Pawan Kalyan: భర్త కొట్టాడని కాదు.. తోటి కోడలు నవ్వడమే ఆమె బాధ అన్నట్టు ఉంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ( YSR Congress) పరిస్థితి. ఓటమి పార్టీల మధ్య విభేదాలు రావడం ఆ పార్టీకి అత్యవసరం. ఒకవైపు సింగిల్ గా రండి అంటూ సవాల్ విసురుతూనే.. ఆ మూడు పార్టీల మధ్య విభేదాలు సృష్టించేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేయని ప్రయత్నం అంటూ లేదు. అయితే ఎట్టి పరిస్థితుల్లో తాము విడిపోమని.. మరో 15 సంవత్సరాలు పాటు కలిసి ఉంటామని పవన్ చెబుతూ వస్తున్నారు. అయినా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఆశ చావలేదు. చేయని ప్రయత్నం అంటూ లేదు. అయితే ఒకే ఒక్క ఫోటోతో వారికి పవర్ స్ట్రోక్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. లోకేష్ కు ఆత్మీయ ఆలింగనం చేసుకున్న ఫోటో సోషల్ మీడియా లో వైరల్ కావడంతో.. వీరిని విడదీయడం వీలు కాదు రా బుజ్జి అంటూ నేటిజన్లు కామెంట్లు పెట్టడం మొదలుపెట్టారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అయితే ఈ ఫోటో ఎంత మాత్రం మింగుడు పడటం లేదు.
* లోకేష్ కు ఆత్మీయ ఆలింగనం..
నిన్ననే అమరావతిలో( Amravati capital ) బ్యాంకు కార్యాలయాలకు సంబంధించి భవనాలకు శంకుస్థాపనలు జరిగాయి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ శంకుస్థాపనలు చేశారు. సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం పాల్గొన్నారు. మంత్రి లోకేష్ సైతం వచ్చారు. అయితే వేదికపై మంత్రి నారా లోకేష్ ను ఆత్మీయంగా ఆ లింగనం చేసుకున్నారు పవన్ కళ్యాణ్. అయితే లోకేష్ విషయంలో పవన్ అభిమానంతో ఉంటారు. పవన్ పట్ల లోకేష్ సైతం గౌరవంతో మెలుగుతారు. అప్పట్లో ప్రమాణ స్వీకార సమయంలో తన తండ్రి చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ కు సైతం పాదాభివందనం చేశారు లోకేష్. పవన్ కళ్యాణ్ను తన అన్నయ్యతో పోల్చుకుంటారు. నిత్యం పెద్దన్న అంటూ సంబోధిస్తారు లోకేష్. అయితే ఎక్కడ ఏ పరిణామం చోటు చేసుకున్నా.. ఏ మీడియాలో కథనాలు వచ్చినా.. లోకేష్, పవన్ కళ్యాణ్ కు ముడిపెట్టి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తుంటుంది. వారిద్దరి మధ్య విభేదాలు ఉన్నట్లు ప్రొజెక్ట్ చేస్తూ వస్తోంది.
* ప్రతి రెండు నెలలకు ఒకసారి..
అయితే ప్రతి రెండు మూడు నెలలకు ఒకసారి దీనిపై సమాధానం ఇస్తుంటారు పవన్ కళ్యాణ్( Pawan Kalyan). అయితే అది నోటి ద్వారా కాదు. తన చేతల ద్వారా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు నోరు ముగించేలా చేస్తుంటారు. నిన్న అమరావతిలో జరిగిన బ్యాంకు కార్యాలయాల శంకుస్థాపనలో దృశ్యాలు చూస్తే ఖచ్చితంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కంటగింపుగా మారుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎదురొచ్చి లొకేష ను ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. సహజంగా ఇటువంటివి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు నచ్చవు. ఎందుకంటే పవన్, లోకేష్ ల మధ్య గొడవ జరిగితేనే వారికి ఆనందంగా ఉంటుంది. వారి కళ్ళు చల్లబడతాయి. కానీ దానికి ఎంత మాత్రం అవకాశం ఇవ్వడం లేదు పవన్. లోకేష్ పట్ల అభిమానంతో ఉంటున్నారు పవన్. పవన్ పట్ల గౌరవంతో మెలుగుతున్నారు లోకేష్. ఇది అర్థం అయినా.. ఏదేదో ఊహించుకుంటున్నారు వైసీపీ శ్రేణులు. అయితే పవన్ చెబుతున్నట్టు 15 సంవత్సరాల పాటు ఈ పరిస్థితి ఇలా కొనసాగితే మాత్రం తమ పని అయిపోయినట్టేనని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి.