Homeసైన్స్‌ అండ్‌ టెక్నాలజీAsteroid: భూమి అంతానికి మరో 7 ఏళ్లు మాత్రమే.. ఢీకొట్టేందుకు వస్తున్న భారీ గ్రహశకలం.. మానవాళి...

Asteroid: భూమి అంతానికి మరో 7 ఏళ్లు మాత్రమే.. ఢీకొట్టేందుకు వస్తున్న భారీ గ్రహశకలం.. మానవాళి కి ఆఖరి రోజులు

Asteroid: ప్రపంచం ఇప్పుడు పెద్ద ఆపదను ఎదుర్కోబోతుంది. త్వరలోనే భూమికి నూకలు చెల్లిపోతుందని అంటున్నారు శాస్త్రవేత్తలు. 2032 డిసెంబరులో భూమి వైపు ఒక పెద్ద ఆస్టరాయిడ్‌ 2024 YR4 దూసుకొస్తోంది. 100 మీటర్ల వ్యాసంతో ఉన్న ఈ ఆస్టరాయిడ్‌ ప్రస్తుతం గంటకు 38,000 కిలోమీటర్ల వేగంతో భూమి వైపు వేగంగా వస్తోంది. ఈ ఆస్టరాయిడ్‌ భూమి పై పడితే ఏకకాలంలో ప్రపంచం వినాశనానికి దారితీస్తుందని శాస్త్రవేత్తల అంచనా. ఆస్టరాయిడ్‌ 2024 YR4 భూమిని ఢీకొంటే 80 లక్షల టన్నుల TNT శక్తిని విడుదల చేస్తుంది. ఇది అణుబాంబుల శక్తికి 500 రెట్లు అధికం. హిరోషిమా, నాగసాకి పై వేసిన అణుబాంబులతో పోల్చితే ఈ శక్తి వేల రెట్లు ఎక్కువ. దీనివల్ల వచ్చిన షాక్‌వేవ్స్‌, వేడి, డెబ్రిస్‌ పెద్ద వినాశనాన్ని మిగిలుస్తాయి.

ఒకవేళ ఆస్టరాయిడ్‌ భూమి వాతావరణంలోకి ప్రవేశిస్తే, అది మిడ్‌ ఎయిర్‌ ఎక్స్‌ప్లోజన్‌ను కలిగిస్తుంది. 50 కిలోమీటర్ల పరిధిలో రెప్పపాటులో సర్వం బూడిద అయిపోతుంది. సముద్రంలో పడితే సునామీలు ఏర్పడతాయి. భూమిపై పడితే క్లైమేట్‌పై తీవ్ర ప్రభావం చూపే డస్ట్‌ క్లౌడ్స్‌ ఏర్పడతాయి. చైనాతో సహా అనేక దేశాలు ఈ ముప్పును తగ్గించేందుకు చర్చలు ప్రారంభించాయి. అవి “కైనెటిక్‌ ఇంపాక్టర్స్‌,” “గ్రావిటీ ట్రాక్టర్స్‌,” “న్యూక్లియార్‌ ఎక్స్‌ప్లోజివ్స్‌” వంటి టెక్నాలజీలను ఉపయోగించేందుకు పరిశోధనలు నిర్వహిస్తున్నాయి. చైనాలో స్పేస్‌ ఇంజినీర్లు, సైంటిస్ట్‌లు ఈ అంశంపై పనిచేస్తున్నారు.

నాసా, యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ అప్రమత్తం
నాసా , యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ ఈ ఆస్టరాయిడ్‌ను పర్యవేక్షిస్తున్నాయి. నాసా “డబుల్‌ ఆస్టరాయిడ్‌ రీడైరెక్షన్‌ టెస్ట్‌” (DART) ద్వారా ఈ తరహా ముప్పు ఎదుర్కొనే టెక్నాలజీని పరీక్షించి విజయవంతమైంది. ఇప్పుడు ఈ ప్రక్రియను మరింత విస్తరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి
ఆస్టరాయిడ్‌ 2024 YR4 భూమిని ఢీకొట్టే అవకాశాలు తక్కువగానే ఉన్నప్పటికీ, ఖగోళ శాస్త్రవేత్తలు అప్రమత్తంగా ఉన్నారు. స్పేస్‌ అబ్జర్వేటరీలు, టెలిస్కోపులు, అడ్వాన్స్‌డ్‌ సిమ్యులేషన్స్‌ ద్వారా దీనిని పర్యవేక్షిస్తున్నారు.

మానవాళి పరీక్ష
కాస్మిక్‌ థ్రెట్స్‌ నుంచి మానవాళి తమని తాము రక్షించుకునే సామర్థ్యానికి 2032 డిసెంబర్లో భూమికి దగ్గరగా రానున్న ఆస్టరాయిడ్‌ 2024 YR4 పరీక్ష పెట్టనుంది. శాస్త్రవేత్తలు నిరంతరం దాన్ని ట్రాక్‌ చేస్తూ ముప్పును అంచనా వేస్తున్నారు. ఇంజినీర్లు దాన్ని తప్పించేందుకు ఉన్నటు వంటి మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో ఏం జరుగతుందో అని యావత్తు ప్రపంచం ఆశ్చర్యంగా ఎదురుచూస్తోంది. ఈ అత్యంత ప్రమాదకరమైన ఆస్టరాయిడ్‌ను సమర్థంగా ఎదుర్కొనడం ఇప్పుడు శాస్త్రవేత్తలందరికీ ఒక ప్రధాన సవాల్‌గా మారింది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular