Chandrayaan 3 Engineers Salaries: యావత్ భారత్ గర్వించే చంద్రయాన్ -3 మొదటి ఘట్టాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. అనుకున్న సమయానికి ఆగస్టు 24న చంద్రుడిపై ల్యాండ్ కాగలిగితే చంద్రుడిపై అడుగుపెట్టిన నాలుగో దేశంగా భారత్ నిలుస్తోంది. అయితే చంద్రయాన్ 3ని తయారు చేయడానికి ఎంతో శ్రమ ఖర్చయింది. దీని లాంచ్ ప్యాడ్ ను రాంచీలోని హెవీ ఇంజనీరింగ్ కంపెనీ తయారు చేసింది. ఇది కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ. ఇందులో 2,700 మంది పనిచేస్తారు. 450 మంది ఎగ్జిక్యూటివ్స్ పనిచేస్తారు. వీరికి గత 17 నెలలుగా జీతాలు లేవంటే ఎవరైనా నమ్ముతారా? కానీ నిజంగానే వీరు నెలనెలా ఆదాయాన్ని పొందడం లేదనే విషయం బయటకు రావడంతో చర్చనీయాంశంగా మారింది.
2022 మే నెలలోనే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అదే ఏడాది సెప్టెంబర్ లో మరోసారి వెలుగులోకి వచ్చింది. కానీ ఆ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. వీరు తమకు జీతాలు రాకపోయినా అనుకున్న సమయానికి లాంచింగ్ ప్యాడ్ ను అందించారు. అయితే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, రైల్వేస్ నుంచి ఈ కంపెనీకి కోట్ల రూపాయల ఆర్డర్లు ఈ కంపెనీకి ఉన్నాయి. కానీ ఈ కంపెనికి వెయ్యి కోట్ల క్యాపిటల్ కావాలని కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి ఎప్పటి నుంచో కోరతుంది. క్యాపిటల్ సమకూర్చకపోవడానికి కొందరు అనేక కారణాలు తెరపైకి తీస్తున్నారు. దీనిని ప్రైవేట్ వారికి అప్పగించడానికే ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.
ఒకవేళ హెవీ కార్పొరేషన్ కంపెనీ నష్టాల్లో ఉన్నదా? అంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే చంద్రయాన్ 3 ఆర్డర్ ఆ కంపెనీకే ఎందుకు ఇస్తారు? అని అంటున్నారు. స్పేస్ సెక్టార్ లో ప్రైవేట్ రంగం ఎప్పుడో ఎంట్రీ ఇచ్చింది. అలాంటప్పుడు చంద్రయాన్ 3 ని హెవీ కార్పొరేషన్ కు ఎందుకు ఇవ్వాలి? అనే ప్రశ్న ఎదురవుతుంది. రాఫేల్ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హిందుస్థాన్ హెరోనాటిక్స్ లిమిటెడ్ తొలగించే విషయంలో సంతకం చేశారనేది వాస్తవమని అంటున్నారు. దీని ప్లేసులో అనిల్ అంబానీ నియమితులయ్యారు.
ఇలా ప్రభుత్వ రంగ సంస్థలను పక్కకు తప్పించి ప్రవేట్ వ్యక్తులను దించుతూ.. దేశాభ్యున్యతకు పాటుపుతున్న వారిని పట్టించుకోవడం లేదు. చంద్రయాన్ 3 విజయవంతమైతే ప్రపంచ దేశాలన్నీ భారత్ గురించే మాట్లాడుతుంటారు. భారత ప్రధానికి వివిధ దేశాల నుంచి ప్రశంసలు దక్కుతాయి. భారతీయులంతా ప్రపంచ వ్యాప్తంగా పండుగ చేసుకుంటారు. కానీ ఆ చంద్రయాన్ 3ని తయారు చేసిన వారికి 17 నెలలుగా జీతాలు రాకపోతే వారు ఎలా జీవించాలి? అని కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.