Shubhodayam Subbarao : మహేష్ బాబు, కొరటాల కాంబినేషన్ హిట్టు ఫెయిర్ గా పేర్కొంటారు. కొరటాల డైరెక్షన్లో వచ్చిన మహేష్ బాబు నటించిన ‘శ్రీమంతుడు’, ‘భరత్ అనే నేను’ సినిమాలు సక్సెస్ సాధించాయి. దీంతో మరోసారి వీరి కాంబినేషన్లో సినిమా రావాలని చాలా మంది కోరుతూ ఉంటున్నారు. అయితే వీటిలో ‘భరత్ అనే నేను’ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. పొలిటిక్స్ ఎలా ఉంటాయో కళ్లకు కట్టినట్లు చూపించారు. అలాగే యువకుడు సీఎం అయితే ఎలాంటి బాధ్యతలు, కష్టాలు ఉంటాయో కూడా వివరించారు. ఈ సినిమాలో ప్రతీ పాత్ర కీలకంగానే కనిపిస్తుంది. ఇందులో భాగంగా మహేష్ ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు ‘శుభోదయం’ అనే పత్రికా విలేకరి పాత్రలో నటించిన సుబ్బారావు అనే పేరు వింటుంటాం. ఆయన మహేష్ బాబుకు వ్యతిరేకంగా మాట్లాడుతారు. కాస్త ఏజ్ బార్ లా కనిపించిన ఈయన గురించి ఆసక్తి కర విషయాలు మీకోసం..
2018లో మహేష్ బాబు హీరోగా వచ్చిన ‘భరత్ అనే నేను సినిమా రిలీజ్ అయింది. ఇందులో మహేష్ బాబు కు జోడీగా కియారా అడ్వానీ నటించారు. లవ్, కామెడీతో పాటు ఎమోషన్, యాక్షన్.. ఇలా అన్నీ కలగలిపి ఉన్న చిత్రం అయినందున అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరించారు. ప్రేక్షకాదరణ మాత్రమే కాకుండా కమర్షియల్ గా సినిమా మంచి వసూళ్లను సాధించింది. దీంతో మహేష్ బాబు కు ఇది వరుస హిట్లలో ఒకటిగా నిలిచింది.
ఇక ఈ సినిమాలో అన్ని క్యారెక్టర్లకు విలువ ఇచ్చారు. సినిమా ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు పొలిటికల్ నేపథ్యంలో ఉన్నా ప్రతీ ఒక్కరూ తమ పాత్రలో జీవిస్తారు. అయితే ఇందులో మహేష్ బాబును ఇంటర్వ్యూ చేసే సమయంలో ఓ వ్యక్తి ప్రశ్నిస్తాడు. ప్రతీ రాజకీయ నాయకుడు అలాగే ఉంటాడని వ్యంగ్యాస్త్రాలు విసురుతాడు. అయితే అందరూ ఒకేలాగా ఉండరని మహేష్ అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. అలా మహేష్ ను ప్రశ్నించిన చిన్న పాత్రలో నటించిన సుబ్బారావు అలియాస్ రాజశేఖర్ ఈ సినిమాలకంటే ముందే కొన్ని సినిమాల్లో నటించారు.
భరత్ అనే నేను సినిమాలో ‘శుభోదయం సుబ్బారావు’ పాత్రలో నటించిన ఆయన అసలు పేరు రాజశేఖర్ అంగోని. ఈయన అంతకుముందు చాలా సినిమాల్లో నటించారు. 2014లో షురుయాత్ యా ఇంటర్వెల్ అనే చిత్రంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఆ తరువాత పలు సినిమాల్లో నటించారు. ఈయన నటించిన సినిమాలల్లో గోవిందుడు అందరివాడేలే, బాహుబలి ది బిగినింగ్, అరవింద సమేత వీర రాఘవ ఉన్నాయి. రీసెంట్ గా ఆయన ‘రుద్రమాంబపురం’ అనే సినిమాలో నటించారు. అయితే భరత్ అనే సినిమా తరువాత నుంచి ఆయనను ‘శుభోదయం సుబ్బారావు’ అని పిలుస్తున్నారు.