China : మరమనిషి మనిషి చేయలేని పనులు చేయడం.. యుద్ధాలు ఏర్పడటం.. దేశాల మధ్య వైషమ్యాలు చోటు చేసుకోవడం.. రుగ్మతలు ఏర్పడి మనుషుల ఆరోగ్యాలు నాశనం కావడం.. టెక్నాలజీ మనిషి మనుగడను శాసించడం.. రెండు పరస్పర విరుద్ధమైన మొక్కలు కలిసిపోయి సంకరజాతిగా ఏర్పడటం.. వ్యతిరేక జాతులు సంభావ్యతను కలబోసుకోవడం..’ ఇలా ఎన్నెన్నో వింతలను, విచిత్రాలను బ్రహ్మంగారు ఆనాడే కాలజ్ఞానంలో బోధించారు. అయితే దీనిని కొంతమంది వ్యతిరేకిస్తారు. మరి కొంతమంది నిజమేనని ఒప్పుకుంటారు. దీని గురించి చర్చ పక్కన పెడితే.. బ్రహ్మంగారి కాలజ్ఞానాన్ని నిజం చేసే విధంగా చైనా శాస్త్రవేత్తలు ఓ ప్రయోగం చేశారు.. అది కూడా మామూలు ప్రయోగం కాదు. అదేదో సినిమాలో వైద్యశాస్త్రంలోనే అద్భుత ఘట్టం అని అలీ అంటుంటాడు కదా.. అలాంటి ప్రయోగం అన్నమాట.
ఇంతకీ ఏం చేశారంటే…
శాస్త్ర సాంకేతిక రంగాల్లో అమెరికాను తలదన్ని సరికొత్త శక్తిగా అవతరించాలని చైనా శాస్త్రవేత్తలు ఎప్పటినుంచో అడుగులు వేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే చైనా ప్రభుత్వం భారీగా సైన్స్ అండ్ టెక్నాలజీ మీద కేటాయింపులు జరుపుతోంది. ఇందులో భాగంగా చైనా శాస్త్రవేత్తలు జన్యు సవరణ అనే ప్రక్రియను తెరపైకి తీసుకొచ్చారు. మూత్రపిండాలను కోతిలో అమర్చారు. కోతి సుమారు 6 నెలలకు పైగా జీవించింది. వాస్తవానికి ఒక జాతి జంతువుల అవయవాలను మరో జాతి జంతువులలో మార్చే ప్రక్రియను ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు చేస్తున్నప్పటికీ.. ఈ తరహా పరిశోధనలో చైనా శాస్త్రవేత్తలు కీలక పురోగతి సాధించారు. ఇక గతంలో మన దేశాల శాస్త్రవేత్తలు పందికి సంబంధించిన మూత్రపిండాలను, హృదయాలను మనుషులకు అమర్చారు. ఇందులో విజయవంతం అయ్యారు కూడా. అయితే ఇలా అమర్చిన మనుషులు దీర్ఘకాలం జీవితాన్ని సజావుగా కొనసాగించలేకపోయారు. అయితే పంది అవయవాలు మనిషి అవయవాలతో సరి సమానమైన పరిమాణంలో ఉంటాయి. కోతి కూడా మనిషి లాగానే ఉంటుంది కాబట్టి.. కోతి నుంచి పరిణామ క్రమం చెంది మనిషిలాగా ఏర్పడ్డాడు కాబట్టి.. పంది అవయవాలను కోతులకు మార్చామని శాస్త్రవేత్తలు అంటున్నారు. ” అవయవాల మార్పిడి సంక్లిష్ట ప్రక్రియ. అయినప్పటికీ ఈ విషయంలో కీలక పురోగతి సాధించాల్సిన అవసరం ఉంది. అందువల్లే కోతి లో పంది మూత్రపిండాలు ఏర్పాటు చేశాం. అయితే ఆ కోతి మా పర్యవేక్షణలో ఆరు నెలల పాటు ఆరోగ్యంగా ఉంది. ఆ తర్వాత దాని శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుని కన్ను మూసింది. అయితే ఈ మార్పులు ఏ జన్యువుల వల్ల జరుగుతున్నాయి? ఆ జన్యువుల సంక్రమణ సాధ్యమవుతుందా? ఇంకా కొత్తగా ఏమైనా చేయాలా? అనే దిశగా ప్రయోగాలు చేస్తున్నామని” చైనా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే పంది మూత్రపిండాలు కోతిలోకి అమర్చడం వల్ల.. మొదటి ఆరు నెలలు సజావుగానే కోతి జీవితచక్రం సాగిందని.. ఆ తర్వాత దాని రక్తంలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయని తెలుస్తోంది. ఈ మార్పుల వల్లే కోతి కన్ను మూసిందని సమాచారం. అయితే ఆరు నెలల పాటు సజావుగా సాగిన కోతి జీవిత చక్రం ఒక్కసారిగా ఎందుకు మారింది? దాని రక్తంలో సంచలన మార్పులు ఎందుకు చోటుచేసుకున్నాయి? అనే విషయాలపై చైనా శాస్త్రవేత్తలు కీలకమైన ప్రయోగాలు చేస్తున్నారు. ఒకవేళ ఇందులో గనుక పురోగతి సాధిస్తే.. వివిధ జాతుల మధ్య అవయవాల మార్పిడికి కీలకమైన అడుగులు పడ్డట్టే.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Chinese scientists implant pig kidneys in monkeys
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com