు.
తల్లిదండ్రులు సైతం తమ పిల్లలకు ఇలాంటివి నేర్పించాలని అంటున్నారు. ఎందుకంటే నేటి కాలం పిల్లలకు సైబర్ నేరాల గురించి పూర్తిగా అవగాహన లేదు. దీంతో కొందరు గేమ్స్ ఆడే సమయంలో వివిధ రకాల యాప్స్ న్యూ డౌన్లోడ్ చేసుకొని యాక్సెస్ కొడుతున్నారు. ఇలాంటి సమయంలో మొబైల్ లోని డాటా లీక్ అయ్యే అవకాశం ఉంది. అందువల్ల మొబైల్ గ్యాలరీలో ఎలాంటి ముఖ్యమైన సమాచారం లేకుండా చూసుకోవాలని అంటున్నారు. ఒకవేళ మొబైల్లో ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉన్నట్లయితే.. కొత్త యాప్స్ డౌన్లోడ్ చేసుకోకుండా జాగ్రత్త పడాలని అంటున్నారు. అంతేకాకుండా తెలియని నెంబర్ నుంచి ఫోన్ వస్తే లిఫ్ట్ చేయకపోవడమే మంచిదని చెబుతున్నారు. ఎందుకంటే ఫోన్ నెంబర్ ద్వారా కూడా మొబైల్లోని సమాచారం అంతా లీక్ అయ్యే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.