Aadhar Card Update: భారతదేశంలో ప్రస్తుతానికి ప్రతి పనికి ఆధార్ కార్డు తప్పనిసరిగా మారిపోయింది. ఒక వ్యక్తికి గుర్తింపు ఉండాలన్నా.. ఆధార్ కార్డు ఉండాల్సిందే. అయితే ఒకప్పుడు ఆధార్ కార్డు పొందాలంటే రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. అంతేకాకుండా సరైన ఆధారాలు లేకుంటే ఆధార్ కార్డు ఇచ్చేవారు కాదు. కానీ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆధార్ కార్డును ఆన్లైన్ ద్వారా తీసుకునే అవకాశం ఏర్పడుతుంది. అయితే కొత్తగా ఆధార్ కార్డును తీసుకోవడం కంటే ఉన్న కార్డును మార్పులు చేసుకోవడానికి ఆన్లైన్లో కేంద్ర ప్రభుత్వం అవకాశాలను కల్పించింది. ఇందులో భాగంగా కొత్త యాప్ ను తీసుకువచ్చింది. ఈ యాప్ ఎటువంటి పనులు చేస్తుందంటే?
కొత్తగా ఆధార్ కార్డు తీసుకునే వారి కంటే.. ఇప్పటికే ఉన్నవారు సైతం నిర్ణీత సమయం దాటిన తర్వాత అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలామంది ఆధార్ కార్డును ఆధారంగా చేసుకొని అనేక అక్రమాలకు పాల్పడుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ఎప్పటికప్పుడు ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోవాలని UIDAI పేర్కొంటుంది. అయితే ఇప్పటివరకు ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోవాలంటే మీసేవ సెంటర్లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చేది. ఒకవేళ ఇక్కడ క్యూ ఉంటే ఒక రోజు మొత్తం సమయం పట్టేది. కానీ ఇప్పుడు ఆన్లైన్లో ఆధార్ కార్డు వివరాలను అప్డేట్ చేసుకునేందుకు అవకాశాన్ని కల్పించింది. ఇందులో భాగంగా My Aadhar అనే యాప్ ను ప్రవేశపెట్టింది. ఈ యాప్ ద్వారా ఆధార్ కార్డు వివరాలను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.
అయితే ప్రస్తుతానికి ఆధార్ యాప్ ద్వారా మొబైల్ నెంబర్ ను మాత్రమే అప్డేట్ చేసుకోవాల్సిన అవకాశాన్ని కల్పించింది. రూ.75 చెల్లించి మొబైల్ నెంబర్ ను అప్డేట్ చేసుకోవచ్చు. అయితే భవిష్యత్తులో డేటాఫ్ బర్త్, అడ్రస్ వివరాలను కూడా అప్డేట్ చేసుకునేందుకు అవకాశాన్ని కల్పించనుంది. దీంతో ఆధార్ కార్డు వివరాలను మార్చుకోవాలని అనుకునే వారికి ఈ అవకాశం సులభతరంగా మారనుంది. చాలామంది ఆధార్ కార్డు ఉన్నవారు అడ్రస్ లు మారుతూ ఉంటారు. దీంతో కొన్ని విషయాల్లో దరఖాస్తు చేసుకుంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎప్పటికప్పుడు ఆధార్ కార్డు అడ్రస్ ను మార్చుకునే అవకాశం ప్రస్తుతానికి లేదు. అయితే భవిష్యత్తులో ఈ యాప్ ద్వారా మార్చుకోవాల్సిన అవకాశం రానుంది.
ప్రస్తుతానికి ప్రతి దరఖాస్తుకు ఆధార్ కార్డు తప్పనిసరిగా మారిపోయింది. దీంతో ఈ ఆధార్ కార్డును జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. కొందరు ఆధార్ కార్డును ఆధారంగా చేసుకొని మొబైల్ సిమ్ కార్డులను కొనుగోలు చేస్తున్నారు. ఇలా కొనుగోలు చేసిన వాటిని అక్రమాలకు ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా ఆధార్ కార్డుతో బ్యాంకు అకౌంట్లు లింక్ అయి ఉండడంతో కూడా అకౌంట్లో హ్యాక్ అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆధార్ కార్డును జాగ్రత్తగా వాడుకోవాల్సిన అవసరం ఉంది.