https://oktelugu.com/

మొబైల్ యూజర్లకు అమెజాన్ శుభవార్త.. తక్కువ ధరకే సినిమాలు..?

ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ మొబైల్ ఫోన్ యూజర్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. తక్కువ ధరకే అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రారంభ ప్లాన్ ను అందుబాటులోకి తెచ్చింది. 89 రూపాయల నుంచి ఈ ప్లాన్ ప్రారంభం కానుండగా ఈ ప్లాన్ ద్వారా మొబైల్ ఫోన్ యూజర్లకు ప్రయోజనం చేకూరనుంది. తొలిసారి మొబైల్-ఓన్లీ ప్లాన్‌ ను అమెజాన్ ప్రకటించగా ఇలాంటి ఆఫర్ లను ఇతర ఓటీటీ సంస్థలు సైతం ప్రకటిస్తున్నాయి. నెట్ ఫ్లిక్స్ 199 రూపాయలతో మొబైల్ ప్లాన్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 13, 2021 / 06:39 PM IST
    Follow us on

    ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ మొబైల్ ఫోన్ యూజర్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. తక్కువ ధరకే అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రారంభ ప్లాన్ ను అందుబాటులోకి తెచ్చింది. 89 రూపాయల నుంచి ఈ ప్లాన్ ప్రారంభం కానుండగా ఈ ప్లాన్ ద్వారా మొబైల్ ఫోన్ యూజర్లకు ప్రయోజనం చేకూరనుంది. తొలిసారి మొబైల్-ఓన్లీ ప్లాన్‌ ను అమెజాన్ ప్రకటించగా ఇలాంటి ఆఫర్ లను ఇతర ఓటీటీ సంస్థలు సైతం ప్రకటిస్తున్నాయి.

    నెట్ ఫ్లిక్స్ 199 రూపాయలతో మొబైల్ ప్లాన్ ను విడుదల చేయగా అమెజాన్ మాత్రం 89 రూపాయలకే సినిమాలు, వెబ్ సిరీస్ లు చూసే అవకాశాన్ని కల్పిస్తూ ఉండటం గమనార్హం. రోజురోజుకు ఓటీటీల మధ్య తీవ్రంగా పోటీ పెరుగుతున్న సంగతి తెలిసిందే. పెరుగుతున్న పోటీని దృష్టిలో ఉంచుకుని అమెజాన్ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రముఖ టెలీకాం కంపెనీ ఎయిర్ టెల్ తో కలిసి అమెజాన్ ఈ కొత్త ప్లాన్ ను లాంఛ్ చేయడం గమనార్హం.

    ఈ కొత్త ప్లాన్ ద్వారా మొబైల్ ఫోన్ లో ప్రైమ్ వీడియో సర్వీసులు అందుబాటులో ఉంటాయి. కొత్త ప్లాన్ ద్వారా ఎయిర్ టెల్ కస్టమర్లకు 6జీబీ డేటా 28 రోజుల వ్యాలిడిటీతో లభిస్తుంది. ఈ ప్లాన్ కాకుండా ఎయిర్ టెల్ కస్టమర్లు 299 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే మాత్రం 28 రోజుల వాలిటీతో రోజుకు 1.5 జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాల్స్ చేసుకునే అవకాశం ఉంటుంది. రోజురోజుకు మొబైల్ డేటా సేవలకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో అమెజాన్ కొత్త సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది.

    సాధారణంగా అమెజాన్ ప్రైమ్ వీడియో ప్లాన్స్ నెలకు 129 రూపాయలు, సంవత్సరానికి 999 రూపాయలుగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్లాన్ పై ఒక్క యూజర్ మాత్రమే వీడియోలను చూసే అవకాశం ఉంటుంది.