Homeఆంధ్రప్రదేశ్‌Amaravati Drone Summit: అమరావతిలో డ్రోన్ షో.. ట్రెండ్ సెట్ చేసిన చంద్రబాబు విజన్ కు...

Amaravati Drone Summit: అమరావతిలో డ్రోన్ షో.. ట్రెండ్ సెట్ చేసిన చంద్రబాబు విజన్ కు ఇదే తార్కాణం

Amaravati Drone Summit: ఏపీలో డ్రోన్ల విప్లవానికి చంద్రబాబు సర్కార్ నాంది పలికింది. డ్రోన్ల ద్వారా రాష్ట్రంలో విస్తృత సేవలకు శ్రీకారం చుట్టింది. డ్రోన్స్ స్టార్టప్ రాష్ట్రంగా ఏపీ నిలిచింది. రాబోయే రోజుల్లో ప్రపంచంలో మూడో అతిపెద్ద డ్రోన్ మార్కెట్ గా భారత్ నిలవనుంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు సూక్ష్మ అంశాన్ని గుర్తించారు. భవిష్యత్తులో డ్రోన్ల ప్రాధాన్యతను గుర్తెరిగారు. తాజాగా అమరావతిలో డ్రోన్ సమ్మిట్-2024 ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులు హాజరయ్యారు. ఇప్పుడు జాతీయస్థాయిలో ఏపీ మరోసారి వార్తల్లో నిలిచింది. డ్రోన్ వినియోగంలో ముందుంది. దేశంలో ఆదర్శంగా నిలవనుంది. అయితే సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకోవడంలో చంద్రబాబు ఎప్పుడు ముందుంటారు. ప్రపంచ సాంకేతిక పరిజ్ఞానంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా పాలన అందిస్తుంటారు. అందులో భాగంగానే డ్రోన్ల వినియోగాన్ని ఏపీలో పెంచాలని భావిస్తున్నారు. తద్వారా నూతన పోకడను ఈ దేశానికి అందించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లో డ్రోన్ల వాడకం పెరుగుతోంది. విప్లవాత్మక మార్పులకు డ్రోన్లు దోహదపడుతున్నాయి. మనం పని చేసే విధానాన్ని మారుస్తున్నాయి.

* భవిష్యత్ అంతా డ్రోన్లదే
మనిషి జీవన శైలి మారింది. ఏదైనా వస్తువు, ఆహారం కావాలంటే కేవలం ఒక క్లిక్ దూరంలోనే ఇంటికి వచ్చే కాలంలో మనం ఉన్నాం. భవిష్యత్తులో ఇంటి బయటకు వచ్చి వస్తువులు తెచ్చుకోవాల్సిన పని ఉండదు. అవే మన దగ్గరికి రియల్ టైంలో వచ్చే సమయం వచ్చేసింది. ఇప్పటికే చాలా రకాల బహుళజాతి సంస్థలు వస్తువుల డెలివరీకి డ్రోన్లను వినియోగిస్తున్నాయి. డ్రోన్ల ద్వారా మన దైనందిన జీవితంలో అన్ని సేవలు, ఎంతో సులభతరంగా అందే విధంగా సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. అది ఇప్పుడు డ్రోన్లలో స్పష్టంగా కనిపిస్తోంది.ఈ విషయాన్ని ముందే గుర్తించారు సీఎం చంద్రబాబు. అందుకే అమరావతిలో తొలిసారిగా డ్రోన్ సమ్మిట్ ను ఏర్పాటు చేశారు.వాటి వినియోగంలో ఏపీ ప్రభుత్వం ఎంత అడ్వాన్స్ గా ఉందో చాటి చెప్పే ప్రయత్నం చేశారు. ఇప్పటికే విజయవాడ వరదల సమయంలో డ్రోన్లను వినియోగించి సహాయ కార్యక్రమాలు చేపట్టారు. బాధితులకు నిత్యవసరాలతో పాటు భోజన వసతి కూడా కల్పించారు డ్రోన్ల ద్వారా.

* ఏపీ ప్రభుత్వం ప్రోత్సాహం
జాతీయస్థాయిలో డ్రోన్లకు కేంద్రంగా అమరావతి అవతరించనుంది. డ్రోన్ల అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సాహం అందిస్తోంది. అందులో భాగంగానే అమరావతి డ్రోన్ సమ్మిట్ ను నిర్వహించింది. ఈ సదస్సు ఈరోజు కూడా కొనసాగనుంది. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పేరు మోసిన నిపుణులు వందలాది మంది తరలివచ్చారు. వివిధ విశ్వవిద్యాలయాలనుంచి 400 మంది వరకు హాజరయ్యారు. ఈ సమ్మిట్ తో డ్రోన్ల ఉపయోగాలు, వాటితో సాధ్యమయ్యే అద్భుతాలు ప్రజలకు తెలియజేయడంతో పాటు భవిష్యత్తులో వాటి అవసరాలను కూడా తెలుగు చెప్పనున్నారు.

* చంద్రబాబు పై ప్రశంసలు
అయితే ఈ విషయంలో సీఎం చంద్రబాబు ముందుచూపుపై ప్రశంసలు వ్యక్తం అవుతున్నాయి. డ్రోన్ల రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టడం ద్వారా లక్షలాదిమందికి ఉద్యోగాలు అందించే అవకాశం ఉంది. దీనివల్ల రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి మరింత బాటలు వేసేందుకు మార్గం సుగమం అవుతుంది. ప్రధానంగా నిరుద్యోగ యువతను డ్రోన్ల రంగం వైపు మళ్లించేందుకు ఈ సమ్మిట్ ఎంతగానో ఉపయోగపడుతుందని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. సీఎం చంద్రబాబు కృషితో ఏపీ డ్రోన్ల హబ్ గా మారడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ డ్రోన్ మార్కెట్ విస్తృతమవుతోంది. అయితే డ్రోన్ అనేది ఒక టెక్నాలజీ మాత్రమే కాదు. పర్యావరణ ప్రయోజనాలను కాపాడుతుంది. వ్యవసాయంలో కచ్చితత్వం సాధ్యపడుతుంది. సాగు పెట్టుబడులను తగ్గిస్తుంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు డ్రోన్ల సహాయాన్ని తీసుకుంటున్నాయి. ఇప్పుడు అదే డ్రోన్ల హబ్ గా ఏపీ గా మారనుంది. భారతదేశానికి ఒక దిక్సూచిగా వ్యవహరించనుంది. ఇది ముమ్మాటికీ సీఎం చంద్రబాబు ముందు చూపు వల్లే సాధ్యమైంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular