Corona Vaccine: దేశంలో కరోనా వ్యాక్సిన్ల పంపిణీ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. యువత, ఉద్యోగులు కరోనా వ్యాక్సిన్ ను తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం కరోనా వ్యాక్సిన్ విషయంలో నెలకొన్న అపోహల వల్ల వ్యాక్సిన్ ను తీసుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ప్రజల్లో కరోనా భయం తగ్గడంతో వ్యాక్సిన్ ను తీసుకునే వాళ్ల సంఖ్య క్రమంగా తగ్గుతుండటం గమనార్హం.

ప్రజలు ప్రస్తుతం గుంపులుగుంపులుగా సంచరిస్తూ ఉండటం గమనార్హం. మరోవైపు కరోనా కేసులు తగ్గడం వల్ల కూడా కొంతమంది కరోనా వ్యాక్సిన్ ను వేయించుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. దేశంలో కొత్తగా నమోదవుతున్న కరోనా కేసులను పరిశీలిస్తే వాళ్లలో కరోనా వ్యాక్సిన్ ను తీసుకోని వాళ్లే ఎక్కువ సంఖ్యలో ఉండటం గమనార్హం. పలు రాష్ట్రాల్లో వ్యాక్సిన్ ను తీసుకోని వాళ్ల సంఖ్య కోట్లలో ఉండటం గమనార్హం.
తెలంగాణ రాష్ట్రంలో 69 లక్షల మంది మొదటి డోస్ వ్యాక్సిన్ ను కూడా తీసుకోలేదు. 36 లక్షల మంది రాష్ట్రంలో ఇప్పటివరకు మొదటి డోసు తీసుకున్నా సెకండ్ డోస్ ను తీసుకోలేదు. కరోనా వ్యాక్సిన్ విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్న వాళ్లు కొన్నిసార్లు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి ఏర్పడుతోంది. సెకండ్ వేవ్ సమయంలో ప్రాణాలు కోల్పోయిన వాళ్లలో మధ్య వయస్కులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు.
కరోనా వ్యాక్సిన్ ను తీసుకోకపోవడం వల్ల భవిష్యత్తులో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పటివరకు కరోనా వ్యాక్సిన్ ను తీసుకోని వారు వెంటనే వ్యాక్సిన్ ను తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు. వైద్యులు, అధికారులు ప్రజల్లో అవగాహన కల్పిస్తే వ్యాక్సిన్ తీసుకునే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరిగే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు.