https://oktelugu.com/

WhatsApp: వాట్సాప్ లో అదిరిపోయే ఫీచర్.. ఇకపై దాన్ని ప్లాన్ చేయడం అత్యంత సులభం..

కమ్యూనిటీస్ కోసం వర్చువల్ ఈవెంట్ ప్లానింగ్ ను వాట్సాప్ తెరపైకి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. ఈవెంట్ ప్లానింగ్ వల్ల గ్రూప్ సందేశాలలో నేరుగా ఈవెంట్ ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీని ద్వారా స్నేహితులు, సన్నిహితులు, ఇతర ఉద్యోగులతో వర్చువల్ సమావేశాలు నిర్వహించుకోవచ్చు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : May 7, 2024 / 08:48 AM IST

    WhatsApp

    Follow us on

    WhatsApp: బిలియన్ల కొద్దీ యూజర్లను కలిగి ఉండి సరికొత్త మెసేజింగ్ యాప్ గా అవతరించిన వాట్సాప్.. తన యూజర్ల కోసం సరికొత్త ఫీచర్ తెరపైకి తెచ్చింది. దీని ద్వారా సరికొత్త అనుభూతి యూజర్ల సొంతమవుతుందని వాట్సాప్ ప్రకటించింది. కొత్తగా తీసుకొచ్చిన ఫీచర్ వల్ల స్నేహితులు లేదా కొలీగ్స్ తో వర్చువల్ ఈవెంట్ కు ప్రణాళిక రూపొందించుకోవచ్చట.

    కమ్యూనిటీస్ కోసం వర్చువల్ ఈవెంట్ ప్లానింగ్ ను వాట్సాప్ తెరపైకి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. ఈవెంట్ ప్లానింగ్ వల్ల గ్రూప్ సందేశాలలో నేరుగా ఈవెంట్ ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీని ద్వారా స్నేహితులు, సన్నిహితులు, ఇతర ఉద్యోగులతో వర్చువల్ సమావేశాలు నిర్వహించుకోవచ్చు. లేదా వ్యక్తిగతంగా మీటింగ్స్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ మెయిల్ ద్వారా ఆహ్వానాలు పంపే తీరుగా.. వాట్సప్ యాజమాన్యం ఈసారి కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్ వల్ల గ్రూపులో ఉన్న సభ్యులు తమ పుట్టినరోజు పార్టీలను, పనికి సంబంధించిన మీటింగ్ లను, ఇతర వ్యవహారాలను సెట్ చేసుకోవచ్చు. ఈవెంట్ ఒకసారి సెట్ అయిన తర్వాత.. అది గ్రూప్ ఇన్ఫర్మేషన్ పేజీకి పిన్ అయి ఉంటాయి. దీంతో ఆ ఈవెంట్ అందరికీ తెలుస్తుంది. అంతేకాదు గ్రూపులో చాట్ థ్రెడ్ కూడా ఏర్పాటవుతుంది. దీనివల్ల ఎవరెవరికి సందేశం వెళ్లిందో వెంటనే తెలిసిపోతుంది.

    ఈవెంట్ కు వచ్చే వాళ్ళు కూడా దానిని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇలాంటి వారికి ఈవెంట్ సమయానికి కచ్చితంగా నోటిఫికేషన్ వెళుతుంది. కాబట్టి ఎవరూ మర్చిపోయే అవకాశం ఉండదు. తాజాగా ఈ ఫీచర్ ను వాట్సాప్ తన కమ్యూనిటీ విభాగంలో దీన్ని తెరపైకి తీసుకొచ్చింది.. అయితే ఈ ఫీచర్ ను ఇక్కడితోనే ఆపకుండా.. త్వరలోనే వాట్సాప్ గ్రూపులకు కూడా విస్తరించే అవకాశం ఉంటుంది.

    ఇది మాత్రమే కాకుండా వాట్సాప్ అనౌన్స్మెంట్ గ్రూపులకు బదులిచ్చే మరో ఫీచర్ కూడా తెరపైకి తీసుకొచ్చింది. దీని ద్వారా అడ్మిన్ పెట్టిన సందేశాలపై కామెంట్లు, ఫీడ్ బ్యాక్ పొందేందుకు అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ నోటిఫికేషన్లు రావడం ఇబ్బంది అనిపిస్తే మ్యూట్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అలాగే నోటిఫికేషన్ వచ్చే బార్ లోనే నేరుగా రిప్లై ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది.

    WhatsApp in app dialler

    వాట్సాప్ త్వరలో ఈ యాప్ డైలర్ ను కూడా తెరపైకి తీసుకురానుంది. దీని ప్రకారం ట్రూ కాలర్, గూగుల్ డైలర్ వంటివి వాడకుండా.. నేరుగా వాట్సాప్ నుంచే కాల్స్ చేసుకునే అవకాశం లభిస్తుంది. ఇప్పటివరకు ఎవరికైనా వాట్సాప్ ద్వారా కాల్ చేయాలంటే ఆ నెంబర్ మన కాంటాక్ట్ జాబితాలో ఉండాలి. ఇకపై ఆ సమస్య ఉండదు. వాట్సాప్ ఇన్ యాప్ డైలర్ అందుబాటులోకి వస్తే, కాంటాక్ట్ లిస్టులో లేని నెంబర్ కు సైతం కాల్ చేయొచ్చు.