AI Skills for Future Students: మంచి జీవితం కావాలని ఎవరైనా కోరుకుంటారు. మంచి జీవితం అంటే కావాల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేసుకోవడం.. బంధువులతో ఆనందంగా ఉండడం.. స్వేచ్ఛ వాతావరణం లో గడపడం వంటివి ప్రధానంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ సౌకర్యాలు ఉండాలంటే ముందుగా ప్రపంచం గురించి తెలియాలి. ప్రపంచం గురించి తెలిస్తేనే భవిష్యత్తులో ఎలాంటి పనులు చేయాలి? అనే విషయం అర్థం అవుతుంది. కానీ చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు బాగా చదివితేనే జీవితంలో అనుకున్నది సాధిస్తారు అని అనుకుంటారు. అందుకోసం పిల్లలపై ఒత్తిడి తెస్తూ ఉంటారు. ఎప్పుడు 1 లేదా 2 ర్యాంకులో ఉండాలని కోరుకుంటూ వారిపై ఒత్తిడి తెస్తారు. కొందరు తల్లిదండ్రులు అయితే ర్యాంకు రాకపోతే వారిపై చివాట్లు పెడుతూ అరుస్తూ ఉంటారు. కానీ అసలు నిజం ఏంటంటే ఇలాంటి ర్యాంకులు తెచ్చుకున్న వారు భవిష్యత్తులో ఎలాంటి పని చేయలేరని కొన్ని విషయాలను బట్టి అర్థమవుతుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..
Also Read: Career: ప్రపంచంలోనే ట్రెండింగ్ కోర్సు ఇది.. నేర్చుకుంటే మీకు తిరుగుండదు.. సంపాదన లక్షల్లోనే
నేటి కాలంలో చాలామంది విద్యార్థులు, ఇతరులు తమ సొంత విషయాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. ఇందులో భాగంగా బిస్మా ఫరీద్ అనే ఒక అమ్మాయి తన గురించి సోషల్ మీడియాలో ప్రస్తావించింది. తను స్కూల్లో ఫస్ట్, కాలేజీలో ఫస్ట్.. పై చదువులోనూ టాపర్గా నిలుస్తూ వచ్చింది. కానీ తాను ఎంత ప్రయత్నించినా ఒక్క జాబ్ కూడా దొరకలేదని ఆవేదన చెందింది. తన వద్ద ఎన్నో రకాల సర్టిఫికెట్లు, అవార్డులు, గోల్డ్ మెడల్ వంటివి ఉన్నాయి. కానీ ఏమాత్రం స్కిల్స్ లేకపోవడంతో తనకు జాబ్ రావడంలేదని బాధపడుతూ చెప్పింది.
ఫరీద్ లాంటివాళ్లే చాలామంది నీటి కాలంలో ఉన్నారు. అయితే బాగా చదువుకోవద్దని ఎవరూ చెప్పరు. కానీ చదువుతోపాటు లోకజ్ఞానం కూడా తెలవాలని కొందరు పెద్దలు అంటూ ఉంటారు. వారు చెప్పిన ప్రకారం ప్రస్తుత కాలంలో చదువుతోపాటు స్కిల్స్ తప్పనిసరిగా మారింది. లైట్ స్కిల్స్ లేకపోయి ఎన్ని ర్యాంకులు తెచ్చుకున్న వారి జీవితం వృధాగాని మారుతుంది. మనం వింటూ ఉంటాం.. ఒకప్పుడు చదువులో వెనుకబడిన వారు ఆ తర్వాత ఉద్యోగాల్లో రాణిస్తారు.. అంతేకాకుండా వారు ఉన్నత స్థాయిలో ఉంటారు.. అందుకు కారణం వారి వద్ద చదువు లేకపోయినా స్కిల్స్ ఉన్నాయని తెలుసుకోవాలి. అందువల్ల ప్రతి విద్యార్థి చదువుని మాత్రమే కాకుండా స్కిల్స్ కూడా తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి.
నేటి కాలంలో అయితే AI స్కిల్స్ తప్పనిసరిగా మారింది. ఎందుకంటే భవిష్యత్తులో ప్రతి కంపెనీ లేదా ప్రతి సంస్థ ఏఐ తోనే రన్ చేసే అవకాశం ఉంది. అందువల్ల ఇప్పటి విద్యార్థులు కేవలం MS Office,Paint లాంటివి కాకుండా ఏఐకి సంబంధించిన స్కిల్స్ నేర్చుకోవడం ద్వారా భవిష్యత్తులో ఎన్నో రకాలుగా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగని చదువును నిర్లక్ష్యం చేయకుండా ఉండాలి. అంటే కేవలం ర్యాంకులు మాత్రమే సాధించడానికి కాకుండా చదువుతోపాటు మిగతా విషయాలను కూడా నేర్చుకుంటూ ఉండటం వల్ల జీవితంలో ఎప్పటికైనా స్థిరపడే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులు సైతం తమ పిల్లలకు చదువు మాత్రమే నేర్చుకోవాలని కాకుండా లైట్ స్కిల్స్ నేర్చుకోవాలని ప్రోత్సహిస్తూ ఉండాలి. అప్పుడే వారి జీవితం బాగుంటుంది.