https://oktelugu.com/

విండోస్ వినియోగదారులకు అలర్ట్.. అప్ డేట్ చేసుకోకపోతే ఆ ముప్పు?

ప్రముఖ సంస్థ మైక్రోసాఫ్ట్ విండోస్ వినియోగదారులను అలర్ట్ చేసింది. విండోస్ యూజర్లు తమ కంప్యూటర్లను అప్ డేట్ చేసుకోవాలని సూచనలు చేసింది. ఆపరేటింగ్ సిస్టమ్ లో తీవ్ర లోపం బయటపడటంతో మైక్రోసాఫ్ట్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ తీవ్ర లోపం వల్ల హ్యాకర్లు డేటాను చోరీ చేసే అవకాశం ఉందని మైక్రోసాఫ్ట్ చెబుతోంది. ఒక అప్ డేట్ ను ఇన్ స్టాల్ చేసుకోవడం ద్వారా హ్యాకర్లు డేటాను చోరీ చేయకుండా తప్పించుకోవచ్చు. సాధారణంగా విండోస్ లో ప్రింట్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : July 9, 2021 / 01:24 PM IST
    Follow us on

    ప్రముఖ సంస్థ మైక్రోసాఫ్ట్ విండోస్ వినియోగదారులను అలర్ట్ చేసింది. విండోస్ యూజర్లు తమ కంప్యూటర్లను అప్ డేట్ చేసుకోవాలని సూచనలు చేసింది. ఆపరేటింగ్ సిస్టమ్ లో తీవ్ర లోపం బయటపడటంతో మైక్రోసాఫ్ట్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ తీవ్ర లోపం వల్ల హ్యాకర్లు డేటాను చోరీ చేసే అవకాశం ఉందని మైక్రోసాఫ్ట్ చెబుతోంది. ఒక అప్ డేట్ ను ఇన్ స్టాల్ చేసుకోవడం ద్వారా హ్యాకర్లు డేటాను చోరీ చేయకుండా తప్పించుకోవచ్చు.

    సాధారణంగా విండోస్ లో ప్రింట్ స్పూలర్ అనే ఆప్షన్ సహాయంతో ఒకే ప్రింటర్ ను ఎక్కువమంది వినియోగించుకోవడం సాధ్యమవుతుంది. అయితే ఇందులో భద్రతాపరమైన లోపాలు ఉన్నట్టు సాంగ్ ఫర్ అనే సైబర్ సెక్యూరిటీ కంపెనీ గుర్తించింది. ఆ సంస్థ ఏ విధంగా హ్యాక్ చేయొచ్చనే వివరాలను ఆన్ లైన్ లో పొరపాటున ప్రచురించడంతో కొంతమంది హ్యాకర్లు వివిధ ప్రోగ్రామ్ లను ఇతరుల కంప్యూటర్లో ఇన్ స్టాల్ చేసే అవకాశం అయితే ఉంటుంది.

    ఈ తీవ్ర లోపం వల్ల హ్యాకర్లు డేటాను చూడటం, కొత్త యూజర్ అకౌంట్లను క్రియేట్ చేయడం, డిలేట్ చేయడం చేయవచ్చు. ఈ లోపం వల్ల హ్యాకర్లకు కంప్యూటర్ పై పూర్తిస్థాయిలో నియంత్రణ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. విండోస్ 10తో పాటు విండోస్ 7లో కూడా ఈ లోపం ఉన్నట్టు మైక్రోసాఫ్ట్ సంస్థ గుర్తించింది. మైక్రోసాఫ్ట్ సంస్థ లోపాలను అధిగమించేలా తాజాగా సవరణలు చేసినట్టు వెల్లడించింది.

    మైర్కోసాఫ్ట్ గతేడాది విండోస్ 7కు సపోర్ట్ ను నిలిపివేసినా ప్రింట్ నైట్ మేర్ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అప్ డేట్ ఇవ్వడం గమనార్హం. విండోస్ ల్యాప్ టాప్ లను వినియోగిస్తున్న వాళ్లు వెంటనే వాటిని అప్ డేట్ చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు.