ATM Torn Notes: ఏటీఎం నుంచి చిరిగిపోయిన నోట్లు వచ్చాయా.. ఏం చేయాలంటే..?

ATM Torn Notes: మనలో చాలామంది ఏటీఎంల ద్వారా అవసరాలకు అనుగుణంగా నగదును విత్ డ్రా చేసుకుంటూ ఉంటారు. ఒకప్పుడు డబ్బులు కావాలంటే కేవలం బ్యాంకుల ద్వారానే లావాదేవీలు జరిపిన ప్రజలు ప్రస్తుతం నేరుగా ఏటీఎంలకు వెళ్లి నగదు విత్ డ్రా చేస్తున్నారు. భారతీయ డిజిటల్ మార్కెట్ డిజిటలైజేషన్ జరిగినప్పటి నుంచి బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన పనులు రోజురోజుకు సులభమవుతూ ఉండటం గమనార్హం. అయితే ఏటీఎంల నుంచి డబ్బులు విత్ డ్రా చేసిన సమయంలో కొన్నిసార్లు చిరిగిపోయిన […]

Written By: Navya, Updated On : August 31, 2021 4:17 pm
Follow us on

ATM Torn Notes: మనలో చాలామంది ఏటీఎంల ద్వారా అవసరాలకు అనుగుణంగా నగదును విత్ డ్రా చేసుకుంటూ ఉంటారు. ఒకప్పుడు డబ్బులు కావాలంటే కేవలం బ్యాంకుల ద్వారానే లావాదేవీలు జరిపిన ప్రజలు ప్రస్తుతం నేరుగా ఏటీఎంలకు వెళ్లి నగదు విత్ డ్రా చేస్తున్నారు. భారతీయ డిజిటల్ మార్కెట్ డిజిటలైజేషన్ జరిగినప్పటి నుంచి బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన పనులు రోజురోజుకు సులభమవుతూ ఉండటం గమనార్హం.

అయితే ఏటీఎంల నుంచి డబ్బులు విత్ డ్రా చేసిన సమయంలో కొన్నిసార్లు చిరిగిపోయిన నోట్లు వస్తుంటాయి. చిరిగిపోయిన నోట్లను ఏ విధంగా మార్చుకోవాలో చాలామందికి తెలియదు. చిరిగిపోయిన నోట్లు వచ్చిన సమయంలో కొన్ని విషయాలను తపనిసరిగా గుర్తుంచుకోవాలి. చిరిగిపోయిన నోట్లను మార్చుకోవాలని అనుకుంటే ఏటీఎం నుంచి నగదు విత్ డ్రా చేసిన బ్యాంకుకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఏటీఎం, తేదీ, విత్ డ్రా స్లిప్ వివరాలను దరఖాస్తులో పొందుపరిచి సెల్ ఫోన్ కు వచ్చిన మెసేజ్ ను సాక్ష్యంగా చూపిస్తూ చిరిగిన నోట్లను సులభంగా మార్చుకోవచ్చు. తగిన ఆధారాలు చూపిస్తే బ్యాంక్ సిబ్బంది చిరిగిన నోట్లకు బదులుగా కొత్త నోట్లను ఇస్తారు. ఎస్బీఐ ఏటీఎంల ద్వారా చిరిగిన నోట్లు వస్తే చిరిగిన నోట్ల గురించి https://crcf.sbi.co.in/ccf/ వెబ్ సైట్ ద్వారా జనరల్ బ్యాంకింగ్, నగదు సంబంధిత కేటగిరీ కింద ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది.

ఎస్బీఐ బ్యాంక్ సిబ్బంది చిరిగిన నోట్లను తీసుకోవడానికి అంగీకరించని పక్షంలో ఫిర్యాదు చేయడం ద్వారా బ్యాంకులు, బ్యాంకు ఉద్యోగులపై చర్యలు తీసుకుంటారు. కస్టమర్ ఫిర్యాదును బట్టి బ్యాంకులు కొన్ని సందర్భాల్లో నష్టపరిహారాన్ని కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఎస్బీఐ నోట్లను లోడ్ చేసే ముందు సార్టింగ్ యంత్రాల ద్వారా తనిఖీ చేస్తుంది. ఆ తనిఖీలో చిరిగిన నోట్లను గుర్తించడం సాధ్యం కాదు.