Anthropic: ఐటీ పరిశ్రమలో నిత్యం మార్పులు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఐటి అనేది మూస ధోరణిలో పనిచేయదు. నిత్యం మార్పుల వల్ల ఐటి అనేది ఉన్నతంగా కనిపిస్తూ ఉంటుంది. కొత్తది కనిపెట్టాలని.. ఉన్నదానిని పరిమితంగా వాడుకోవాలని.. ఐటి నిపుణులు ప్రాథమిక సూత్రంగా భావించుకుంటూ పనిచేస్తుంటారు. నూతనత్వం అనేది కొత్తగా అనిపించినప్పటికీ.. అది చాలా సందర్భాలలో ఇబ్బందికి గురిచేస్తుంది. చివరికి మన పీఠం కిందికే నీళ్లు తీసుకువస్తుంది. ఇప్పుడు ఐటి విభాగంలో అదే జరుగుతోంది.
కొంతకాలంగా ఐటీ విభాగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే లే ఆఫ్ లతో ఉద్యోగులు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరింత నరకం చూపిస్తోంది. చాలా వరకు కంపెనీలు లక్షల మంది ఉద్యోగులను తొలగించాయి. తొలగింపులు నిత్యం ఉంటాయని హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఇవి ఇలా ఉండగానే ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ వినియోగంలో కంపెనీలు కొత్త సూత్రానికి తెర లేపాయి. డిజిటల్ ఉద్యోగిగా ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించుకుంటూ పోతామని చెప్పడం ఉద్యోగులలో కలవరానికి గురిచేస్తుంది.
ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ ను ఉద్యోగిగా గుర్తిస్తామని అంత్రో పిక్స్ అనే సంస్థ ప్రకటించిన నేపథ్యంలో ఐటీ విభాగంలో కలవరం ఏర్పడుతుంది. ఇప్పటికే ఈ కంపెనీ చేసిన ప్రకటన వల్ల అంతర్జాతీయంగా ఐటీ కంపెనీలు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి. ఐటీ కంపెనీల షేర్లు తీవ్రంగా నేల చూపులు చూస్తున్నాయి.
ఆంత్రో పిక్స్ ప్రకటన వల్ల ఐటీ ఇండస్ట్రీ ఒడిదుడుకులకు గురవుతోంది అనేది వాస్తవం. అయితే ఇక్కడే చాలామందిలో చాట్ జిపిటి, ఆంత్రో పిక్స్ గురించి చర్చ మొదలైంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఆంత్రో పిక్ అనేది ఒక అంకుర సంస్థ. ఇది తన ప్లాట్ ఫామ్ ను విస్తరిస్తూ.. క్లాడ్ కోవర్క్ ను జనవరి చివరి వారంలో తెరపైకి తీసుకొచ్చింది. అంతేకాదు మొత్తంగా 11 కొత్త ప్లగ్ ఇన్ లు రిలీజ్ చేసింది. ప్రకారం అవి ఇండిపెండెంట్ గా నిర్ణయాలు తీసుకొని.. పనులు పూర్తిచేస్తాయి క్లాడ్ కోవర్క్ ఇండిపెండెంట్ గా పనిచేయడం వల్ల చాట్ జిపిటి, జెమిని, గ్రోక్ వంటి వాటికి డిమాండ్ తగ్గడం లేదా వాడడం ఓ స్థాయికి మాత్రమే పరిమితమవుతుందని ఐటి నిపుణులు చెబుతున్నారు. కంపెనీలు ఆదాయ వ్యయాలను తగ్గించుకోవడానికి క్లాడ్ కోవర్క్ ను ఉపయోగించుకుంటాయి. అలాంటప్పుడు ఉద్యోగుల అవసరం చాలా వరకు తగ్గిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
