Viral Video: నిన్నటిదాకా కోయారే కోయా.. సోషల్ మీడియాను తెగ ఊపింది. చివరికి లైలా సినిమాలో విశ్వక్ సేన్ ఓ పాటలో కోయారే కోయ ను వాడుకున్నాడు. సోషల్ మీడియాలో సంచలనం అవుతున్న పాటలే.. ఇప్పుడు సినిమాల్లో దర్శనమిస్తున్నాయి. ఆ మధ్య గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబు కూడా “కుర్చిని మడతపెట్టి” అనే పదాన్ని తన పాటలో ఉపయోగించుకున్నాడు.
నిన్నటిదాకా సోషల్ మీడియాలో పాస్టర్ గురప్ప పాడిన కోయారే కోయ పాట సంచలనంగా మారింది. కొద్దిరోజుల పాటు అదే టాప్ ట్రెండులో కొనసాగింది. ఈ పాటను సోషల్ మీడియా ఇన్ ఫ్లూయన్సర్స్ తెగ వైరల్ చేశారు. ఇప్పుడు ఆ పాటను తలదన్నేలా మరో పాట వచ్చింది.. అయితే ఈ పాటను ఓ మహిళ వాడటం విశేషం. అయితే ఆమె ఆచరించే మతానికి అనుకూలంగా ఈ పాటను రూపొందించింది.. తను ఆరాధించే దేవుడిని స్తుతిస్తూ సరికొత్తగా పాడింది. అయితే ఈ పాటలో ఆమె ఉపయోగించిన పదాలు చాలా చిత్రంగా ఉన్నాయి.. డాడీ.. లవ్ యూ.. ఇంకా ఎన్నో పదాలు ఈ పాటలో ఉన్నాయి. ఆ పాట ఆమె ఆలపిస్తున్న తీరు చిత్రంగా ఉంది. దీంతో నెటిజన్లు ఆ పాటను వైరల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఇది లక్షల్లో వ్యూస్ సొంతం చేసుకుంది. నిన్నటిదాకా గురప్ప.. ఇప్పుడేమో ఈమె.. ఇంకేముంది సోషల్ మీడియాలో వారు ఊహించిన దానికంటే ఎక్కువగా తెగ ప్రచారం జరుగుతోంది.
సెలబ్రిటీలు అయిపోయారు
మొన్నటిదాకా గురప్ప ఒక సాధారణ పాస్టర్ గా ఉండేవారు. ఎప్పుడైతే కోయారే కోయ పాట సోషల్ మీడియాలో సంచలనంగా మారిందో.. ఆయన ఒక సెలబ్రిటీ అయిపోయారు. ఎక్కడికి వెళ్లినా ప్రజలు ఆయన చుట్టూ గుమికూడుతున్నారు. ఫోటోలు తీసుకుంటున్నారు. సెల్ఫీలు దిగుతున్నారు. ఆటోగ్రాఫ్ లు అడుగుతున్నారు. అయితే ఇంత పేరు ప్రఖ్యాతలు తనకు వస్తాయని కలలో కూడా ఊహించలేదని గురప్ప ఇటీవల వ్యాఖ్యానించారు. ఇక తన మతానికి సంబంధించి పాటలు పాడి.. అతను ఆరాధించే దేవుడిని స్తుతిస్తూ పాటలు ఆలపిస్తున్న ఓ మహిళ కూడా సెలబ్రిటీ అయిపోయారు. గతంలో ఆమె పాడిన ఓ పాట సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు అదే స్థాయిలో ఆమె పాడిన పాట సంచలనంగా మారింది. సోషల్ మీడియాను ఫాలో అయ్యే వారికి ఆమె పాడిన పాట తెగ కనిపిస్తోంది. దీంతో నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. నిన్నటిదాకా గురప్ప.. ఇప్పుడేమో ఈమె.. ప్రతిసారి వీళ్ల ఎంట్రీ ఏంట్రా బాబూ .. మిగతా వాళ్లకు వీళ్ళు అవకాశాలు ఇవ్వరా అంటూ నెటిజన్లు పేర్కొంటున్నారు.
View this post on Instagram