Automobile sales May 2025: భారత ఆటోమొబైల్ రంగం ఎప్పటిలాగే 2025 సంవత్సరం మే నెలలో వాహనాల అమ్మకాల్లో వృద్ధిని కొనసాగించింది. ముఖ్యంగా దేశీయంగా వాహనాల విక్రయాలను పెంచుకోవడంతో పాటు ఎగుమతుల విషయంలోనూ విజయాన్ని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వాహనాల విక్రయాలకు సంబంధించిన విషయాలను Society of Indian Automobile (SIAM) డైరెక్టర్ జనరల్ రాజేష్ మీనన్ పేర్కొన్నారు. ఆయన తెలిపిన ప్రకారం 2025 మే నెలలో వాహనాల వృద్ధి స్థిరంగా కొనసాగిందని పేర్కొన్నారు. ఆయన తెలిపిన వివరాల్లోకి వెళ్తే..
2024 మే నెలతో పోలిస్తే 2025 మే నెలలో ప్యాసింజర్ వాహనాలు 0.8% తగ్గుదల కనిపిస్తోంది. అయితే ఇది ఈ సంవత్సరంలో రెండవ అత్యధిక అమ్మకాలు అని అనుకోవచ్చని పేర్కొన్నారు. ఈ నెలలో ప్యాసింజర్ వాహనాల విభాగం 3.5 లక్షల యూనిట్లు అమ్మకాలను నమోదు చేసిందని ఆయన పేర్కొన్నారు. ఇందులో ద్విచక్ర వాహనాల విభాగం 16.56 లక్షల యూనిట్ల అమ్మకాలు నమోదు చేసి 2.2% వృద్ధిని నమోదు చేసింది. ఇదే సమయంలో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు కూడా గత ఏడాదితో పోలిస్తే స్వల్పంగా అమ్మకాలు తగ్గినట్టు తెలుస్తోంది. 2024 మే నెలలో ప్యాసింజర్ వాహనాలు 3,47,492 లక్షల యూనిట్లు ఉంటే.. 2025 మే నెలలో 3,44,656 లక్షల యూనిట్లు ఉన్నాయి. అంటే ప్యాసింజర్ వాహనాల అమ్మకాల్లో గత ఏడాదితో పోలిస్తే 0.8% తగ్గినట్లు తెలుస్తోంది. వీటిలో కార్లు 2024 మే నెలలో 1,06,952 లక్షల యూనిట్లు ఉండగా.. 2025 మే నెలలో 93. 951 యూనిట్లో ఉన్నాయి. అంటే ఈ విషయంలో 12.2% తగ్గుదల ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: Nissan : ఆటో ఇండస్ట్రీలో మరో షాక్.. ఏకంగా 20వేల మందిని తీసేస్తున్న కంపెనీ
ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు స్వల్పంగా తగ్గుముఖం ఉన్నప్పటికీ యుటిలిటీ వాహనాల అమ్మకాలు మాత్రం సానుకూల ఫలితాలను అందించాయి. ఈ వాహనాలు 2024 మే నెలలో 1,82,883 లక్షల యూనిట్లు ఉంటే.. ఈ ఏడాది 1,96,821 యూనిట్లో నమోదు చేసుకుంది. ఈ విషయంలో గత ఏడాది కంటే 7.6% వృద్ధిని నమోదు చేసిందని తెలుస్తోంది. వ్యాన్లో అమ్మకాలు కూడా గత ఏడాది కంటే ఈ ఏడాది 12.5% మెరుగుదల చూపించింది. దేశీయంగా కార్ల అమ్మకాల విషయంలో మాత్రం స్వల్పంగా తగ్గుదల కనిపించినట్లు తెలుస్తోంది. కదా ఏడాది దేశీయంగా కార్ల అమ్మకాలు మే నెలలో 2,03,309 లక్షల యూనిట్లో ఉంటే.. ఈ ఏడాది 1,85,099 లక్షల యూనిట్లు ఉన్నాయి. అంటే 9% తగ్గుదల కనిపించినట్లు తెలుస్తోంది.
దేశీయంగా వాహనాల విక్రయాలు స్వల్ప ఆదిత్యతను నమోదు చేసుకుంటే.. ఎగుమతుల విషయంలో మెరుగైన ఫలితాలు సాధించినట్లు తెలుస్తోంది. 2024 మే నెలలో ఎగుమతులు 53, 991 యూనిట్లో ఉంటే.. ఈ ఏడాది 67,181 యూనిట్లో నమోదు చేసుకొని 24.4% వృద్ధిని సాధించింది. ఇందులో యుటిలిటీ వాహనాలు మరింత మెరుగుదలను సాధించాయి. ఈ వాహనాల ఎగుమతులు 32.3% వృద్ధిని సాధించాయి.
ఇలా మొత్తంగా ఆటోమొబైల్ రంగానికి చెందిన వాహనాల విక్రయాలలో దేశీయంగా స్వల్ప ఆదిత్య నమోదు చేసుకున్నప్పటికీ ఎగుమతుల విషయంలో మెరుగైన ఫలితాలు సాధించింది. దీంతో ఓవరాల్ గా ఈ రంగం గతంలో కంటే మంచి ఫలితాలు సాధించిందని తెలుస్తోంది.