Homeసైన్స్‌ అండ్‌ టెక్నాలజీChat GPT : అది ఇక కనిపించదు.. చాట్ జిపిటి సృష్టికర్తల సంచలన నిర్ణయం

Chat GPT : అది ఇక కనిపించదు.. చాట్ జిపిటి సృష్టికర్తల సంచలన నిర్ణయం

Chat GPT : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనిషి జీవితంలో తీసుకొస్తున్న మార్పులు అన్ని ఇన్ని కావు. దీని దెబ్బకు లక్షల మంది ఉద్యోగాలు ఊడిపోయాయి. ఇంకా ఎంతమంది ఉద్యోగాలు ఊస్ట్ అవుతాయో తెలియదు. చివరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ న్యూస్ యాంకర్ గా కూడా మారింది. అయితే ఇప్పటికే అనేక సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. భవిష్యత్తు రోజుల్లో మరిన్ని మార్పులు తీసుకొస్తుందని సాంకేతిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది ఇలా ఉండగానే చాట్ జిపిటి సృష్టికర్తలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో సంచలన ప్రకటన చేశారు.

గత ఏడాది చాట్ జిపిటి అందుబాటులోకి వచ్చింది.. దీనిని ఓపెన్ ఏఐ అనే సంస్థ రూపొందించింది. అయితే అప్పటినుంచి ఈ సంస్థ ఏదో ఒక రూపంలో వార్తల్లో ఉంటున్నది. ఇది తీవ్ర చర్చకు దారి తీస్తోంది. చాట్ జిపిటి విడుదల తర్వాత నుంచి ఎథిక్స్, ప్రిన్సిపల్స్ వంటివి ప్రముఖంగా వినిపిస్తున్నాయి.  వాటిలో ముఖ్యంగా ఉపాధ్యాయులు.. విద్యార్థులకు ఏవైనా అసైన్మెంట్లు ఇస్తే.. వాటిని విద్యార్థులు పూర్తి చేశారా? లేదంటే చాట్ జిపిటి నుంచి సేకరించారా? అనే విషయాలను సేకరించడం కష్టంగా మారింది. ఇప్పటికే దీనిపై రచయితలు, విద్యావేత్తలు అయితే ఆందోళన వ్యక్తం చేయడం మొదలుపెట్టారు.

ఈ సమయంలో ఏఐ అనే సంస్థ మీద ఆరోపణలు చేయడం కూడా ప్రారంభించారు. అయితే ఇది తమకు తలనొప్పిగా మారుతుండడంతో ఆర్టిఫిషియల్స్ ఇంటిలిజెన్స్ టూల్స్ రాసిన కంటెంట్ గుర్తించేందుకు కొన్ని రకాల టూల్స్ ను ఏఐ అనే సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే దానిని ఇప్పుడు షట్ డౌన్ చేస్తున్నట్టు నివేదికలు వెల్లడించాయి. ది వెర్జ్ నివేదిక ప్రకారం ఓపెన్ ఏఐ హ్యూమన్స్, ఏఐ టూల్స్ కంటెంట్ గుర్తించేందుకు ఏఐ క్లాసిఫైయర్ అనే టూల్ ను యూజర్లకు అందించింది. ఇప్పుడు దాన్ని నిలిపివేస్తున్నట్టు ఓపెన్ ఏఐ తన బ్లాగ్ పోస్ట్ లో పేర్కొన్నది. బ్లాగ్ పోస్ట్ లో “జూలై 23 2023 నుంచి ఏఐ క్లాసిఫైయర్ టూల్ అందుబాటులో ఉండడం లేదు. హ్యూమన్స్, ఏఐ కంటెంట్ గుర్తించే విషయంలో తాము రూపొందించిన టూల్ ఊహించిన విధంగా పనిచేయడం లేదు. అందుకే ఏఐ క్లాసిఫైయర్ సేవలు నిలిపివేస్తున్నాం. అంతేకాదు కంటెంట్ సమర్థవంతంగా ఎలా గుర్తించాలో తెలుసుకునేందుకు రీసెర్చ్ చేస్తున్నాం. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక మెకానిజాన్ని తయారు చేస్తున్నాం. దీని ద్వారా యూజర్లు ఏఐ జనరేటర్ విజువల్ కంటెంట్ , లను అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది.” అని ఏఐ పేర్కొన్నది.

ఇక నవంబర్ 30 2022న ఓపెన్ ఏఐ చాట్ జిపిటిని యూజర్లకు పరిచయం చేసింది. చాట్ జిపిటి విడుదల అనంతరం ఏఐ జనరేటెడ్ టూల్ వినియోగం పెరిగిపోయింది. దీంతో సంస్థలు తమకు కావాల్సిన కంటెంట్ ను మనుషులు రాస్తున్నారా? ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ టూల్స్ నుంచి సేకరిస్తున్నారా? అని తెలుసుకునేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశారు. అప్పుడే ఓపెన్ ఏఐ.. కంటెంట్ గుర్తించేందుకు ఏఐ క్లాసిఫైయర్ టూల్ తయారు చేసింది. కానీ, 100% విడుదల చేసిన కంటెంట్ ను 26 శాతం గుర్తిస్తుండగా.. మనుషులు సరైన కంటెంట్ రాసినప్పటికీ.. మీరు రాసింది తప్పంటూ 9% ఫలితాలు అందిస్తోంది. ఈ క్రమంలో ఏం చేయాలో పాలు పోక ఓపెన్ ఏఐ ఏఐ క్లాసిఫైయర్ టూల్ షట్ డౌన్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో విద్యావేత్తలు, రచయితలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. “టెక్నాలజీ మన జీవితాలను బాగు చేసే విధంగా ఉండాలి. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేక రంగాలను ప్రభావితం చేస్తుంది. దీనివల్ల సృజనాత్మకత అనేది మరుగున పడిపోతుంది. ఇది ఎంతవరకూ శ్రేయస్కరం కాదు అని” విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular