Chat Gpt: సాంకేతిక రంగంలో Artificial Intelligence (AI) హవా మొదలైనప్పటి నుంచి చాలా రంగాలు దీనిని ఉపయోగించుకుంటున్నాయి. వీటిలో భాగంగా ఆల్ఫాబెట్, ఓపెన్ ఏఐ సంస్థలు పోటీపడి ఏఐ యాప్ లు అందుబాటులోకి తీసుకువచ్చాయి. అయితే ఒకటి నుంచి ఒకటి అప్డేట్ అవుతూ వినియోగదారులకు నాణ్యమైన సేవలను అందించేందుకు ప్రయత్నిస్తున్నాయి. గత నవంబర్ మధ్యలో గూగుల్ జెమినీ ఏఐ లేటెస్ట్ వెర్షన్ జెమిని 3 ప్రో ను రిలీజ్ చేసింది. దీంతో ఈ సంస్థకు ప్రధాన పోటీదారుడుగా ఉన్న Chat Gpt కంటే జెమిని ఏఐ మెరుగైన సేవలు అందిస్తుందని ప్రకటించింది. దీంతో ఓపెన్ ఏఐ తమ ప్రోడక్ట్ కు ముప్పు ఉందని భావించి ‘ కోడ్ రెడ్ ‘ ను ప్రకటించారు. కానీ కొద్ది రోజులకే ఈ సంస్థ చాట్ gpt 5.2 వెర్షన్ తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో జెమిని 3 ప్రో కంటే..Chat Gpt మెరుగైనదా? అన్న చర్చ సాగుతోంది.
Open AI ఓ ప్రకటనను జారీ చేస్తూ.. ప్రొఫెషనల్ నాలెడ్జ్ వర్క్ కోసం ఇప్పటివరకు ఉన్న అన్ని మోడల్స్ కంటే అత్యంత మెరుగైన సిరీస్ ను ఇప్పుడు chat gpt 5.2 వెర్షన్ ను రిలీజ్ చేస్తున్నామని అన్నారు. ఇది సాధారణ మేదస్సు తోపాటు దీర్ఘకాలిక సందర్భాలను అర్థం చేసుకోవడంతో పాటు ఏజెంటిక్ టూల్ కాలింగ్, విజన్ వంటి అంశాలలో ఘననీయమైన అప్ గ్రేడును తీసుకువస్తుంది. గతంలో ఉన్న వెర్షన్ కంటే ఇది చాలా మెరుగ్గా ఉంటుంది. కొన్ని టాస్కులు పూర్తి చేయడానికి సమర్థవంతంగా పనిచేస్తుంది.
Chat gpt ఉపయోగిస్తున్న వారు తమ పనులను సులువుగా పూర్తి చేసుకుంటున్నారని ఓపెన్ ఏఐ తెలిపింది. ఒకరకంగా దీనిని ఉపయోగించడం వల్ల వారానికి 10 గంటల వరకు సమయం ఆదా అవుతుందని అంటున్నారు. అయితే చాట్ జిపిటి 5.1 కంటే 5.2 ఉపయోగించడం వల్ల మరింత సమయం ఆదాయే అవకాశం ఉందని అంటున్నారు. ఈ కొత్త వర్షం స్ప్రెడ్ షీట్ ప్రజెంటేషన్ చేయడం, కోడ్ రాయడం, ఫోటోలను అర్థం చేసుకోవడం, పెద్ద పెద్ద కాంటెస్ట్ లను పూర్తి చేయడం, ఒకేసారి బహుళ పనులను నిర్వహించడం వంటివి చేస్తుంది. ఇటీవల ఆబ్స్ట్రాక్ థింకింగ్ కోసం నిర్వహించిన బెంచ్ మార్క్ పరీక్షలో చార్జీ పెట్టి 5.2 సరికొత్త రికార్డులను నెలకొల్పింది.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న జెమినీ 3 ప్రో కంటే లేటెస్ట్ వర్షన్ చాట్ జిపిటి 5.2 బెటర్ అని మేము ఆశిస్తున్నాం.. అని ఓపెన్ ఏఐ ప్రతినిధి ఆల్ట్ మన్ ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అయితే గత నవంబర్లో జెమినీ 3 ప్రో అందుబాటులోకి వచ్చిన సమయంలో మిగతా వాటికంటే ఇది హైలెట్గా నిలిచింది. జెమిని 3 ప్రో మల్టీ మోడల్ సామర్థ్యాలతో ఏ ఆలోచన కైనా ప్రాణం పోయే గలదు అని, ప్రధాన ఏఐ బెంచ్ మార్కులో 2.5 ప్రో కంటే గణనీయమైన మెరుగైన ఫలితాన్ని సాధించిందని అప్పుడు ప్రకటించింది. కానీ తాజాగా చాట్ జిపిటి 5.2 వెర్షన్ ను ఎలా తట్టుకుంటుందో చూడాలి.