https://oktelugu.com/

అమెజాన్ కస్టమర్లకు శుభవార్త.. స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు..?

కరోనా విజృంభణ వల్ల ఉద్యోగుల ఆదాయం తగ్గడంతో గతేడాది ప్రముఖ ఈకామర్స్ సంస్థలకు సైతం ఆదాయం భారీగా తగ్గిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కరోనా విజృంభణ తగ్గి దేశంలో దాదాపుగా సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ఈకామర్స్ కంపెనీలు భారీ డిస్కౌంట్లను ప్రకటిస్తూ కస్టమర్లకు అదిరిపోయే శుభవార్తలను చెబుతున్నాయి. మరో మూడు రోజుల్లో సంక్రాంతి పండుగ ఉన్న నేపథ్యంలో అమెజాన్ సంస్థ స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. Also Read: ఫోన్ పోగొట్టుకున్నారా.. సులువుగా ట్రాక్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 11, 2021 / 12:42 PM IST
    Follow us on

    కరోనా విజృంభణ వల్ల ఉద్యోగుల ఆదాయం తగ్గడంతో గతేడాది ప్రముఖ ఈకామర్స్ సంస్థలకు సైతం ఆదాయం భారీగా తగ్గిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కరోనా విజృంభణ తగ్గి దేశంలో దాదాపుగా సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ఈకామర్స్ కంపెనీలు భారీ డిస్కౌంట్లను ప్రకటిస్తూ కస్టమర్లకు అదిరిపోయే శుభవార్తలను చెబుతున్నాయి. మరో మూడు రోజుల్లో సంక్రాంతి పండుగ ఉన్న నేపథ్యంలో అమెజాన్ సంస్థ స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది.

    Also Read: ఫోన్ పోగొట్టుకున్నారా.. సులువుగా ట్రాక్ చేయడం ఎలా అంటే..?

    సంక్రాంతి పండుగ సీజన్ ను క్యాష్ చేసుకోవాలని అమెజాన్ సంస్థ భావిస్తోంది. అమెజాన్ సంస్థ పొంగల్ షాప్ స్టోర్ పేరుతో స్మార్ట్ ఫోన్లతో పాటు స్మార్ట్ ఫోన్ విడిభాగాలపై కూడా భారీ డిస్కౌంట్ లను ఇస్తోంది. అమెజాన్ కస్టమర్లు ఈ సేల్ ద్వారా ప్రముఖ కంపెనీల స్మార్ట్ ఫోన్లను తక్కువ ధరకే కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. భారీగా డిస్కౌంట్లను ప్రకటించడంతో సేల్స్ పెరుగుతాయని అమెజాన్ సంస్థ భావిస్తోంది.

    Also Read: వాట్సాప్ యూజర్లకు అలర్ట్.. ఆ తప్పు చేస్తే అకౌంట్ డిలీట్..?

    ల్యాప్ టాప్ పై కూడా డిస్కౌంట్ ఆఫర్లు ఉండటంతో అమెజాన్ లో పొంగల్ షాప్ స్టోర్ సేల్ ద్వారా తక్కువ ధరకే ల్యాప్ టాప్ లను కూడా కొనుగోలు చేయవచ్చు. హెచ్పీ 14 ఆల్ట్రా ల్యాప్ టాప్ 35,990 రూపాయలకు అందుబాటులో ఉండగా డెల్ ఇన్‌స్పిరోన్ ల్యాప్ టాప్ 27,999 రూపాయలకు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఈ సేల్ లో వ‌న్ ఫ్లస్ నోట్ 5జీ ఫోన్ 27,999 రూపాయలు, సామ్‌సంగ్ ఎం51 ఫోన్ 22,999 రూపాయలు, రెడ్ మీ 9 పవర్ ఫోన్ అమెజాన్ లో కొనుగోలు చేసే అవకాశం ఉంది.

    మరిన్ని వార్తల కోసం: మొబైల్స్

    అమెజాన్ స్మార్ట్ వాచ్, స్మార్ట్ టీవీలపై కూడా అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది. సోనీ, ఎం.ఐ, ఇతర కంపెనీల టీవీలపై ఆఫర్లు అమలవుతున్నాయి. సంక్రాంతి పండుగ వరకు ఈ సేల్ ఉంటుందని తెలుస్తోంది. అమెజాన్ వెబ్ సైట్ ను సందర్శించి ఈ సేల్ కు సంబంధించిన పూర్తి వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు.