America-China chip war : ఎందుకు అమెరికా చైనాపై ఆంక్షలు విధించింది?

Analysis on America-China chip war : చిప్ టెక్నాలజీపై గుత్తాధిపత్యం కోసం అమెరికా కఠిన ఆంక్షలు విధించింది. చైనాకు కొత్త చిప్ టెక్నాలజీ, సాఫ్ట్ వేర్ లు అమ్మవద్దని.. ఆయా కంపెనీలను నిషేధించి షాక్ ఇచ్చింది. అడ్వాన్స్ టెక్నాలజీలో చైనా దూసుకెళుతుండడం.. అమెరికా కంటే టెక్నాలజీలో చైనా దూసుకుపోవడాన్ని అగ్రరాజ్యం తట్టుకోలేక ఇలా చిప్ టెక్నాలజీని చైనా కు దూరం చేసే ఎత్తుగడ వేసింది. ఈ క్రమంలోనే చైనా నుంచి, పక్కనున్న తైవాన్ నుంచి అమెరికన్ […]

Written By: NARESH, Updated On : November 17, 2022 2:04 pm
Follow us on

Analysis on America-China chip war : చిప్ టెక్నాలజీపై గుత్తాధిపత్యం కోసం అమెరికా కఠిన ఆంక్షలు విధించింది. చైనాకు కొత్త చిప్ టెక్నాలజీ, సాఫ్ట్ వేర్ లు అమ్మవద్దని.. ఆయా కంపెనీలను నిషేధించి షాక్ ఇచ్చింది. అడ్వాన్స్ టెక్నాలజీలో చైనా దూసుకెళుతుండడం.. అమెరికా కంటే టెక్నాలజీలో చైనా దూసుకుపోవడాన్ని అగ్రరాజ్యం తట్టుకోలేక ఇలా చిప్ టెక్నాలజీని చైనా కు దూరం చేసే ఎత్తుగడ వేసింది. ఈ క్రమంలోనే చైనా నుంచి, పక్కనున్న తైవాన్ నుంచి అమెరికన్ చిప్ కంపెనీలు, సరఫరాదారులను వెనక్కి రప్పిస్తోంది. చైనా తమ టెక్నాలజీ చోరీ చేసి ఎదుగుతోందని గుర్తించిన చైనా ఈ పనిచేసింది.

అయితే ఇప్పటికే చైనా సంపాదించిన చిప్ టెక్నాలజీతో ముందుకు సాగవచ్చు. కానీ భవిష్యత్ ఆధునిక టెక్నాలజీ చైనాకు దక్కకుండా అమెరికా ఈ ఎత్తుగడ వేసింది. ప్రస్తుతం టెక్నాలజీ, ఆటోమొబైల్ ఇండస్ట్రీలో చిప్ ల తయారీలో చైనాదే ఆధిపత్యం కొనసాగుతోంది. అమెరికా టెక్నాలజీని చోరీ చేసి అంతకమించి దూసుకుపోతోంది.

ఇప్పటికే అమెరికా కంటే ముందుగా 5జీని లాంఛ్ చేసి చైనా షాకిచ్చింది.అందుకే అమెరికా చైనీస్ కంపెనీలు చోరీ చేసి ఇలా చేస్తున్నాయని ‘హువాయే’ సహా చాలా కంపెనీలను అమెరికాలో నిషేధించాయి. ఇప్పుడు చిప్ టెక్నాలజీని కూడా చైనాకు చిక్కకుండా అమెరికాలోనే అన్ని కంపెనీలు పెట్టాలని.. తరలిరావాలని పిలుపునిచ్చాయి. ఈ మేరకు చిప్ ల తయారీ, టెక్నాలజీ అభివృద్ధిపై 280 బిలియన్ డాలర్లను వెచ్చించనున్నట్టు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ప్రకటించారు. ఇదంతా చైనాకు భయపడి అమెరికా సాగిస్తున్న టెక్నాలజీ వార్. దీనికి కుదేలయ్యే చైనా ఎలా స్పందిస్తుందన్నది వేచిచూడాలి.

చిప్ టెక్నాలజీ విషయంలో చైనాపై అమెరికా ఎందుకు ఆంక్షలు విధించిందన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు.