Cognizant IT park Kapuluppada Vizag: ఆంధ్రప్రదేశ్ కు( Andhra Pradesh) వరుసగా గుడ్ న్యూస్ లు వస్తున్నాయి. తాజాగా మరో దిగ్గజ ఐటీ కంపెనీ ఏపీలో తమ కార్యకలాపాలను ప్రారంభించినట్లు ప్రకటించింది. ప్రపంచ ప్రఖ్యాత ఐటీ సంస్థ కాగ్నిజెంట్ విశాఖలో నూతన ఐటీ క్యాంపస్ ను ఏర్పాటు చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. కాపులుప్పాడలో 22 ఎకరాల్లో క్యాంపస్ ఏర్పాటు చేస్తున్నట్లు కాగ్నిజెంట్ తన ఎక్స్ ద్వారా తెలిపింది. కొద్ది రోజుల కిందట కాగ్నిజెంట్ ఏపీకి రాబోతుందన్న వార్తలు వచ్చాయి. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సైతం ఇదే విషయాన్ని చెప్పారు. ఇప్పుడు స్వయంగా కాగ్నిజెంట్ ప్రకటన చేయడం విశేషం.
Also Read: AP Development : ఏపీకి మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు
ఐటీ హబ్ గా విశాఖ
ప్రస్తుతం ప్రపంచ ఐటీ దిగ్గజ సంస్థల్లో కాగ్నిజెంట్( ka ginijent ) ఒకటి. అటువంటి సంస్థ విశాఖకు వస్తుండడం నిజంగా శుభపరిణామం. ఇప్పటికే విశాఖ నగరాన్ని ఐటి హబ్ గా మార్చుతామని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. అందుకు తగ్గట్టుగానే చాలా రకాల ఐటి సంస్థలు పెద్ద ఎత్తున విశాఖకు వస్తున్నాయి. ఇప్పుడు కాగ్నిజెంట్ సైతం ముందుకు రావడాన్ని ఎక్కువమంది ఆహ్వానిస్తున్నారు. విశాఖలో ఏర్పాటు చేయబోయే నూతన క్యాంపస్ తో సుమారు 8,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించునున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ రంగంలో ఉద్యోగాలు లభించనున్నాయి. 2026 నుంచి కార్యకలాపాలు ప్రారంభించేందుకు కాగ్నిజెంట్ సిద్ధపడుతోంది. మరోవైపు కాగ్నిజెంట్ విస్తరణకు సహకరించిన సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపింది కాగ్నిజెంట్ యాజమాన్యం. విశాఖలో తమ క్యాంపస్ విస్తరణకు సంబంధించి కీలక ప్రకటన కూడా చేసింది.
దేశంలోనే దిగ్గజ సంస్థ
ప్రస్తుతం కాగ్నిజంట్ దేశంలోని ఐటీ దిగ్గజ సంస్థల్లో( it Institute ) ఒకటి. విశాఖపట్నంలో 1583 కోట్ల రూపాయలతో నూతన క్యాంపస్ ఏర్పాటు చేయబోతోంది. మంత్రి లోకేష్ కాగ్నిజెంట్ కు స్వాగతం పలుకుతూ ఇటీవల ట్వీట్ చేశారు. విశాఖలో 22 ఎకరాల్లో ఈ క్యాంపస్ ను ఏర్పాటు చేయబోతున్నారని.. కాగ్నిజెంట్ కు ఎకరా భూమిని 99 పైసలకి కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఈ కంపెనీ రాకతో ఎనిమిది వేల ఉద్యోగాలు లభిస్తాయని ఆనంద వ్యక్తం చేశారు.
We’re setting up a new state-of-the-art campus in Visakhapatnam!
Spread across 22 acres in Kapuluppada, IT Hills, creating 8,000 new jobs, with AI & digital transformation at the core.
Operations to begin in early 2026 and completion of the campus’ first phase by early 2029. pic.twitter.com/sdLXl9Vpnd
— Cognizant (@Cognizant) June 25, 2025
వచ్చే ఏడాదికి కార్యకలాపాలు..
వచ్చే ఏడాది నాటికి తాత్కాలికంగా కార్యకలాపాలు మొదలు పెట్టాలని కాగ్నిజెంట్ నిర్ణయించింది. 2029 నాటికి పూర్తిస్థాయి క్యాంపస్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దేశంలో ద్వితీయ శ్రేణి నగరాల్లో విస్తరించాలన్నది కాగ్నిజంట్ ప్రణాళిక. అందులో భాగంగా విశాఖ నగరంలోకి వచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సైతం ఆశించిన సహకారం అందుతుండడంతో కాగ్నిజెంట్ కార్యకలాపాల విస్తరణకు ముందుకు వచ్చింది. దేశంలో ఇతర నగరాల్లో కూడా కాగ్నిజెంట్ విస్తరిస్తోంది. భువనేశ్వర్ తో పాటు ఇండోర్లో కొత్త కేంద్రాలను ఏర్పాటు చేసింది. ప్రపంచవ్యాప్తంగా కార్డు లెజెండ్ ఉద్యోగుల్లో 70 మంది భారతీయులే ఉండడం విశేషం. మొత్తానికి అయితే దిగ్గజ ఐటీ సంస్థ ఏపీకి వస్తుండడం శుభపరిణామం.