Cool Drink Facts: ప్రతి రోజు మనం చాలా వస్తువులను ఉపయోగిస్తూ ఉంటాం. అలాంటి వస్తువులు మన చుట్టూ చాలా ఉంటాయి కూడా. కానీ ఇందులో చాలా రహస్యాలు కూడా దాగి ఉంటాయి. కానీ వాటి గురించి మనకు అన్నీ తెలియవు. తెలుసుకునే సమయం కూడా చాలా మంది వద్ద ఉండదు కదా. అయితే కొన్ని బాటిల్స్ ఆకారం ఎందుకు అలా ఉంటుంది? ఆకారం, రంగు, రుచి వంటి చాలా విషయాల పట్ల కూడా కొన్ని ముఖ్యమైన విషయాలు దాగి ఉంటాయి. పూల నుంచి తేనెటీగలు ఎలా మకరందాన్ని తీస్తాయి? అక్కడ మకరందం ఉందని వాటికి ఎలా తెలుసు. ఇలా చాలా విధాల రహస్యాలు మన ప్రకృతిలో దాగి ఉన్నాయి.
కూల్ డ్రింక్స్ ఉదాహరణనే తీసుకోండి. ప్రతిరోజూ ఈ కూల్ డ్రింక్స్ తాగుతూ ఉండే వారు చాలా మంది ఉన్నారు. కొంతమంది తక్కువ తాగవచ్చు. కానీ వారి జీవితంలో ఏదో ఒక సమయంలో తాగి ఉండాలి. మరి కూల్ డ్రింక్స్ ఆల్మోస్ట్ గా ప్లాస్టిక్ బాటిళ్లలోనే వస్తాయి. ఈ బాటిల్స్ కు సంబంధించిన ప్రత్యేక విషయం వారందరికీ తెలియకపోవచ్చు. అంటే, ప్లాస్టిక్ బాటిళ్ల మూత లోపల ఒక గుండ్రని రబ్బరు డిస్క్ ఉంటుంది. ఇది కేవలం డిజైన్ కోసం అనుకుంటున్నారా? కాదు దాని వెనుక చాలా ముఖ్యమైన కారణం ఉంది. ఈ రోజు మనం ఈ కారణమే తెలుసుకుందాం.
Also Read: కూల్ వాతావరణంలో హీట్ పెంచుతున్న సాక్షి మాలిక్
అయితే ప్లాస్టిక్ బాటిళ్ల మూత లోపల రబ్బరు డిస్క్ ఎందుకు ఉంటుంది అనే ప్రశ్నకు చాలా మందికి సమాధానం తెలియదు. దీనికి చాలా మంది వేర్వేరు కారణాలు కూడా చెప్తుంటారు. మరీ ముఖ్యంగా లోపల ద్రవం లీక్ కాకుండా నిరోధించడానికి దీనిని ఉపయోగిస్తారట.
రబ్బరు డిస్క్ ఎందుకు?
ఈ రబ్బరు డిస్క్ పని ద్రవం లీక్ కాకుండా చూడటం మాత్రమే కాదట. మరి ఏంటి అంటే? ఫుడ్ సేఫ్టీ వర్క్స్ వెబ్‌సైట్ ప్రకారం, మొదటగా ఈ రబ్బరు రింగ్ బాటిల్‌ను సరిగ్గా మూసివేయడంలో సహాయపడుతుంది. ఇది బాటిల్‌ను గాలి వెళ్లకుండా చేస్తుంది. తద్వారా లోపల ఉన్న వస్తువులు బయటకు రావు. దీనికి రసాయన నిరోధక లక్షణం కూడా ఉంది. దీనితో పాటు, ఈ రబ్బరును కూల్ డ్రింక్స్ సీసాలలో కూడా ఉపయోగిస్తారు. ఎందుకంటే కొన్నిసార్లు ఉష్ణోగ్రతలో మార్పు కారణంగా ఆ సీసాల లోపల ఒత్తిడి పెరుగుతుంది. ఈ రబ్బరు రింగ్ ఆ ఒత్తిడిని తట్టుకుంటుంది.
Also Read: మీ పిల్లలు మోకాళ్ల మీద ఎప్పుడు నడుస్తారు? మీరు ఏం చేయాలి? ఇంకా మీ పిల్లలు క్రాల్ చేయడం లేదా?
రబ్బరు ప్లాస్టిక్‌తో ప్రతిచర్యను నిరోధిస్తుంది.
ఈ ప్లాస్టిక్ మూతలు పాలిథిలిన్ టెరెఫ్తాలేట్ అంటే PET తో తయారు అవుతాయి. సూర్యకాంతిలో ఉన్నప్పుడు, దాని కణాలు శీతల పానీయంలో కలిసిపోవచ్చు. ఈ విధంగా అది కూడా కలుషితం కావచ్చు. ఉపయోగించే రబ్బరు కారణంగా దీని ప్రమాదం తగ్గుతుంది.
Disclaimer: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాము. దీన్ని Oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.