ఒక కంపెనీ ఫోన్ ఛార్జర్ ను మరో ఫోన్ కు వాడకూడదా..?

దేశంలోని యువత, విద్యార్థులు స్మార్ట్ ఫోన్లను ఎక్కువగా వినియోగిస్తున్నారు. టెలీకాం కంపెనీలు తక్కువ రీఛార్జీతో ఎక్కువ డేటా ఇస్తూ ఉండటంతో ఇంటర్నెట్ వినియోగం అంతకంతకూ పెరుగుతోంది. అయితే మొబైల్ ఫోన్ ను వాడేవాళ్లలో చాలామంది ఒక కంపెనీ మొబైల్ ఫోన్ కు మరో కంపెనీ మొబైల్ ఫోన్ ఛార్జర్ ను వినియోగిస్తున్నారు. కొంతమంది వేగంగా ఛార్జింగ్ అవుతుందనే కారణంతో వేరే కంపెనీ ఛార్జర్లను వినియోగించడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే టెక్ నిపుణులు ఒక ఫోన్ కు ఇతర […]

Written By: Navya, Updated On : February 1, 2021 5:27 pm
Follow us on

దేశంలోని యువత, విద్యార్థులు స్మార్ట్ ఫోన్లను ఎక్కువగా వినియోగిస్తున్నారు. టెలీకాం కంపెనీలు తక్కువ రీఛార్జీతో ఎక్కువ డేటా ఇస్తూ ఉండటంతో ఇంటర్నెట్ వినియోగం అంతకంతకూ పెరుగుతోంది. అయితే మొబైల్ ఫోన్ ను వాడేవాళ్లలో చాలామంది ఒక కంపెనీ మొబైల్ ఫోన్ కు మరో కంపెనీ మొబైల్ ఫోన్ ఛార్జర్ ను వినియోగిస్తున్నారు. కొంతమంది వేగంగా ఛార్జింగ్ అవుతుందనే కారణంతో వేరే కంపెనీ ఛార్జర్లను వినియోగించడానికి ఆసక్తి చూపుతున్నారు.

అయితే టెక్ నిపుణులు ఒక ఫోన్ కు ఇతర కంపెనీల ఫోన్ ఛార్జర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ వాడవద్దని సూచిస్తున్నారు. ప్రతి కంపెనీ మొబైల్ కు ఛార్జర్ వస్తుందని.. ఆ ఛార్జర్ ను మాత్రమే వినియోగించాలని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఏదైనా కారణాల వల్ల కంపెనీ ఫోన్ ఛార్జర్ పని చేయని పక్షంలో ఖరీదు ఎక్కువైనా అదే కంపెనీ ఫోన్ ఛార్జర్ ను కొనుగోలు చేసి వినియోగించాలని టెక్ నిపుణులు వెల్లడిస్తున్నారు.

అలా కాకుండా ఇతర కంపెనీల ఛార్జర్లను వాడితే బ్యాటరీ లైఫ్ తగ్గిపోయే అవకాశం ఉండటంతో పాటు కొన్ని సందర్భాల్లో బ్యాటరీ ఉబ్బిపోయే అవకాశం ఉంటుంది. కంపెనీలు ఫోన్ రెసిస్టెన్స్ కు అనుగుణంగా మొబైల్ ఫోన్ ఛార్జర్లను తయారు చేస్తాయి. ఒక్కో కంపెనీ ఫోన్ కు హీట్ సింక్ సామర్థ్యం ఒక్కో విధంగా ఉంటుంది. ఇతర ఛార్జర్ వల్ల వచ్చే హీట్ ఫోన్ కు సరిపడకపోతే బ్యాటరీ ఉబ్బి నిరుపయోగం అయ్యే అవకాశం ఉంటుంది.

ఇతర కంపెనీల ఛార్జర్లను వినియోగించడం ద్వారా బ్యాటరీ ఉబ్బే అవకాశం ఉండటంతో పాటు ఫోన్ సాఫ్ట్ వేర్ కూడా పని చేయకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. అందువల్ల ఇష్టం వచ్చిన ఛార్జర్ ను ఫోన్ కు వినియోగించకుండా మొబైల్ ఫోన్ కు సంబంధించిన ఛార్జర్ ను మాత్రమే వాడితే మంచిది.