AI boyfriend trend china: ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి. అందువల్లే మన పెద్దవాళ్లు పెళ్లికి ఒక వయసు నిర్ధారించారు. ఆ వయసులో పెళ్లి జరిగితే దాంపత్య జీవితం బాగుంటుంది అని సెలవిచ్చారు. ఇది మన పెద్దలు ఊరికే చెప్పిన మాట కాదు. వారి అనుభవాన్ని రంగరించి.. సమాజహితం కోసం ఉపదేశించిన మాట. కానీ నేటి కాలంలో ఎలా ఉంది పరిస్థితి అంటే.. ముందు చదువు.. ఆ తర్వాత ఉద్యోగం.. అనంతరం కెరియర్.. సంపాదన.. ఆర్థిక స్థిరత్వం.. ఇవన్నీ నెరవేరిన తర్వాత పెళ్లి చేసుకోవాలి అనే కోరిక యువతలో పుడుతోంది. అప్పటికే పుణ్యకాలం కాస్తా పూర్తి కావడంతో.. చాలామంది పెళ్ళికి దూరంగా ఉంటున్నారు.
ఆడపిల్లల సంఖ్య మన దగ్గర చాలా తక్కువగా ఉంది.. ఇతర దేశాలలో కూడా ఇలాంటి పరిస్థితి ఉంది. కొంతకాలంగా ఆడపిల్లలను కనడానికి తల్లిదండ్రులు అంతగా ఇష్టపడకపోవడంతో.. ఇప్పుడు వారి కొరత విపరీతంగా పెరిగిపోయింది. ఫలితంగా చాలామంది మగ పిల్లలకు పెళ్లిలు కూడా కావడం లేదు. దీంతో వారంతా బ్రహ్మచారులుగానే మిగిలిపోతున్నారు. సాధారణంగా ఒక వయసుకు వచ్చిన తర్వాత ఎవరికైనా ఒక తోడు కావాలి. అది మగ కావచ్చు. ఆడ కావచ్చు. మనకంటూ ఒక తోడుంటే ఆ జీవితం వేరే విధంగా ఉంటుంది. అలాకాకుండా ఒంటరిగా మిగిలిపోతే జీవితమంతా నిసారంగా కనిపిస్తూ ఉంటుంది.. అయితే నేటి కాలంలో అమ్మాయిలు అంతగా లేకపోవడం.. ప్రేమకు, చివరికి పెళ్లికి కూడా అమ్మాయిల కొరత ఉండడంతో చాలామంది అబ్బాయిలు ఇబ్బంది పడుతున్నారు. ఒంటరితనంతో నరకం చూస్తున్నారు. మనదేశంలో ఇలాంటి పరిస్థితి ఉంటే.. చైనాలో భిన్నంగా ఉంది.
చైనాలో కొన్ని ప్రాంతాలలో అబ్బాయిల కొరత ఉంది. ఫలితంగా అమ్మాయిలు ఒంటరితనాన్ని తట్టుకోలేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాయ్ ఫ్రెండ్స్ వైపు ఆసక్తి చూపిస్తున్నారు. సామాజికంగా ఒత్తిడి పెరిగిపోవడం.. వివాహం పట్ల విరక్తి కలగడంతో చాలామంది అమ్మాయిలు ఈ వర్చువల్ తోడును ఎంచుకుంటున్నారు. ఇది అక్కడ ప్రభుత్వాన్ని ఆందోళనలో పడేసింది. దేశంలో ఇప్పటికే జననాల సంఖ్య తగ్గిపోయింది. జనాభా రేటు నేలచూపులు చూస్తోంది. ఈ సమస్యలు ఇలా ఉంటే.. ఇప్పుడు అమ్మాయిలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాయ్ ఫ్రెండ్స్ వైపు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే దీనిని అరికట్టడానికి అక్కడి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది..చాట్ బాట్ వాడకం మీద టైం లిమిట్ తీసుకొచ్చింది. సామాజిక నిబంధనలను అతిక్రమించే వారి మీద నిఘా పెంచింది.
చైనా ప్రభుత్వం తమ దేశంలో జనాభాను పెంచడానికి ఇటీవల కాలంలో అనేక విధానాలను తీసుకువచ్చింది. ముఖ్యంగా భార్యాభర్తలకు ఎక్కువ పని గంటలు ఇవ్వకుండా ఆయా కార్యాలయాలకు ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగుల మీద పని ఒత్తిడి తగ్గించేలాగా కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా ముగ్గురు పిల్లల్ని కనే వారికి ప్రభుత్వం తరఫున ప్రయోజనాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది . ఇన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ చైనాలో జనాభా సంఖ్య పెరగడం లేదు. గతంలో జనాభాను నియంత్రించడానికి చైనా అత్యంత కఠినమైన నిబంధనలను విధించింది. ఇప్పుడు జనాభా సంఖ్య తగ్గడంతో.. పెంచడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది.