Advanced Road Technology : సంప్రదాయ విధానంలో రోడ్లను నిర్మించడం వల్ల అవి వాన నీటిని పీల్చుకోవు. పైగా రోడ్డు నిర్మాణ సమయంలో కాంట్రాక్టర్లు అంతంతమాత్రంగానే నాణ్యతను కొనసాగిస్తుంటారు. దీనివల్ల నిర్మించిన అనతి కాలంలోనే రోడ్లు నాశనం అవుతుంటాయి. గోతులు పడి.. గుంతలు పడిన రోడ్లమీద ప్రయాణం సాగించాలంటే ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా పోతాయి. అయితే ఇలాంటి పరిస్థితులు నిత్యకృత్యం అయినప్పటికీ మార్పు దిశగా ప్రభుత్వాలు ఆలోచించడం లేదు. పైగా రోడ్ల నిర్మాణంలో నూతనత్వాన్ని తెరపైకి తీసుకురావడం లేదు. దీంతో అవే రోడ్లు.. అవే గుంతలు.. అవే గోతులు అన్నట్టుగా రోడ్ల పరిస్థితి మారిపోతోంది. అయితే ఈ సమస్యకు మన దేశం నుంచి పెద్దగా పరిష్కార మార్గం రాకపోయినప్పటికీ.. జర్మనీ సరికొత్త ప్రయోగం చేసి ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది. దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది.
ప్రపంచ వ్యాప్తంగా పెద్ద పెద్ద ఆటోమొబైల్ కంపెనీలకు జర్మనీ అనేది స్థావరం లాంటిది. ఇక్కడ ప్రపంచ స్థాయి వాహనాలు తయారవుతుంటాయి. జర్మనీ యూరప్ ప్రాంతంలో ఉన్న ఒక అందమైన దేశం. ఈ దేశంలో రోడ్డు మార్గాలు ఎక్కువగా ఉంటాయి. జర్మనీలో హిమపాతం ఎక్కువగా కురుస్తూ ఉంటుంది. దీనివల్ల రోడ్లు త్వరగానే పాడవుతుంటాయి. ఈ సమస్యకు పరిష్కార మార్గాన్ని అక్కడి శాస్త్రవేత్తలు రూపొందించారు. ఏగంగా నాలుగు టన్నుల వర్షపు నీటిని నిమిషాల్లోనే పీల్చుకునే విధంగా అక్కడ రోడ్లను నిర్మిస్తున్నారు. ఆ మీరు భూగర్భంలో నిర్మించిన పైపుల ద్వారా వెంటనే వెళ్లిపోతుంది.. రోడ్డు నిర్మించేటప్పుడు లోతుగా భూమిని తవ్వుతారు. అంతే లోతులో సమాంతరంగా పైపులు పరుచుకుంటూ వెళ్తారు. ఆ పైపులకు భూమి లోపల గోతులు తవ్వుతారు. రోడ్డుపైన పడిన వాన నీరు ఆ పైపుల్లోకి వెళ్తుంది. ఆ పైపుల మీదుగా భూగర్భంలోకి నీరు చేరుతుంది. తద్వారా భూగర్భ జలాలు పెరుగుతాయి. రోడ్డుమీద నీరు నిల్వ ఉండకపోవడం వల్ల గోతులు ఏర్పడేందుకు ఆస్కారం ఉండదు. గుంతలు ఉండేందుకు అవకాశం కలగదు. ఫలితంగా రోడ్లు బాగా ఉంటాయి. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రయాణం సాగించే అవకాశాన్ని కల్పిస్తాయి. సోషల్ మీడియాలో ఈ వీడియో సందడి చేస్తున్న నేపథ్యంలో.. మనదేశంలో కూడా ఇలాంటి రోడ్లను నిర్మించాలని నెటిజన్లు కోరుతున్నారు.
View this post on Instagram