Smartphone: మన దేశంలోని మొబైల్ మార్కెట్ లో ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయనే సంగతి తెలిసిందే. రోజులు గడిచే కొద్దీ ఎన్నో కొత్త ఫీచర్లతో మార్కెట్ లోకి స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వస్తున్నాయి. తక్కువ ధరకే ఎక్కువ స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వస్తుండగా ఈ స్మార్ట్ ఫోన్లలో కొన్ని 5జీ సపోర్ట్ చేస్తుండటం గమనార్హం. రెడ్ మీ, రియల్ మీ, మోటరోలా, ఎం.ఐ బ్రాండ్ లకు చెందిన స్మార్ట్ ఫోన్లను సులభ వాయిదాలలో కొనుగోలు చేయవచ్చు.

ప్రముఖ స్మార్ట్ ఫోన్లలో ఒకటైన రియల్ మీ 8 ప్రో క్వాడ్ కెమెరా సెటప్ ను కలిగి ఉండగా ఈ మొబైల్ లో ప్రైమరీ కెమెరా 108 మెగాపిక్సెల్స్ తో ఉంటే సెకండరీ కెమెరా 8 మెగా పిక్సెల్స్ తో ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ 8జీబీ ర్యామ్ వేరియంట్ ధర 19,999 రూపాయలు కావడం గమనార్హం. నెలకు కేవలం 970 రూపాయలు చెలించి హెచ్డీఎఫ్సీ కార్డు ద్వారా ఈ స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేయవచ్చు. 24 నెలల పాటు ఈ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.
మోటరోలా మోటో జీ60 స్మార్ట్ ఫోన్ 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో మార్కెట్ లో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ ధర 16,999 రూపాయలు కాగా నెలకు కేవలం 825 రూపాయలు ఈ.ఎం.ఐ చెల్లించి ఈ స్మార్ట్ ఫోన్ ను కొనుగోలుక్ చేయవచ్చు. రెడ్‌మి 10ప్రో మ్యాక్స్ ధర 21,999 రూపాయలుగా ఉంది. 5020 ఎంఏఎచ్ బ్యాటరీతో మార్కెట్ లో ఈ స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉంది. నెలకు 1067 రూపాయలు చెల్లించడం ద్వారా ఈ ఫోన్ ను కొనుగోలు చేయవచ్చు.
ఎం.ఐ 10ఐ ఫోన్ 108 మెగా పిక్సెల్ కెమెరాతో మార్కెట్ లో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ ధర 21,999 రూపాయలు కాగా అమెజాన్ లో ఈ స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉంది. నెలకు 1067 రూపాయలు 24 నెలలు చెల్లించడం ద్వారా ఈ స్మార్ట్ ఫోన్ ను సొంతం చేసుకోవచ్చు.