Homeఆంధ్రప్రదేశ్‌Amaravati Drone Summit 2024: ఇందు గలదు.. అందు లేదు. అనే సందేహం వలదు.. ఎందెందు...

Amaravati Drone Summit 2024: ఇందు గలదు.. అందు లేదు. అనే సందేహం వలదు.. ఎందెందు చూసినా డ్రోన్ గలదు..

Amaravati Drone Summit 2024: విశాలమైన నింగి నుంచి.. విస్తారమైన నేల వరకు.. అనంతమైన ఉపరితలం నుంచి.. అచంచలమైన జలం వరకు.. వెళ్లలేని చోటు లేదు. ఎగరలేని ప్రాంతం లేదు. తన కన్ను పడని ప్రదేశమూ లేదు. సాంతం చూస్తుంది. సమస్తం చెబుతుంది. లోతుల్లోకి వెళుతుంది.. ఎత్తులను కొలుస్తుంది. వెడల్పును పసిగడుతుంది. పొడవును అంజనం వేస్తుంది. ఇన్ని చేస్తోందంటే.. అదేదో కల్కి సినిమాలో ప్రభాస్ ఉపయోగించిన ” చిట్టి” అనుకునేరు. ఆ చిట్టి కాల్పానికం.. ఈ డ్రోన్ కళ్ళ ముందు కనిపిస్తున్న యదార్ధం.

డ్రోన్ ను స్థూలంగా మానవరహిత వైమానిక వాహనం అని పిలవచ్చు. ఆధునిక కాలంలో డ్రోన్ల ద్వారా అన్ని పనులు జరుగుతున్నాయి. డ్రోన్ లు కూడా అంతకంతకు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందుతున్నాయి. దీనికి తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా తోడు కావడంతో ఏ పనైనా సరే చేయగలుగుతున్నాయి. మంగళవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అమరావతిలోని కృష్ణానది తీరంలో డ్రోన్ షో నిర్వహించారు. దీంతో ఒక్కసారిగా డ్రోన్ల గురించి.. అది చేసే పనుల గురించి.. భవిష్యత్తులో సృష్టించే సంచలనాల గురించి చర్చ మొదలైంది. యుద్ధాలు.. వివిధ రకాల ఫోటోషూట్ ల కోసం మాత్రమే కాదు.. డ్రోన్ల వినియోగం అని రంగాలకూ విస్తరించింది. అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తోంది.

పరిశ్రమ అడాప్షన్ లో..

సాంకేతికతను మరింతగా అనుసంధానించడంతో డ్రోన్ అంతకంతకు అభివృద్ధి చెందుతోంది. సాంకేతికంగా క్రిష్టమైన సైనిక ప్రాంతాల నుంచి ఉపరితలం వరకు డ్రోన్లను ఉపయోగిస్తున్నారు.. పరిశ్రమలలో క్లిష్టతరమైన పనులను డ్రోన్ల ద్వారా చేస్తున్నారు. వివిధ రకాల సమ్మేళనాలను రూపొందించడంలో డ్రోన్లను ఉపయోగిస్తున్నారు.

డెలివరీ డ్రోన్ టెక్నాలజీ

డెలివరీ డ్రోన్ల ద్వారా ఆహారం, సరుకులు, ఔషధాలను రవాణా చేస్తారు. ఇటీవల ఏపీలో వరదల సంభవించినప్పుడు బాధితులకు సరుకులు, ఆహారం ప్రమాణ చేయడానికి డ్రోన్లను ఉపయోగించారు. ఆ తర్వాత ఇటీవల గుంటూరులో ఓ మారుమూల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మందులను సరఫరా చేయడానికి డ్రోన్ ఉపయోగించారు. వీటిని లాస్ట్ మైల్ డెలివరీ డ్రోన్ అని పిలుస్తుంటారు. రిటైలర్లు, గిడ్డంగుల నుంచి సరుకులను రవాణా చేయడానికి వీటిని ఉపయోగిస్తున్నారు. ఈ డ్రోన్లు 55 పౌండ్ల బరువు ఉన్న వస్తువుల వరకు రవాణా చేస్తాయి. Amazon, Walmart, Google, FedEx, UPS వంటి సంస్థలు డెలివరీలకు డ్రోన్లను ఉపయోగిస్తున్నాయి.

ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు..

తుఫాన్లు, యుద్ధాలు, కరువు కాటకాలు వంటివి సంభవించినప్పుడు సహాయక చర్యలు చేపట్టడానికి డ్రోన్లను ఉపయోగిస్తున్నారు.. ముఖ్యంగా నీటిలో వ్యక్తులు మునిగిపోయినప్పుడు వారిని రక్షించడానికి డ్రోన్లకు అటానమస్ అండర్ వాటర్ వేహికిల్ విధానం అనుసంధానించి కాపాడుతున్నారు.

వ్యవసాయ పనుల్లో

వ్యవసాయ పనుల్లో డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. రైతులు క్రిమి సంహారకాలను పిచికారి చేయడానికి.. శారీరక శ్రమను తగ్గించడానికి వినియోగిస్తున్నారు. విత్తనాలు విత్తడం.. కలుపు నివారించడం వంటి పనులను ద్వారా చేస్తున్నారు.

ఔటర్ స్పేస్ కోసం..

నాసా, యునైటెడ్ స్టేట్స్ వైమానిక దళం అంతరిక్ష ప్రయాణం కోసం డ్రోన్లను ఉపయోగిస్తున్నాయి. X- 37B UAV స్పేస్ షటిల్ చుట్టూ అత్యంత రహస్యంగా డ్రోన్లను తిప్పుతోంది. గత రెండు సంవత్సరాలుగా ఈ డ్రోన్ భూమి చుట్టూ ప్రదక్షిణ చేస్తోంది. 781 రోజులపాటు భూమి చుట్టూ తిరిగి ఆ డ్రోన్ రికార్డు సృష్టించింది.

వన్యప్రాణుల పరిరక్షణ కోసం

వన్యప్రాణుల పరిరక్షణ కోసం డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. ఇది అత్యంత తక్కువ ఖర్చుతో కూడిన సమర్థవంతమైన మార్గం. వన్యప్రాణుల జనాభాను ట్రాక్ చేసేందుకు ఈ డ్రోన్ ఉపయోగిస్తున్నారు. బోర్ నియోలోని ఓరంగూటాన్ నుంచి మొదలు పెడితే గ్రేట్ ప్లైన్స్ లోని బైసన్ వరకు డ్రోన్ ద్వారా ట్రాకింగ్ చేస్తున్నారు.. ఇవి మాత్రమే కాకుండా దహనమైన అడవుల్లో కొత్తగా విత్తనాలు చల్లడం.. మారుమూల ప్రాంతాలకు ఔషధాలను సరఫరా చేయడం.. అవయవాల మార్పిడి సందర్భంగా.. గ్రీన్ ఛానల్ ద్వారా వేగంగా గ్రహీతలకు అవయవాలను చేరవేయడం వంటి కార్యకలాపాలను డ్రోన్ల ద్వారా చేస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular