Pushpa 2 OTT Rights : రికార్డు ధరకు పుష్ప 2 ఓటీటీ రైట్స్… అల్లు అర్జున్ రేంజ్ ఇది! బడ్జెట్ మొత్తం అక్కడే లాగేశారుగా!

పుష్ప 2 ఓటీటీ హక్కులు రికార్డు ధరలకు అమ్ముడుపోయాయి. ఓ ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ భారీ ధర చెల్లించిందట. ఓటీటీ రైట్స్ తోనే నిర్మాతలు మూవీ బడ్జెట్ రాబట్టేశారట. ఇంతకీ పుష్ప 2 డిజిటల్ రైట్స్ ఎన్ని వందల కోట్లకు అమ్ముడుపోయాయి అంటే... 

Written By: S Reddy, Updated On : September 1, 2024 11:44 am

Pushpa 2 OTT Rights

Follow us on

Pushpa 2 OTT Rights : అల్లు అర్జున్ ఇమేజ్ ని పూర్తిగా మార్చేసింది పుష్ప మూవీ. అల వైకుంఠపురంలో చిత్రంతో అల్లు అర్జున్ కెరీర్లో ఫస్ట్ ఇండస్ట్రీ హిట్ నమోదు చేశాడు. ఆ చిత్రం 2020 సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. అల వైకుంఠపురంలో అనంతరం విడుదలైన పుష్ప అల్లు అర్జున్ పాపులారిటీ అమాంతం పెంచేసింది. నార్త్ ఇండియాలో ఆయనకు విపరీతమైన ఫాలోయింగ్ పెరిగింది. తెలుగుతో సమానంగా హిందీలో పుష్ప 2కి డిమాండ్ ఏర్పడింది. 
 
2021లో పుష్ప విడుదల కాగా అల్లు అర్జున్ కెరీర్ హైయెస్ట్ నమోదు చేశాడు. వరల్డ్ వైడ్ పుష్ప రూ. 350 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. పుష్ప చిత్రానికి కొనసాగింపుగా పుష్ప 2 తెరకెక్కిస్తున్నారు. పుష్ప 2 ఆగస్టు 15న విడుదల కావాల్సింది. షూటింగ్ పూర్తి కాని నేపథ్యంలో వాయిదా పడింది. డిసెంబర్ 6న వరల్డ్ వైడ్ పుష్ప 2 విడుదల కానుంది. 
 
కాగా పుష్ప 2 కి ప్రేక్షకుల్లో ఉన్న డిమాండ్ రీత్యా భారీగా బిజినెస్ చేస్తున్నట్లు సమాచారం. కేవలం ఓటీటీ హక్కుల ద్వారా పుష్ప 2 బడ్జెట్ దాదాపు కవర్ చేసిందట. పుష్ప చిత్రాన్ని వంద కోట్ల బడ్జెట్ లోపే పూర్తి చేశారు. పుష్ప సక్సెస్ నేపథ్యంలో సీక్వెల్ బడ్జెట్ మూడింతలు పెంచారు. పుష్ప 2 బడ్జెట్ రూ. 300 కోట్లు అని తెలుస్తుంది. 
 
కాగా పుష్ప 2 డిజిటల్ రైట్స్ ని నెట్ఫ్లిక్స్ రూ. 270 కోట్లు చెల్లించి దక్కించుకున్నట్లు సమాచారం. తెలుగు, హిందీతో పాటు మిగతా భాషల వెర్షన్స్ మొత్తంగా నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుందట. పోటీ పడి మరీ నెట్ఫ్లిక్స్ పుష్ప 2 డిజిటల్ రైట్స్ కొనుగోలు చేసిందట. పుష్ప 2 బడ్జెట్ డిజిటల్ రైట్స్ తోనే వచ్చేశాయని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. 
 
పుష్ప 2 మొత్తంగా రూ. 1000 కోట్లకు పైగా బిజినెస్ చేయనుందని అంచనా వేస్తున్నారు. పుష్ప 2 చిత్రానికి సుకుమార్ దర్శకుడు. రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు.