Homeఎంటర్టైన్మెంట్Jr NTR Latest News: జూనియర్ ఎన్టీఆర్ దేవుడా? ఆ స్టార్ హీరోయిన్ కి ఎందుకు...

Jr NTR Latest News: జూనియర్ ఎన్టీఆర్ దేవుడా? ఆ స్టార్ హీరోయిన్ కి ఎందుకు అలా అనిపించింది, షాకింగ్ పరిణామం

Jr NTR Latest News:  స్టార్ హీరో ఎన్టీఆర్ పై ఓ హీరోయిన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ తో రెండుసార్లు స్క్రీన్ షేర్ చేసుకున్న సదరు హీరోయిన్.. ఎన్టీఆర్ పై తన అభిప్రాయం వెల్లడించింది.

టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరిగా ఉన్నారు ఎన్టీఆర్. ఆర్ ఆర్ ఆర్ అనంతరం పాన్ ఇండియా హోదా సైతం రాబట్టాడు. ఆయన గత చిత్రం దేవర సైతం బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. వరల్డ్ వైడ్ రూ. 500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఎన్టీఆర్ అప్ కమింగ్ చిత్రాలు భారీ స్థాయిలో తెరకెక్కుతున్నాయి. ఆయన మొదటి బాలీవుడ్ మూవీ వార్ 2 పై అంతనాలు తారాస్థాయిలో ఉన్నాయి. హృతిక్ రోషన్ తో చేస్తున్న ఈ మల్టీస్టారర్ స్పై యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతుంది. ఎన్టీఆర్ ఈ చిత్రంలో నెగిటివ్ షేడ్స్ తో కూడిన రా ఏజెంట్ రోల్ చేస్తున్నాడని సమాచారం.

అలాగే దర్శకుడు ప్రశాంత్ నీల్ తో చేస్తున్న చిత్రం సెట్స్ పై ఉంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా విడుదలయ్యే అవకాశం కలదు. అనంతరం దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తో చిత్రం అని ప్రచారం జరుగుతుంది. రానున్న చిత్రాలు ఎన్టీఆర్ ఇమేజ్ ని మరో స్థాయికి తీసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తుంది. ఇదిలా ఉండగా… ఎన్టీఆర్ ని ఉద్దేశిస్తూ ఓ స్టార్ హీరోయిన్ చేసిన కామెంట్స్ ఆసక్తి రేపుతున్నాయి. ఎన్టీఆర్ లో దేవుడు ఉన్నాడని ఆమె చెప్పడం చర్చకు దారి తీసింది.

Also Read:  NTR-Trivikram Movie Latest Updates: త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబోలో రాబోయే సినిమాలో ఆ ఒక్క సీన్ కోసం అన్ని కోట్లు పెడుతున్నారా..?

ఈ మాటలు అంది హీరోయిన్ జెనీలియా. పెళ్లి అనంతరం సిల్వర్ స్క్రీన్ కి దూరమైన జెనీలియా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఆమె తిరిగి నటిగా బిజీ కావాలని అనుకుంటుంది. అమీర్ ఖాన్ హీరోగా తెరకెక్కిన సితారే జమీన్ ఫర్ మూవీలో జెనీలియా నటించింది. ఈ చిత్రం జూన్ 20న థియేటర్స్ లోకి వస్తుంది. సితారే జమీన్ ఫర్ ప్రమోషనల్ ఈవెంట్స్ లో జెనీలియా పాల్గొంటుంది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ గురించి అడగ్గా.. ఎన్టీఆర్ తో రెండు సినిమాలు చేశాను. అతనో అద్భుతమైన నటుడు. ఎన్టీఆర్ లో ఏదో దైవత్వం ఉంది. మూడు పేజీల డైలాగ్ ఇచ్చినా.. నెక్స్ట్ మినిట్ లో షాట్ కి రెడీ అవుతాడు. ఇక ఎన్టీఆర్ డాన్సింగ్ స్కిల్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. అన్నారు.

ఎన్టీఆర్ లో దైవత్వం ఉందని జెనీలియా చేసిన కామెంట్స్ ఆయన ఫ్యాన్స్ లో జోష్ నింపుతున్నాయి. కాగా సాంబ, నా అల్లుడు చిత్రాల్లో ఎన్టీఆర్ కి జంటగా జెనీలియా నటించింది. ఇక తమిళ్, తెలుగు భాషల్లో స్టార్ హీరోయిన్ గా సత్తా చాటింది జెనీలియా. ఎన్టీఆర్ తో పాటు అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి స్టార్స్ తో చిత్రాలు చేసింది. బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ ముఖ్ ని 2012లో వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు సంతానం. ప్రస్తుతం మరో తెలుగు, హిందీ చిత్రాల్లో జెనీలియా నటిస్తుంది.

RELATED ARTICLES

Most Popular