AI Cooking Video: శాస్త్ర సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులు మనిషి జీవితాన్ని సమూలంగా మార్చేస్తున్నాయి. ఆ మార్పు అనేది ఎంతవరకు వెళ్తుందో తెలియదు గాని.. ఇప్పటికైతే మనిషి జీవితం స్మార్ట్ కాలంలోకి వెళ్లిపోయింది. ఆదిత్య 369 సినిమా మాదిరిగానే..(ఆ సినిమాలో వెనక్కి వెళ్తారు) మనిషి జీవితం మరింత ముందుకు వెళ్తోంది.. నేల నుంచి మొదలుపెడితే నింగి వరకు ప్రతి విషయంలోనూ అత్యంత ఆధునికమైన శాస్త్ర సాంకేతికతతో మనుషులు అబ్బురమైన, అనితర సాధ్యమైన పనులు చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి రావడంతో.. అప్పటిదాకా ఉన్న సాంకేతికత మొత్తం పాతబడిపోయింది. కాదు కాదు మొత్తానికే మరుగున పడుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ప్రతీది కాళ్ల కాడికే తీసుకువచ్చే వెసలిబాటు కలిగింది. మనిషి కోల్పోయిన జ్ఞాపకాలను.. మనిషి నెరవేర్చుకోవాలనుకున్న కోరికలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సాధ్యం చేసుకుంటున్నాడు.. అయితే ఇప్పుడు ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ వంటింట్లోకి కూడా వచ్చేసింది.
Also Read: ఓదెల రైల్వే స్టేషన్ 2′ ఫుల్ మూవీ రివ్యూ…
చెబితే బిర్యానీ మొత్తం చేసి పడేసింది
సాధారణంగా మనం ఒక వంట వండుకోవాలంటే.. ముఖ్యంగా నచ్చిన బిర్యాని చేసుకోవాలంటే ఎంతో ప్రయాసపడాలి. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పనిచేసే కుక్కర్ క్షణాల్లో చేసేసింది.. కావలసిన దినుసులు.. దాని ముందు ఉంచడమే ఆలస్యం.. ప్రోగ్రామింగ్ చేసి పెడితే మొత్తంగా బిర్యానీ వండి పెట్టింది. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఈ వీడియోలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పనిచేసే కుక్కర్ క్షణాల్లో బిర్యానీ వండింది. ఆ వీడియోలో చూపించిన ప్రకారం బియ్యం, చికెన్, మసాలా దినుసులు, ఇతర పదార్థాలు తూకం వేసినట్టుగా కుక్కర్లో పెట్టి.. ఆ తర్వాత టచ్ స్క్రీన్ మీద.. ఎంత మోతాదులో.. ఎంత స్థాయిలో ఉడకాలో చెబితే.. అదేవిధంగా బిర్యానీని వండింది.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ దర్శనమిస్తోంది.. ” కుక్కర్లు అన్నం లేదా పప్పు, మాంసాన్ని ఉడికించేందుకు ఉపయోగపడతాయి. కానీ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా పనిచేసే కుక్కర్ బిర్యానీ కూడా వండి పెడుతోంది. ఇది ఇప్పుడు ప్రారంభ దశలోనే ఉంది. భవిష్యత్తు కాలంలో గనుక పూర్తిస్థాయిలో మార్పులు చేర్పులు చేస్తే.. మనుషులతో అవసరం లేకుండానే బిర్యానీ వండేస్తుంది. అప్పుడిక మనుషులకు ఆ మాత్రం కష్టపడే అవసరం కూడా ఉండదు. జస్ట్ కుక్కర్ వండి పెడితే తినడమే.. టెక్నాలజీ ఎంతో మారింది కదా” అంటూ నెటిజన్లు ఈ వీడియో చూసిన తర్వాత పేర్కొంటున్నారు. అయితే ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా పనిచేసే కుక్కర్లు ఇప్పటికే మార్కెట్ లోకి వచ్చాయి. అయితే భవిష్యత్తు కాలంలో మరిన్ని మార్పులకు గురై.. సరికొత్త కుక్కర్లు అందుబాటులోకి వస్తాయని టెక్నాలజీ నిపుణులు పేర్కొంటున్నారు.
View this post on Instagram